Natyam ad

రేణుకా చౌదరీని అడ్డుకున్న పోలీసులు

ఖమ్మం ముచ్చట్లు:


ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు లో జరిగిన బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా బాణాసంచా వలన గ్యాస్ పేలిన ఘటన లో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే.మరణించిన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుక చౌదరిని పోలీసులు అడ్డుకున్ఆనరు. దాంతో ఆమె పోలీసులతో రేణుక వాగ్వాదానికి దిగారు. కామేపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఈ అడ్డగింత జరగడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు పలువురు అందోళనకు దిగారు. దీంతో ఖమ్మం ఇల్లందు ప్రధాన రహదారిపై వాహన రాకపోకలు ఆగిపోయాయి.

 

Tags: Police stopped Renuka Chaudhary

Post Midle
Post Midle