Natyam ad

కాకినాడలో పోలీసు ఓపెన్ హౌస్

కాకినాడ ముచ్చట్లు:

చట్టాలు, ఆయుధాల మీద అవగాహన కోసం కాకినాడ జిల్లా పోలీసుల వినూత్న ప్రయోగం చేశారు. ఓపెన్ హౌస్ ప్రదర్శన ఏర్పాటు చేసి.. విద్యార్ధులకు చక్కటి అవకాశాన్ని కల్పించారు.వాస్తవానికి శాంతిభద్రత లు కాపాడటం కోసం పోలీస్ డిపార్ట్ మెంట్ ఎంతో కష్టపడుతుంది. వాళ్లు వేసుకున్న యూనిఫామ్ వాళ్లకు గౌర వం అయితే.. చేతిలో పట్టుకునే ఆయుధమే వాళ్ల బలం. పోలీసులు వాడే ఆయుధాలతో పాటు అనేక పరికరాలు.. ఎలా ఉంటాయి. అవి ఎలా పనిచేస్తాయనేది తెలుసుకోవా లని చాలామందికి ఆసక్తి ఉంటుంది. వారి కోసమే జిల్లా అధికారులు వినూ త్నంగా ఏటా ఓపెన్ హౌస్ కార్యక్రమా న్ని ఏర్పాటు చేశారు.పోలీసులు వాడే ఆయుధాలు, కవచాలు, ఆధునిక సాంకేతిక పరికరాలను ప్రదర్శించారు. వాటిపై విద్యార్ధులకు అవగాహన కల్పించారు.శాంతిభద్రతల పరిరక్ష ణతో పాటు కేసుల దర్యాప్తులో.. పోలీసులు ఉపయోగించే ఆయుధా లు, రక్షణ పరికరాలను వివరించారు. ఆయుధాలతో పాటు వాటి విడి భాగా లు, మెటల్ డిటెక్టర్, డ్రాగన్ లైట్, రాకెట్ లాంచర్, బాంబు డిస్పోజల్ పరికరాలు, ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికే షన్ నెట్వర్క్ సిస్టమ్, పోలీస్ కంట్రోల్ రూమ్ పరికరాలు, కమ్యూనికేషన్ మ్యాన్ ప్యాక్ సెట్లు,డాగ్ స్క్వాడ్, సెల్ జామర్లతో పాటు దిశ వాహనాలు, దిశ యాప్, ట్రాఫిక్ నియమాల గురిం చి విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి,ఎమ్మెల్యే కన్నబాబు పాల్గోన్నారు.

 

Tags: Police Open House in Kakinada

Post Midle
Post Midle