ఎర్ర చందనం స్మగ్లర్లపై పోలీసుల మెరుపుదాడి
కడప ముచ్చట్లు:
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసుల మెరుపు దాడులు జరిపారు. అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ ఫక్రుద్దీన్ తో పాటు మరో ఏడు మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసారు. రెండు కేసుల్లో సుమారు రెండు టన్నుల బరువున్న 55 దుంగలు, నాలుగు కార్లు, 9.5 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా, ఇతర ప్రాంతాల్లో 71 ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో ముద్దాయిగా ఉన్న చాపాడు మండలం కదిరిపల్లెకు చెందిన అంతర్రాష్ట్ర స్మగ్లర్ ఫక్రుద్దీన్ తోపాటు యాసీన్, తమిళనాడుకు చెందిన కామరాజు, కాజీపేటకు చెందిన వీరభద్రుడు, ప్రకాశం జిల్లాకు చెందిన గోపి నాయక్, అనంతపురం జిల్లాకు చెందిన బోయ అరవింద్ లను అరెస్ట్ చేసారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అన్బు రాజన్ హెచ్చరించారు. ఎర్రచందనం అక్రమ రవాణా గుట్టు రట్టు చేసిన కడప జిల్లా ఫ్యాక్షన్ జోన్ డిఎస్పీ చెంచు బాబు, టాస్క్ ఫోర్స్ సి.ఐ లు నాగభూషణం, సత్యబాబు, ఆర్.ఎస్సై పోతురాజు, ప్రొద్దుటూరు టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇబ్రహీం, సిబ్బంది, చెన్నూరు ఎస్సై శ్రీనివాసులురెడ్డి, ఖాజీపేట ఎస్సై కులాయప్ప మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Tags: Police raid on red sandalwood smugglers
