ఫైనాన్స్ వ్యాపారంపై పోలీసులు కొరడా..

-ఫైనాన్స్ నిర్వహకుల ఇళ్లపై
-పోలీసుల ఆకస్మిక తనిఖీలు

జగిత్యాల ముచ్చట్లు:

 

జిల్లా ఎస్పీ సీంధుశర్మ ఆదేశాల మేరకు జగిత్యాల పట్టణంలో అక్రమ ఫైనాన్సు , వడ్డీ వ్యాపార నిర్వాహకులపై శుక్రవారం నాడు జగిత్యాల పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరి ఇళ్ళలో నాన్ జుడిసియల్ బాండ్ పేపర్-(16), రూ:1,14,00,000, విలువ గల (310)ప్రాంసరి నోట్స్,రూ:31,00,000,విలువ గల (16)చెక్కులు, సేల్ డిడి లు-(2) జప్తు చేశారు.
ఈ తనిఖీ లో జగిత్యాల డి ఎస్ పి వెంకటరమణ, టౌన్ ఇన్స్పెక్టర్ జయేశ్ రెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, బీర్పుర్ ఎస్ ఐ అనిల్ కుమార్, బుగ్గారం ఎస్ ఐ ఉపేంద్ర చారి, ట్రాఫిక్ ఎస్సై డి. నవత తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags: Police whip finance business

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *