గంజాయి, నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

విశాఖపట్నం ముచ్చట్లు:

గంజాయిని మరియు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక సి. ఐ. ఆర్. వి. వి. ఎస్. ఎస్. సీచ్. చంద్ర శేఖర్ రావు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం 5 గంటల నుంచి6గంటల ప్రాంతంలో సబ్బవరం మూడురోడ్ల జంక్షన్ లో  గస్తీ కాస్తున్న హెడ కానిస్టేబుల్ ఒక వ్యాను ను అనుమానం వచ్చి అపాక వారు కొంత దూరం వెళ్లి అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయారు అని సి. ఐ. పాత్రికేయులు కు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తంగా వారిని తవ్వవని పాలెం ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న మామడి తోటలో అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు ఇద్దరు బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించడం జరిగింది అని పూర్తి వివరాలు దర్యాప్తులో తెలుస్తుందని తెలిపారు. కాగా ఈ రోజు ఉదయం నుంచి సబ్బవరం పోలీసులు కళ్ళుకప్పి గంజాయి దొంగలు పారిపోయారు అని, ఒక వార్తా సామాజిక మాధ్యమంలో విపరీతంగా హాలచల్ చేస్తుంది అని అది నిజం కాదని అన్నారు. గతంలో గంజాయిని మరియు నిందితులను పట్టుకోవడం జరిగింది అని వారిని న్యాయ స్థానంలో హాజరుపరచడం, వారిని రిమాండ్ కు తరలించడం అన్ని జరిగిపోయాయి అని దానికి ఈ కేసు కి సంబంధము లేదన్నారు.

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

 

Tags:Police nabbing marijuana and suspects

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *