పోలీసుల మేగా వైద్య శిబిరం

ఆసిపాబాద్ ముచ్చట్లు:
 
పోలీసుల సహకారం ప్రజలకు ఎప్పుడూ ఉంటుందని, పోలీసులు ప్రజల్లో ఒకరని కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ అన్నారు.  జిల్లాలోని వాంకిడి మండలం వెలిగి గ్రామంలో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా వాంకిడి పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరం,దుప్పట్లు, నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను జిల్లాకు నూతనంగా ఎస్పీగా వచ్చానని, వచ్చి రాగానే ఓ మంచి కార్యక్రమం చేపట్టాలనుకుంటున్న తరుణంలో వాంకిడి ఎస్.ఐ. దీకొండ రమేష్, సి.ఐ.సుధాకర్ లు వాంకిడి మండలంలోని ఒకప్పటి మావోయిస్టు ప్రభావిత వెలిగి ప్రాంతంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగిందని, చెప్పిన అతి స్వల్ప సమయంలో కేవలం ఒక్క రోజులో మెగా వైద్య శిబిరంతో పాటు దుప్పట్ల పంపిణీ, నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారిని అభినందించారు. మారుమూల గిరిజన ప్రాంతాల పిల్లలు బయటి నుండి వచ్చే వారి మాటలకు ప్రభావితమై భవిష్యత్తును పాడు చేసుకోవద్దని, చదువుతో అన్ని సాధ్యమని, తాను ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే దానికి చదువే కారణమని, కాబట్టి  ఆదివాసి పిల్లలు బాగా చదువుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. పోలీసులు ప్రజల్లో ఒకరిని, అందుకోసమే పోలీసులు మీ కోసమంటూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నామని, ఎలాంటి అవసరం ఉన్నా పోలీసులు, ప్రజలకు  తోడుంటారని అన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.ఈ వైద్య శిబిరంలో పిల్లల వైద్య, నిపుణులు, స్త్రీ వైద్య నిపుణులు జనరల్ ఫిజిషియన్ లాంటి వైద్య నిపుణులు మంచిర్యాల మెడిలైఫ్, హైదరాబాద్ మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి వైద్యులను జిల్లాకు రప్పించడం జరిగింది అన్నారు.
అనంతరం ఏర్పాటుచేసిన సహపంక్తి భోజనం లో ఆదివాసుల తో కలిసి కూర్చుని, భోజనం చేశారు. అంతకుముందు వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువతకు వాలీబాల్ కిట్లను అందజేశారు…
పుంగనూరు ఖ్యాతిని ఢిల్లీకి తీసుకెళ్లిన వర్మ – ఎంపి రెడ్డెప్ప
Tags: Police mega medical camp

Natyam ad