Natyam ad

జనారణ్యంలో వన్యమృగాలు

తిరుపతి ముచ్చట్లు:

జనారణ్యంలో వుండాల్సిన వన్యమృగాలు జనంలోకి వచ్చేస్తున్నాయా? ఏపీలో చిరుతపులులు, పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు… ఇలా వన్యప్రాణులు జనానికి కంటిమీద కునుకే లేకుండా చేస్తున్నాయి. కలియుగ వైకుంఠం తిరుపతి వాసులకు కొత్త భయం పట్టుకుంది. చిరుతపులుల అడ్డాగా తిరుపతి మారుతుందా అంటే అవును అనే సమాధానమే అధికారుల నుంచి వినపడుతుంది… ఎన్నడూ లేని విధంగా తిరుపతి, తిరుమల కొండల్లో, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చిరుతల సంతతి పెరిగిందంటున్నారు… అయినా చిరుతపులులు సంచారంపై స్దానికుల్లో ఆందోళన పెరుగుతోంది. తాజాగా ఎస్వి వెటర్నరీ వర్శిటీలో చిరుతపులి సంచారానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ మరింత ఆందోళనకు కారణం అవుతోంది.తిరుపతి సమీప ప్రాంతాలలో చిరుత పులుల సందడి పెరుగుతుంది. రోజూ ఏదో ఒకచోట చిరుతు పులుల అలజడులు సర్వసాధారణంగా మారాయి. దానికి ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న దాడులు ఉదాహరణగా చెబుతున్నారు అటవీశాఖ అధికారులు .. శేషాచలం కొండల కేంద్రం తిరుమలలో వరుసగా చిరుతలు హల్ చల్ చేస్తుంటే…

 

 

 

కొండ కింద తిరుపతిలోనూ అదే పరిస్థితులు నెలకొన్నాయి… తాజాగా ఎస్వీ వెటర్నరీ యూనివర్శిటీలో చిరుత సంచారం కలకలం రేపుతోంది.యూనివర్సిటీ పరిపాలన భవనం ఆవరణలో నిన్న అర్ధరాత్రి చిరుత సంచరించింది. అక్కడ నిద్రిస్తున్న ఓ శునకాన్ని పట్టుకునే ప్రయత్నం కూడా చేసింది. అయితే ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. నిన్న అర్ధరాత్రి సంచరించిన చిరుత జాడను ఇవాళ సాయంత్రం యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన సిబ్బంది… యూనివర్సిటీ వద్దకు చేరుకొని చిరుత జాడలను గుర్తించారు. మరోసారి చిరుత యూనివర్సిటీ ఆవరణంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక గ్రామాల ప్రజలు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు పులిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్నీ నెలల‌ కిందట యూనివర్సిటీలోని ఆవరణలో, సమీపంలోని పంట పొలాల్లో చిరుత సంచరించడం స్ధానికులు గమనించారు. అప్పుడు కూడా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

 

 

Post Midle

అయితే అదే రోజు యూనివర్సిటీలోని ఓ శునకంపై దాడి చేసి గాయపరచడంతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు. చిరుతపులులు సంఖ్య సైతం శేషాచలంలో బాగా పెరిగిందని అంటున్నారు జిల్లా అటవీ శాఖ అధికారులు. 1960 సంవత్సరంలో చిత్తూరు జిల్లాలో చిరుతపులులు సంచారం అసలు లేదని అంటున్నారు. అటు తరువాత ఇటు నల్లమల అటవీ ప్రాంతం నుండి చిరుతల రాక ప్రారంభమైందని నివేదికలు చెబుతున్నాయి. ఐదేళ్ళలో వీటి సంఖ్య గణనీయంగా పెరిగిందంటున్నారు. 2018 నుండి ఇప్పటి వరకు అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం దాదాపు 40కిపైగా చిరుతపులులు ఉన్నట్లు చెబుతున్నారు. ఇవి కూడా తిరుమల,తిరుపతి సమీపంలో ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నాయని…తిరుపతి శేషాచలం కొండల్లో మాత్రమే కాకుండా జిల్లాలోని పలమనేరు, శ్రీకాళహస్తి,చంద్రగిరి,పీలేరు , నగరి ,నియోజకవర్గాల్లోను చిరుతల సంచారం విపరీతంగా పెరిగిందని భావిస్తున్నారు అధికారులు ..ప్రస్తుతం జిల్లాలో దాదాపు 70 నుండి 100 వరకు ఉండొచ్చు అని అంచనా వేశారు. దీనికి ఉదాహరణగా వరుసగా అక్కడ జరుగుతూన్న చిరుత అలజడులను, దాడులను చెబుతున్నారు ..తాజాగా వర్శిటి సమీపంలోని అటవీ ప్రాంతం నుండి చిరుతలు క్యాంపస్ లోకి రావడం మరింతగా విద్యార్థులను,సిబ్బంది ని కలవరపాటుకు గురి చేస్తోంది. జన సంచారం లోకి వస్తున్న చిరుతలకు అటవీ శాఖ ఎలా చెక్ పెడుతుందో వేచి చూడాలి.

 

Tags: Political heat in Tekkali

Post Midle

Leave A Reply

Your email address will not be published.