కాంగ్రెస్ నేత శ్రీనివాస్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

టీటీడీ కళ్యాణ మండపం దగ్గర ఉద్రిక్తత

 

అదిలాబాద్ ముచ్చట్లు:

 

అదిలాబాద్  కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి తన ఫౌండేషన్ ద్వారా పంపిణీ చేస్తున్న ప్రెషర్ కుక్కర్ల పంపిణీని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న మరోసారి అడ్డుకున్నారు. ప్రెజర్ కుక్కర్ల పంపిణీ వాహనాలను పోలీసులు  సీజ్ చేసారు. జోగురామన్న డౌన్ డౌన్ అంటూ మహిళలు నినాదాలు చేసారు. వాహనాల ముందు బైఠాయించారు. జోగురామన్న, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. కంది శ్రీనివాసరెడ్డికి వస్తున్న ఆదరణ తట్టుకోలేక జోగురామన్న కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ నేపధ్యంలో టిటిడి కల్యాణ మండపం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కంది శ్రీనివాసరెడ్డిపై వరుస కేసులు నమోదువుతున్నాయి. ఆదిలాబాద్ ప్రజల కోసం ఎన్నికేసులైనా భరిస్తానని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. కంది శ్రీనివాసరెడ్డిని అష్టదిగ్భంధనం చేయాలంటూ అధికారులపై జోగురామన్న ఒత్తిడి తెస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఓటమి భయంతో జోగురామన్న కుట్రలు చేస్తున్నారంటూ భగ్గుమంటున్నారు.

 

Post Midle

Tags: Police stopped Congress leader Srinivas Reddy

Post Midle