పోలీసు అమరవీరుల స్మృతి దినత్సవం
ఏలూరు ముచ్చట్లు:
ఏలూరు పోలీసు ప్రధాన కార్యలయం వద్ద గల పోలీసు పరేడ్ గ్రౌండ్ లో పోలీసు అమరవీరుల స్మృతి దినం- 2023 కార్యక్రమానికి అతిధులుగా ఏలూరు రేంజ్ ఏలూరు డిఐజి జి.వి.జి. అశోక్ కుమార్, జిల్లా కలక్టరు వే.ప్రసన్న వెంకటేష్, జిల్లా పరిషత్ ఛైర్మన్ గంట పద్మశ్రీ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ పూజ, వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ డివిజన్ డిఎఫ్ఓ శివశంకర్, తదితరులు హజరయ్యారు. పోలీసు సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. పోలీసు సిబ్బంది కవాతు నిర్వహించి అమర వీరులు కు స్మృతి పేరేడు ను నిర్వహించారు. నిస్వార్థమైన, అంకితభావంతో కూడిన సేవలందిస్తూ ప్రాణాలర్పించిన త్యాగధనులందరికీ నివాళులర్పించారు.ఈ సంవత్సరం దేశం మొత్తముమీద 188 మంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో -01, ప్రాణాలు కోలుపోయిన అమర వీరులులకు శ్రద్దాంజలి ఘటించారు.

Tags: Police Martyrs Memorial Day
