పాలకుర్తిలో దుకాణాలకు బంద్ చేయించిన పోలీసులు

పాలకుర్తి ముచ్చట్లు:

బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న”ప్రజా సంగ్రామ యాత్ర” 14 వ రోజుకు చేరుకుంది. మంగళవారం నాడు విసునూరు గ్రామంలోని శ్రీరమా సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని అయన సందర్శించారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని… అందరూ బాగుండాలని ప్రార్ధించారు. అనంతరం పాదయాత్ర గా ముందుకు కదిలారు. వేలాదిగా తరలివచ్చిన బిజెపి శ్రేణులు పాదయాత్రలో పాల్గోంటున్నారు.అయితే, సోమవారం నాటి ఘటనల నేపధ్యంలో పాలకుర్తిలో దగ్గరుండి షాపులన్నీ పోలీసులు  మూసివేయించారు. టీ కొట్టు, పాన్ షాపులు సహా దుకాణాలన్నీ  బంద్ చేయించారు. ఎందుకు మూసేయాలని  స్థానిక వ్యాపారులు ప్రశ్నించారు. రాళ్ల దాడి జరిగితే దెబ్బలు తగలకుండా ఉండేందుకే షాపులు మూసేయిస్తున్నామని పోలీసులు  జవాబునిచ్చారు.

 

Tags: Police shut down shops in Palakurti

Leave A Reply

Your email address will not be published.