రిలాక్స్ మూడ్ లో రాజకీయ పార్టీలు

Date:16/04/2019
విజయవాడ ముచ్చట్లు:
సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. రాజకీయ పార్టీలు రిలాక్స్‌ మూడ్‌లోకి వచ్చాయి. కాని గెలుపోటముల పై అంతర్గతంగా ఆందోళన నెలకొంది. అభ్యర్ధులు, నాయకులు పోలింగ్‌ బూతలలో జరిగిన ఓటింగ్‌ శాతం ముందు పెట్టుకొని లెక్కలు కడుతున్నారు. ఎక్కడ బాగా ఓట్లు పోలయ్యాయి…మెజారిటీ వస్తుందా లేదా అనే అంశం పై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ, విపక్ష వైసీపీ, సినీరంగాన్ని రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ సారథ్యంలోని జనేసన పార్టీల మధ్య హోరాహారీగా పోరు జరిగీంది. బీజేపీ, కాంగ్రెస్‌ వంటి జాతీయ పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ.. వాటి ప్రభావం నామమాత్రంగా కూడా కనిపించలేదు. దీంతో టీడీపీ, వైకాపా, జనేసన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఫలితంగా తుది ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అధికార టీడీపీ అభివృద్థి, మహిళ, రైతుల కోసం అమలు చేసిన నగదు పంపిణీ పథకాలను నమ్ముకుని పోటీ చేసింది. హేతుబద్థత లేకుండా రాష్ర్టాన్ని విభజించినా, కేంద్రం నిధులు ఇవ్వకున్నా అభివృద్థి విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదని సీఎం చంద్రబాబు ప్రకటించి, ఆ విధంగానే పాలన సాగీస్తూ వచ్చారు.ఐదేళ్ళ కాలంలో సంక్షేమ పథకాలతో పాటు రైతులను, నిరుద్యోగులను, మహిళలను ఆదరించిన తమను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రం సుసంపన్నం చేస్తామని హామీలిచ్చారు. వృద్థులకు పింఛన్‌ మొత్తాలను పెంచుతూ యువతకు ఉద్యోగాలను కల్పిస్తామని హామీలిచ్చారు.ఇకపోతే, గత ఐదేళ్ల కాల తెలుగుదేశం పార్టీ పాలనలో అవినీతి పెరిగీపోయిందనీ, అందువల్ల తమకు ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలంటూ వైకాపా అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. పాదయాత్రతో పాటు.. వివిధ రకాల యాత్రలతో రాష్ర్టాన్ని చుట్టేశారు.
జగన్‌కు అండగా, ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, భార్య భారతిలు కూడా ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఓటర్లకు విజ్ఞప్తి చేసింది మాత్రం ఒక్కటే.. వైకాపాకు ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి అంటూ ప్రాధేయపడ్డారు.మరో వైపు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ తనకు అధికారం ముఖ్యంకాదనీ ప్రశ్నించడమేనని చెప్పారు. తన ప్రచారాలతో ప్రధాన పార్టీల్లో వణుకు పుట్టించారు. కాపు ఓటు బ్యాంకుతో పాటు తన ఫ్యాన్స్‌ అండతో రాజకీయ బరిలోకి దిగీన పవన్‌ కళ్యాణ్‌… ఇరు పార్టీలకు ప్రధాన శత్రువుగా మారి ముచ్చెమటలు పోయించారు. ఇపుడు ఆయన పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది? ఎంత మేరకు ఓట్ల శాతాన్ని కేౖవసం చేసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Tags: Political parties in relaxing mood

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *