Police rescued 5 people with a dial 100 call.

డయల్ 100 కాల్ తో 5 మందిని కాపాడిన పోలీసులు.

Date:23/02/2020

వాయల్పాడు ముచ్చట్లు:

సమస్యా… ఆపదా.. కాల్ చేయండి. మీ సేవలో, రక్షణలో డయల్ 100, పోలీస్ వాట్స్అప్ నెంబర్ 9440900005. చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలు, ఆపదా.. ఒకటని కాదు ఏవైనా… ఏమైనా సరే ఒక్క కాల్ చాలు నిమిషాల వ్యవధిలో పోలీసుల హాజరు.. అపదలో వున్న వారికి అభయ హస్తం, అక్రమార్కుల పాలిట సింహస్వప్నం ఇవి డయల్ 100 మరియు పోలీస్ వాట్స్అప్ నెంబర్ 9440900005 ల పనితీరు. పోలీసుల సేవల పట్ల ప్రజల నమ్మకం పెంచుతూ 24×7 పనిచేస్తున్న కమాండ్ & కంట్రోల్ కేంద్రాలు, వాటికి అనుసంధానమైన 81 బ్లూ కోల్ట్స్ మోటార్ సైకిల్లు, 14 రక్షక్ వాహనాలు మరియు 20 హైవే పెట్రోలింగ్ వ్యవస్థలతో నిరంతరం పనిచేస్తున్న పోలీసులు.

 

22 వ తేది సాయంత్రం సుమారు 4.04 నిమిషాలకు డయల్ 100 కు హరిత అనే విద్యార్థిని ఫోన్ చేసి తనతో పాటు మొత్తం 5 మంది వాయల్పాడు పట్టణం కు దగ్గరలో వున్న వీరన్న కొండ పై వెలసిన వీరభద్ర స్వామి ఆలయ సందర్శన కు వచ్చి తిరుగు ప్రయాణంలో దారి తప్పి అడవిలో చిక్కుకున్నామని తమను కాపాడవలసినదిగా తెలిపినది. డయల్ 100 సిబ్బంది వెనువెంటనే ఎస్సై వాయల్పాడు శ్రీ వెంకటేశ్వర్లు గారికి సమాచారం అందజేశారు. అ సమయంలో కలకడ నందు బందోబస్తు డ్యూటీ లో ఎస్.ఐ. వాయల్పాడు పోలీసు స్టేషన్ కు సమాచారం .

 

 

 

అందించి స్టేషన్ నందు అందుబాటులో వున్న కానిస్టేబులైన మహమ్మద్ అలీ, జయచంద్ర మరియు బాబా అనే హోం గార్డ్ ను వెంటనే తప్పి పోయిన వారిని వెతికి తెచ్చుటకు వీరన్న కొండ ఆ పరిసర ప్రాంతంలో వున్న అడవిలో పంపారు. సదరు కానిస్టేబుల్ లు వీరన్న కొండ పైకు వెళ్లి సుమారు 1 గం. పాటు వీరన్న కొండ, పరిసర ప్రాంతంలో వున్న అడవిలో వెదికి తప్పి పోయిన 5 మంది ఒక స్త్రీ, ఆమె 7 సం. కుమారుడు మరియు 3 అమ్మాయిలను సురక్షితంగా వాయల్పాడు పోలీసు స్టేషన్ గం.

 

 

5.30 నిమిషాలకు తీసుకోని వచ్చి విచారించి, వారి పెద్దలు, తల్లిదండ్రులను పోలీసు స్టేషన్ పిలిపించి వారి సమక్షంలో అప్పగించడం జరిగినది. డయల్ 100 కాల్ మీద తక్షణమే స్పందించి అడవిలో చిక్కుకొన్న 5 మందిని కాపాడిన వాయల్పాడు పోలీసులను చిత్తూరు ఎస్పీ శ్రీ సెంథిల్ కుమార్ ఐపిఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోడ్డు ప్రమాద క్షతగాత్రులను, వివిధ రకాల బాడిలీ అఫెన్సెస్ ను, పేకాట, ఈవ్ టీజింగ్, ఇసుక అక్రమ రవాణాలకు అడ్డుకట్ట… ఇలా ఎన్నో ప్రజోపయోగ సేవలను డయల్ – 100 ద్వారా వచ్చిన సమాచారంతో పోలీసులు కట్టడి చేస్తూ సేవలు అందిస్తున్నారు. ప్రజల నుండి వచ్చిన కాల్స్ కు పట్టణ ప్రాంతాల్లో 5 నిముషాల లోపు, రూరల్ ప్రాంతాల్లో 18 నిముషాల రెస్పాన్స్ టైం లలో పోలీసులు సేవలందిస్తున్నారు.

 

 

 

ఇలా ఒకటని కాదు, ప్రజలకు ఏ సమస్య వచ్చినా, ఆపద వచ్చిన భయబ్రాంతులకు గురి కాకుండా కాల్ చేస్తే చాలు అతి తక్కువ వ్యవధిలో పోలీసుల సేవలు వారి ముందు. కావున జిల్లా ప్రజలు డయల్ 100 మరియు పోలీస్ వాట్స్ యాప్ సేవలను ఉపయోగించుకొని పోలీసు శాఖ వారి సేవలను పొందటమే కాకుండా చట్ట వ్యతిరేక, సంఘ వ్యతిరేక కార్యక్రమాలను అరికట్టుటలో పోలీసు వారికి సహకరించవలసినదిగా పోలీసు వారి విజ్ఞప్తి.

గుట్కా అక్రమ రవాణాపై పోలీస్ పంజా

Tags: Police rescued 5 people with a dial 100 call.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *