Natyam ad

శాంతి భద్రతల్లో పోలీసుల అలసత్వం అవాస్తవం – డిఎస్పీ సుధాకర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసుల నిర్లక్ష్యం, అలసత్వం ఏమాత్రం లేదని పలమనేరు డిఎస్పీ సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో సీఐలు గంగిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి తో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. డిఎస్పీ మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గంలో 30 పోలీస్‌ యాక్ట్ అమలులో ఉందన్నారు.అలా ఉండగా రామచంద్ర యాదవ్‌ రైతుభేరి సదస్సును నిర్వహిస్తామని తెలిపి అనుమతి కోరారన్నారు. సభాస్థలము, తదితర విషయాలపై పూర్తి వివరాలు అందజేయాలని కోరినా ఇవ్వకపోగా హైకోర్టు నుంచి సభకు అనుమతించాల్సిందిగా ఉత్తర్వులు పొందారన్నారు. కోర్టు ఉత్తర్వులను గౌరవించి సభ స్థలం వివరాలు తెలపాలని కోరామన్నారు. దీనిపై ఆయన సదుంలోని కావమ్మ ఆలయం వద్ద నిర్వహిస్తామని తెలిపారని డిఎస్పీ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో సభలు నిర్వహించేందుకు ప్రభుత్వ అనుమతి కావాలని కోరినా పట్టించుకోకుండ చట్టాలను అతిక్రమించి పత్రికల్లో, సోషియల్‌ మీడియాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రైతుభేరి నిర్వహిస్తామని తెలపడంతో ముందుగా పోలీసులు నోటీసు అందజేశామన్నారు. కానీ పట్టించుకోకుండ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ సుమారు రెండు గంటల సేపు రహదారిపై వాహనాలను ఆపి హారన్‌లు మ్రోగిస్తూ ర్యాలీ చేశారని తెలిపారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి రామచంద్ర యాదవ్‌ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని డిఎస్పీ తెలిపారు. దీనిపై వెఎస్సార్‌సీపీ అభిమానులు కొంత మంది ఆయన ఇంటిపై దాడి చేశారని తెలపడంతో పోలీసులను పంపి , లాఠీచార్జ్ కూడ చేయడం జరిగిందన్నారు. అలాగే అర్ధరాత్రి దాక రామచంద్ర యాదవ్‌ ఫిర్యాదు చేయకుండ పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదని ఆరోపించడం బాధకరమన్నారు. ఫిర్యాదు వ్యాట్సాప్‌లో పంపడంతో వెంటనే 19 మంది వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసు నమోదు చేశామని, చట్ట ఉల్లంగన చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన రామచంద్ర యాదవ్‌ , వారి అనుచరులపై కూడ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఆయన ఇంటి వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నిజాయితీగా , చట్టప్రకారం పని చేస్తున్న పోలీసులపై ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు.

 

Post Midle

Tags: Police laxity in peace and security is unreal – DSP Sudhakar Reddy

Post Midle