వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు దాడులు

కోరుట్ల ముచ్చట్లు:

 

 

జగిత్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి, గోదురు గ్రామాలలో అక్రమ వడ్డీ, ఫైనాన్సు వ్యాపారుల ఇళ్లపై గురువారం మెట్ పల్లి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.ఈ సందర్భంగా రూ 75,16,500 రూపాయలు
నాన్ జుడిసియల్ బాండ్ పేపర్-(1), ప్రాంసరి నోట్స్ -(83), చెక్కు లు -(17)లని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు తమకు ఉన్న అత్యవసర పరిస్థితి, తాత్కాలిక ఇబ్బందుల కోసం అధిక మొత్తంలో అవసరంకు మించి అధిక వడ్డిలకు అప్పులు చేసి తరువాత ఆ అప్పులు, అధిక వడ్డీలు చెల్లించ లేక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడి తమ కుటుంబాలను కష్టాల పాలు చేసుకోవద్దని సూచించారు.

 

 

 

ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన సరైన పద్దతులలో ఫైనాన్స్ నిర్వహించే వారిని మాత్రమే నమ్మాలని, ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకపోయిన అక్రమ ఫైనాన్సు వ్యాపారం నడిపేవారి వివరాలను పోలీస్ వారికీ తెలియచేయాలన్నారు. అప్పు తీసుకోవడం,ఇవ్వడం నేరం కాదు కానీ ఆర్బీఐ నియమనిబందనలు, తెలంగాణా మని లెండింగ్ చట్టంలోని నిబందనల ప్రకారం చట్ట బద్దంగా ఎవరైనా లైసెన్స్ తో అప్పులు ఇవ్వవచ్చు, తీసుకోవచ్చు అన్నారు.
అయితే చట్ట విరుద్ధంగా, అధిక వడ్డీ రేట్లతో సామాన్యుల పై దౌర్జన్యం చేస్తే వారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సింధూశర్మ హెచ్చరించారు. ఈ తనిఖీ లో మెట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్. శ్రీనివాస్, ఇబ్రహంపట్నం ఎ.ఎస్.ఐ ఆర్ రవీందర్ రెడ్డి పోలీసు సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

 

Tags: Police raid the homes of moneylenders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *