Natyam ad

తుది శ్వాస వరకు కోటంరెడ్డి బ్రదర్స్ తోనే రాజకీయ ప్రయాణం

– శిష్యుడిగా తప్పటడుగు వేశా…. గురువుగా
-ఆదరించాలి
-వైకాపా యువజన విభాగ ఇంచార్జి టీవీఎస్. కమల్
నెల్లూరు ముచ్చట్లు:
 
తన తుది శ్వాస వరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆయన సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలతోనే తన రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని వైకాపా యువజన విభాగం ఇన్చార్జి టీవీఎస్ కమల్ పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ నందు బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రాజకీయ జీవితం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తోనే మొదలైందని తెలిపారు. 23 సంవత్సరాల తన రాజకీయ జీవితం ఆయన అడుగుజాడల్లోనే ప్రయాణం సాగిందన్నారు . అనుకోని సంఘటనలు, అనివార్య కారణాల వలన కొంతకాలంగా ఆయనతో కలిసి  ప్రయాణం చేయలేకపోయానని బాధ పడ్డారు. ముందుచూపు కోల్పోయి, అర్థరహితంగా గడిచిన మున్సిపల్ ఎన్నికల్లో 31 వ డివిజన్ కార్పొరేటర్  వైకాపా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం బాధాకరమన్నారు. తనకు 31వ డివిజన్ వైకాపా అభ్యర్థిగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సీటు కేటాయించలేక పోయారనే మనస్థాపంతో ,ఇతర పార్టీలు చెంతకు చేరకుండా, వైకాపా స్వతంత్ర అభ్యర్థిగా ఉంగరం గుర్తుపై పోటీ చేయడం జరిగిందని, ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో ఎప్పుడూ తనకు ఎదురు కాకూడదని మనోవేదనకు లోనయ్యారు .శిష్యుడిగా తెలిసో, తెలియకో తప్పటడుగు వేశానని, గురువుగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మునుపటిలాగే తనను ఆదరించాలని మీడియా ముఖంగా విజ్ఞప్తి చేసుకున్నారు. నేటి నుండి మనసులో ఎటువంటి తప్పిదాలకు తావు ఇవ్వానని స్పష్టం చేశారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో కోటంరెడ్డి బ్రదర్స్ రామలక్ష్మణులుగా పరిపాలన సాగిస్తున్నారని, వారికి నమ్మినబంటుగా వారి అడుగుజాడల్లో నడిచి , మునుపటి వలె గ్రామీణ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ,తోటి కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచే అవకాశం కల్పించాలని వేడుకున్నారు. ఈ సమావేశంలో టీవీఎస్ కమల్ సన్నిహితులు టి సురేష్ బాబు, రవీంద్ర, చరణ్ రాజ్, ప్రభాకర్ రెడ్డి, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Political journey with Kotamreddy Brothers till his last breath