నాటుసారా స్థావరంపై పోలీసుల దాడి..

కుక్కునూరు  ముచ్చట్లు:

 

కుక్కునూరు మండలం, శ్రీధర వేలేరు పంచాయతీ పరిధిలోని వేలేరు అటవీ ప్రాంతంలో గత కొంత కాలంగా నాటు సారా తయారీ పెద్ద ఎత్తున జరుగుతోందని, పెద్ద ఎత్తున నాటు సారా తయారు చేసి గ్రామాలకు సరఫరా చేస్తున్నారని, సారా తయారీపై సమాచారం అందడంతో వేలేరు పరిధిలోని అటవీ ప్రాంతంలో కుక్కునూరు పోలిస్ సిబ్బంది మరియు సెబ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరావులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో  నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న వెయ్యి లీటర్ల పులియబెట్టిన బెల్లపు ఊటను ధ్వంసం చేసి, 40 లీటర్ల నాటు సారా, డ్రమ్ములు, ఇతర సారా తయారీ సామాగ్రిని  స్వాధీనం చేసుకున్నామని, పోలీసులు మరియు సెబ్ అధికారుల రాకను గమనించిన సారా తయారీదారులు పరారయ్యారు. ఈ సందర్భంగా కుక్కునూరు ఎస్సై శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నాటుసారా తయారీకి కారకులైన వారిని పట్టుకొని వారిపై కేసు నమోదు చేస్తామన్నారు. ఎవరైనా నాటుసారా తయారీ చేసిన, అమ్మిన్నట్టు తెలిసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడిలో సెబ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరావు, కుక్కునూరు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags: Police raid Natsara base ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *