ఏపీలో రాజకీయ మార్పులు..

నెల్లూరు ముచ్చట్లు:

డిసెంబరు 3 తర్వాత రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో పెనుమార్పులు చోటుచేసుకోవచ్చని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ మాజీ ఎంపీ చింతా మోహన్ ఢంకా బజాయించి చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌దే విజయమంటున్నారు. ఇక్కడ ఎలా బలపడతారంటే డిసెంబరు 3 దాకా ఎదురు చూడమంటున్నారు. ఇటీవల అనేక సందర్భాల్లోనూ ఆయన ఇదే ధీమా వ్యక్తం చేశారు. వైసీపీలోని సీనియర్ నేతలంతా ఒకప్పటి కాంగ్రెస్ నాయకులే. వీళ్లంతా మళ్లీ సొంత గూటికి వస్తారనే ఊహాగానాలు తెరమీదకు వస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్‌‌తో ఇమడలేక పోతున్న సీనియర్లకు ఇప్పటిదాకా సరైన ప్రత్యామ్నాయం దొరకలేదు. ఇష్టమున్నా లేకున్నా గుంభనంగా వైసీపీనే అంటిపెట్టుకొని ఉన్నారు. పొరుగునున్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారానికి వస్తే అటువైపు తొంగి చూసే అవకాశాలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.రాష్ట్ర విభజన హామీలు ఇచ్చింది మేమే.. వాటిని అమలు చేసేది కూడా తామేనంటూ ఈపాటికే రాహుల్ గాంధీ స్పష్టంగా ప్రకటించారు.

 

 

 

332ప్రత్యేక హోదాతోపాటు పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంటుకు సొంత గనులు కేటాయిస్తామన్నారు. ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వరంగంలో కొనసాగేట్లు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. నిత్యావసరాలు, ఆహార పదార్థాలపై పన్నులు ఎత్తేస్తామన్నారు. అసలు జీఎస్టీ కౌన్సిల్‌నే రద్దు చేస్తామని చెప్పారు. రాష్ట్రాలు సొంతంగా పన్నులు వసూలు చేసుకొని స్వయంపోషకాలుగా ఎదిగేందుకు ప్రోత్సహిస్తామని జోడో యాత్ర సమయంలోనే వెల్లడించారు. ఇవిగాకుండా కర్ణాటక, తెలంగాణలో మాదిరిగా మరికొన్ని అంశాల మేనిఫెస్టోతో ముందుకొస్తే ఇక్కడ బలపడే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తే.. రాష్ట్రంలో మొదటి దెబ్బ పడేది వైసీపీకే. ఇక్కడ కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగుతుందా! టీడీపీ, జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తాయా! లేక కాంగ్రెస్‌తో జోడీ కడతాయా! బీజేపీ పరిస్థితేంటీ! వామపక్షాలు ఒంటరిగా బరిలో నిలుస్తాయా? అనే సందేహాలు తెరమీదకు వస్తున్నాయి. మరో నెల రోజుల్లో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభించే అవకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. డిసెంబరు 3 తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఓ కుదుపుంటుందని అంచనా వేస్తున్నారు.

 

Post Midle

Tags: Political changes in AP..

Post Midle