Natyam ad

విద్యా సంస్థల బంద్ ను అడ్డుకున్న పోలీసులు

అన్నమయ్య ముచ్చట్లు:

విద్యారంగ సమస్యల పరిష్కారణకై విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వ ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 23న జరిగే రాష్ట్ర విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలని అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో వివిధ పాఠశాలలు జూనియర్ కళాశాలలకు వెళ్లి బంద్ చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు.ఈ సందర్భంగా పిడియస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.అంకన్న, ఎమ్మార్పీఎస్ రాయచోటి నియోజకవర్గ ప్రధాన నాయకుడు రామాంజనేయులు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు,ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు నరసింహలు , ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు    తుమ్మల లవకుమార్,ఎస్ఎఫ్ఐ రాయచోటి ప్రధాన నాయకుడు ఫయాజ్, పిడిఎస్ యు జిల్లా కోశాధికారి జోకిశ్వర్, పిడిఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరమణలు మాట్లాడుతూ.. విద్యా సంవ త్సరం ప్రారంభమై సుమారు 40 రోజులవుతున్న నేటికీ పూర్తి స్థాయిలో జగనన్న విద్యా కానుక అందించ లేదన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే మూడేళ్లయిన నేటికీ విద్యారంగంలో నాణ్యత ప్రమాణాలు పెం చలేక పోయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయా లని డిమాండ్ చేశారు.

 

 

 

Post Midle

నూతన విద్యా విధా నం పేరుతో పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా నూతన జాతీయ విద్యా విధానం అమలు కాకపోయిన ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలలో భాగంగా 3,4,5 తరగతులను హైస్కూల్లో విలీనం చేస్తుందన్నారు. 3,4,5 తరగతులు విలీనం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 8,000 పాఠశాలలో పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారన్నారు. మన జిల్లాలో 174 ప్రాథమిక పాఠశా లలో వేలాది మంది విద్యార్థులు విద్యకు దూర మవుతున్నారన్నారు. అర్హులైన విద్యార్థులం దరికీ అమ్మ ఒడి, విద్య దీవెన, వసతి దీవెన ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాల నుండి యూనివర్సిటీ స్థాయి వరకు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, ప్రొఫెసర్, లెక్చరర్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులు దోపిడీని అరికట్టాలని ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని కోరారు. బైజుస్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవా లని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్స్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 77 రద్దుచేసి పీజీ విద్యార్థులు అందరికీ పూర్తి ఫీజులు ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలు విన్నాడాలని అందరికీ విద్య అందుబాటులోకి ఉండే విధంగా చూడాలని అన్నారు.

 

Tags: Police prevented the bandh of educational institutions

Post Midle