Natyam ad

ధర్మవరంలో పొలిటికల్‌ హీట్‌..!

అనంతపురం ముచ్చట్లు:
రాజకీయాల్లో అనంతపురం జిల్లా తీరు కాస్త ఢిఫరెంట్‌. ఏదో ఒక నియోజకవర్గంలో రగడ కామన్. ఒక్కోసారి తాడిపత్రి.. మరోసారి బాలయ్య ఇలాకా హిందూపురం.. ఇంకోసారి రాప్తాడు. తాజాగా ధర్మవరంలో పొలిటికల్‌ హీట్‌ కనిపిస్తోంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ మధ్య వార్ మరో అంకానికి చేరుకుంది. ఇద్దరూ రెండేళ్లపాటు సైలెంట్‌గా ఉన్నారు. కొంతకాలంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి లక్ష్యంగా బాణాలు సంధిస్తున్నారు టీడీపీని వీడి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ. ధర్మవరంలో కేతిరెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. వరసగా ఆ వివరాలు వెల్లడిస్తానని చెప్పారు మాజీ ఎమ్మెల్యేఅనుకున్నట్టుగానే మొదటి ఏపిసోడ్ విడుదల చేశారు సూర్యనారాయణ. ఎమ్మెల్యే అనుచరులు భూకబ్జాలు చేస్తున్నారని.. ప్రభుత్వ కార్యాలయాల్లో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాటికి సంబంధించిన ఆధారాలు ఇవే అంటూ కొన్ని బయటపెట్టారు మాజీ ఎమ్మెల్యే. ఈ ఆరోపణలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ విమర్శలు.. ప్రతి విమర్శల వల్ల పనికాదని అనుకున్నారో ఏమో.. మూడోసారి ఆరోపణల తీవ్రత పెంచారు మాజీ ఎమ్మెల్యే.చెరువు వెనకవైపు కొండమీద ఒక ఇంద్ర భవనాన్ని ఎమ్మెల్యే నిర్మించారని.. అదంతా కబ్జా చేసిందేనని మండిపడ్డారు సూర్యనారాయణ. కోట్లు విలువచేసే కార్లు, గుర్రాలు, బోటింగ్‌లను కేతిరెడ్డి ఏర్పాటు చేసుకున్నారని.. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఒక పురాతన ఆలయంలో గుప్తనిధుల తవ్వకాలు చేస్తున్నారని.. తన ఇంద్రభవనంలో అసాంఘీక కార్యకలాపాలు సాగిస్తున్నారని చెప్పి సంచలనం రేపారు సూర్యనారాయణ. అయితే మాజీ ఎమ్మెల్యే ఉనికి కోసమే రచ్చ చేస్తున్నారని వాదిస్తున్నారు కేతిరెడ్డి.ఈ ఫైట్‌లో ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ కూడా చేరారు. ఎమ్మెల్యే కేతిరెడ్డిని.. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణను ఇద్దర్నీ శ్రీరామ్‌ టార్గెట్‌ చేస్తున్నారు. ఒకవైపు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై విరుచుకుపడుతూనే.. ఇంకోవైపు సూర్యనారాయణపై గురిపెట్టారు. ఇలా ముగ్గురు నేతల వరస కామెంట్స్‌తో ధర్మవరం రాజకీయం వేడెక్కుతోంది. మరి.. ధర్మవరం దంచుడు రాజకీయాల్లో ఎవరు పైచెయ్యి సాధిస్తారో చూడాలి.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; Political heat in Dharmavaram ..!