కడమకుంట్ల గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసు అధికారులు

Date:20/05/2019

తుగ్గలి  ముచ్చట్లు:

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రావడం దగ్గర పడడంతో తుగ్గలి మండల పరిధిలోని గల కడమకుంట్ల గ్రామంలో జొన్నగిరి ఎస్ఐ విజయ్ కుమార్ పోలీస్ సిబ్బందితో కలసి తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ జిల్లా పోలీసు అధికారుల ఆదేశాల మేరకు సమస్యాత్మక గ్రామాలలో కొందరి వ్యక్తుల ఇంటిలో తనిఖీలు నిర్విహించమని తెలియజేసారు.గ్రామాలలో ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎస్.ఐ గ్రామస్తులకు తెలియజేసారు.సార్వత్రిక ఎన్నికల ఫలితాల వలన గ్రామంలో ఎటువంటి గొడవలు,అల్లర్లు సృష్టించకూడదని గ్రామస్తులకు ఎస్ఐ విజయ్ కుమార్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో       ఏ.ఎస్ఐ లు,జొన్నగిరి మరియు తుగ్గలి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

ఇంస్టాగ్రామ్ లో ప్రెస్టీజియస్ “సాహో” న్యూ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్న రెబెల్ స్టార్ ప్రభాస్

Tags: Police officers conducting a corred search in the village of Kathakunthala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *