Natyam ad

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి.

-నెలవారీ నేర సమీక్షా సమావేశం

➡️ రాబోయే ఎన్నికలలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా గట్టిగా పని చేయాలి..ఎన్నికలను శాంతియుతంగా జరిపించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

➡️ ఎన్నికల నియమ నిబంధనల అమలు విషయంలో అలసత్వం గాని, అవకతవకలకు గాని పాల్పడితే ఎవరూ కాపాడలేరు..చట్టం దృష్టిలో అందరూ సమానమే.. చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరు.

Post Midle

➡️ ఎన్నికల ట్రబుల్ మాంగర్స్, రౌడీ షీటర్లను వెంటనే బైండోవర్ చేసి, వారి కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలి.

➡️ ఎన్నికల దృష్ట్యా క్షేత్ర స్థాయిలో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుల ఏర్పాటుకు అవరమైన ప్రాంతాలను గుర్తించి, తగిన సిబ్బందిని నియమించి సంబంధిత SDPO లు నిరంతరం పర్యవేక్షిస్తూ అక్రమ రవాణాను కట్టడి చేయాలి.

➡️ లైసెన్సుడ్ ఆయుధాలను వెంటనే SHO లు పోలీస్ స్టేషన్ల నందు డిపాజిట్ చేయించుకుని, ఎలక్షన్ కోడ్ ఉన్నంతవరకు భద్రపరచాలి.

➡️ రోడ్డు ప్రమాదాల నివారణకు రహదారులపై ఎన్ఫోర్స్మెంట్ విధులను పెంచాలి.

➡️ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.

➡️ నాన్ బెయిలబుల్ వారెంట్లను సమర్థవంతంగా అమలు చేసి నేరస్తులను కట్టడి చేయాలి.

➡️ నేర నియంత్రణ విషయంలో సమిష్టి కృషి సమన్వయంతో పనిచేయాలని అధికారులకు దిశ నిర్దేశం.

అనంతపురం రేంజ్ డిఐజి   ఆర్.ఎన్.అమ్మి రెడ్డి ఐపిఎస్.,

జిల్లా ఎస్పీ   పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్.,

 

తిరుపతి  ముచ్చట్లు:

శనివారం నాడు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సావేరి అతిథి గృహం సమావేశ మందిరం నందు జిల్లా పోలీస్ అధికారులతో అనంతపురం రేంజ్ డీఐజీ   ఆర్.ఎన్. అమ్మిరెడ్డి ఐపిఎస్., తిరుపతి జిల్లా ఎస్పీ   పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., వారు నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అనంతపురం రేంజ్ డీఐజీ గారు మాట్లాడుతూ ప్రస్తుతం నడుస్తున్న ఈ మూడు నెలలు అత్యంత క్లిష్టమైన రోజులు అనీ, మనం అప్రమత్తంగా ఉండకపోతే అందరూ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందినీ.. ముఖ్యంగా సమస్యలు ఎక్కడ నుండి ఉత్పన్నం అవుతున్నాయో తెలుసుకొని సకాలంలో పరిష్కరించుకోవాలన్నారు. ఈ రోజు నుండే మనం తగు చర్యలు తీసుకోవడానికి సమాయత్తం కావాలన్నారు.క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్న గ్రామాలు/వార్డులను ప్రతిరోజు SHO లు, SDPO లు సందర్శించి, స్థానికులతో సమావేశమై ముందస్తు సమాచారాన్ని సేకరించి ఎన్నికల నియమావళిని వివరించి అక్కడ నివసిస్తున్న ఎలక్షన్ ట్రబుల్ మాంగర్స్ కదలికలను అరికట్టాలి. SHO లు అందరూ తమ పరిధిలోని ప్రతి పోలింగ్ స్టేషన్ల భౌగోళిక స్థితిగతులను తెలుసుకొని శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించే విధంగా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు.

 

 

అమాయక ప్రజలను అనవసరంగా ఎన్నికల కేసులలో ఇరికించవద్దు. పాత ఎన్నికల ట్రబుల్ మాంగర్స్ ను బైండోవర్ చేసి తరచుగా కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఉక్కు పాదం మోపి వారిని నిలువరించాలని అనంతపురం రేంజ్ డీఐజీ  ఆర్.ఎన్.అమ్మిరెడ్డి ఐపీఎస్.,  వివరించారు.జిల్లా ఎస్పీ  పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో, విధుల యందు ఏ అధికారి లేదా పోలీసు సిబ్బంది పక్షపాతంతో వ్యవహరించకూడదు. పోలింగ్ స్టేషన్ లో ఏదేని అక్రమాలు జరిగినప్పుడు లేదా జరుగుతున్నట్టు తెలిస్తే మౌనం వహించకూడదన్నారు. ఎన్నికల నిబంధనలు మరియు విధులను ఉల్లంఘించిన అధికారులు మరియు సిబ్బంది పై భారత ఎన్నికల సంఘం తీవ్రమైన చర్యలు తీసుకుంటుంది అన్నారు.అలాగే ఎన్నికల విధుల యందు పోలీసులు వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు గాని, పని గాని చేయకూడదు. ఎన్నికల నియమావళిని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఓటర్లను ప్రభావితం చేయడం లేదా ప్రలోభాలకు గురి చేయడం వంటి ఎలాంటి ఘటనలు కూడా జరగకుండా పోలీసులు భాద్యత వహించాలి. ఎన్నికలే కదా అని విధుల యందు అలసత్వం పనికిరాదు. ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా ఎన్నికల నియమావళి ప్రకారం శాఖ పరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని హెచ్చరించారు.

 

 

జిల్లా పోలీసుల సమిష్టి కృషి ఫలితంగా గత ఏడాది కంటే పలు నేరాల సంఖ్య తగ్గిందన్నారు. ముందస్తు సమాచారం, సమిష్టి కృషి, సమన్వయంతో అసాంఘిక శక్తులను అణచి వేయడంలో సత్ఫలితాలను పొందామన్నారు. కోడి పందాలు, గంజాయి, మద్యం,నాటుసారా అక్రమ రవాణను నియంత్రించామన్నారు. ఇదే స్ఫూర్తిని రాబోయే రోజుల్లో కూడా చూపి, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు.ఎన్నికల దృష్ట్యా తుపాకుల లైసెన్సులను కలిగిన వారిని క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని, వాటిని రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి నిబంధనల ప్రకారం సీజ్ చేయలని, లైసెన్సుడ్ ఆయుధాలను వెంటనే పోలీస్ స్టేషన్ల నందు డిపాజిట్ చేయించుకుని ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నంతవరకు భద్రపరచాలన్నారు. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో సమస్యలు సృష్టించే వ్యక్తులను గుర్తించి వారిలో సత్ప్రవర్తన వచ్చేందుకు వారిని బైండోవర్ చేయాలన్నారు. సమాచార వ్యవస్థను మెరుగుపర్చుకోవాలని, గ్రామ/వార్డు స్థాయిలో సమాచార వ్యవస్థను మెరుగుపరుచుకునీ ఏదైనా సమస్యలు ఉంటే చర్యలు చేపట్టాలన్నారు.

 

 

ఎన్నికల దృష్ట్యా SDPO లు క్షేత్ర స్థాయిలో భౌగోళికంగా పర్యటించి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, తగిన పోలీస్ సిబ్బందిని నియమించి సమర్థవంతంగా తనిఖీలను నిర్వహించి ఎలాంటి అక్రమ రవాణాకు తావు లేకుండా కట్టడి చేయాలన్నారు.గంజాయి, నాటుసారా అక్రమ రవాణకు పాల్పడే వ్యక్తులను గుర్తించి, వారిపై పి.డి.యాక్ట్ నమోదు చేయాలని, వివిధ పోలీసు స్టేషనుల్లో చెడు నడత కలిగిన వ్యక్తులపై ఉన్న హిస్టరీ షీట్లును పరిశీలించి, అవసరమైన వ్యక్తులపై నిఘా ఉంచేందుకు వారి హిస్టరీ షీటులను కొనసాగించాలనీ అన్నారు. సంబంధించిన ప్రతిపాదనలను పంపాలని అధికారులను జిల్లా ఎస్పీ  ఆదేశించారు.మహిళలపై జరిగిన దాడులు నియంత్రించడంలోను, లోక్ అదాలత్ లో ప్రత్యేక ప్రణాళికతో పని చేసి, ఎక్కువ కేసులను డిస్పోజ్ చేయడంలోను, దర్యాప్తులో ఉన్న కేసులను తగ్గించడంలో సఫలమయ్యామని, అధికారులను అభినందించారు.పోక్సో కేసుల్లో పోలీసు అధికారులు సమగ్ర దర్యాప్తు, సాక్ష్యాలు సేకరణ, సాంకేతిక నైపుణ్యం, ప్రాసిక్యూషను విచారణపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి, కేసులను నిరంతరం పర్యవేక్షించి, సమీక్షించి ముద్దాయిలకు శిక్షపడుటలో క్రియాశీలక పాత్ర పోషించారన్నారు.గత ఏడాది దర్యాప్తులో ఉన్న కేసుల్లో ఎక్కువ కేసులను వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేసినందుకు, ఆస్తికి సంబంధించిన కేసులను ఎక్కువగా చేధించినందుకు, నాన్-బెయిలబుల్ వారెంట్లు ఎక్జిక్యూషన్ చేసినందుకు గాను, బందోబస్తు విధులను సమర్ధవంతంగా నిర్వహించిన అధికారులు, సిబ్బందికి జిల్లా ఎస్పీ  పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., అభినందించారు.

 

 

అనంతరం జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణ చేయడంలో, కేసులను ఛేదించడంలో, శాంతి భద్రతలను కాపాడుటలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రోత్సాహకంగా ప్రశంసా పత్రాలను అందజేసి అనంతపురం రేంజ్ డీఐజీ , తిరుపతి జిల్లా ఎస్పీ వారు అభినందించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు  వెంకటరావు పరిపాలన,  కులశేఖర్ శాంతిభద్రత, విమల కుమారి నేర విభాగం,  రాజేంద్ర సెబ్, ట్రైనీ ఐపీఎస్  పాటిల్ దేవరాజ్ మనీష్, జిల్లాలోని డీఎస్పీలు, సిఐలు, ఎస్సైలు మరియు ప్రశంసా పత్రాలు అందుకున్న సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Police system should be vigilant in view of approaching elections.

Post Midle