Natyam ad

పోలీసు స్పందన కార్యక్రమం తాత్కాలికంగా రద్దు

నంద్యాల ముచ్చట్లు:

నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో జరగబోయే ” స్పందన కార్యక్రమము”ను  తాత్కలికంగా రద్దు  చేసినట్లు  జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి   శనివారం  ఒక ప్రకటనలో తెలిపారు.
సోమవారం (ఆగష్టు 15) 76 వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల సంధర్బంగా పోలీసు అధికారులు అందుబాటులో లేకపోవడం  వలన  స్పందన కార్యక్రమం రద్దు చేయడం జరిగిందన్నారు .కావున అర్జీదారులు సుదూర  ప్రాంతాల నుండి వ్యయ , ప్రయాసలతో  జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే  స్పందన కార్యక్రమం కు రావొద్దని తెలిపారు.జిల్లా  ప్రజలు ( ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించగలరని జిల్లా ఎస్పీ  విజ్ఞప్తి చేశారు. ఆగష్టు 22 సోమవారం  “స్పందన కార్యక్రమం” యధావిధిగా నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయం నందు జరుగును  ప్రజలు ఈ విషయాన్ని గమనించగలరని జిల్లా ఎస్పీ తెలిపారు.

 

Post Midle

Tags: Police response program temporarily suspended

Post Midle

Leave A Reply

Your email address will not be published.