Natyam ad

సంక్రాంతి తర్వాత రాజకీయ యాత్రలే

లోకేష్, పవన్, శైలజానాధ్


విజయవాడ ముచ్చట్లు:


వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత.. జనవరి 27 నుంచి ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి. ఎమ్మెల్సీ నారా లోకేశ్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. దాదాపు ఏడాది పాటు పాదయాత్ర చేసి ప్రజలలో మమేకం కావాలని లోకేష్ కొనసాగే లోకేష్ పాదయాత్రను ఆయన తండ్రి, మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో జనవరి 27న ప్రారంభిస్తారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు ఆయన పాదయాత్ర కొనసాగుతుంది. మొత్తం 4 వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను, రోడ్ మ్యాప్ ను లోకేష్  సిద్ధం చేసుకుంటున్నారు.ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. జనం నుంచి ఎదురవుతున్న తీవ్ర వ్యతిరేకతలు, సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న అసంతృప్తులు, విపక్షాల నుంచి దూసుకు వస్తున్న విమర్శల నేపథ్యంలో పరువు మరింతగా దిగజారిపోకుండా ఉండాలంటే జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలు తీసుకొస్తే.. ఆ పరిస్థితి వేరే.ఏపీలో రాజకీయ నేతలు పాదయాత్రలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ అధికారంలో ఉండి, కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి  ప్రజా ప్రస్థానం  పేరుతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  వస్తున్నా.. మీకోసం  పేరిట ఏపీలో పాదయాత్ర చేశారు. తర్వాత వైఎస్ జగన్ కూడా  ప్రజా సంకల్ప యాత్ర  యాత్ర చేశారు. అక్రమ ఆస్తుల కేసులో జగన్ అరెస్టయి జైలులో ఉండడంతో ఆయన సోదరి షర్మిల  మరో ప్రజా ప్రస్థానం  అంటూ పాదయాత్ర కొనసాగించారు. తాజాగా నారా లోకేశ్ చేస్తున్న పాదయాత్ర చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్, జనసేన, బీజేపీ పార్టీలు కూడా పాదయాత్రలు, బస్సు యాత్రలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తుండడం విశేషం. తొలుత పాదయాత్ర చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నా.. తర్వాత దాన్ని బస్సు యాత్రగా మార్చుకున్నారు.

 

 

Post Midle

వాస్తవానికి అయితే.. ఈ సంవత్సరం అక్టోబర్ లోనే జనసేనాని  యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. సంక్రాంతి తర్వాత ఏపీలో బస్సు యాత్ర చేయాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అవడం గమనార్హం.మరో పక్కన ఏపీని అడ్డగోలుగా విభజించిందనే కోపంతో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు కోలుకోలేని విధంగా గుణపాఠం చెప్పారు. అలాంటి పార్టీ ఒకటి ఉందనే ఏపీ లో ఆ పార్టీ పరిస్థితి తయారైంది.  ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికిని కాపాడుకునేందుకు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ కూడా పాదయాత్రకు  సిద్ధం అవుతున్నారు.   వచ్చే డిసెంబర్ నుంచి  రాష్ట్రంలో పాదయాత్ర చేయనున్నట్లు  శైలజానాథ్ ప్రకటించారు. ఏపీకి మేలు చేయడం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం అనేది శైలజానాథ్ చెబుతుండడం విశేషం. అందుకే తన పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.విభజిత ఆంధ్రప్రదేశ్ కు తాను అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళల్లో ఒక్కటంటే ఒక్క మేలు   కూడా చేయని బీజేపీ కూడా పాదయాత్ర చేసేందుకు ముందుకొస్తోంది. బీజేపీకి ఏపీలో ఓటింగ్ శాతం అతి తక్కువ.  గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు సాయంతో కొన్ని అసెంబ్లీ సీట్లలో బీజేపీ గెలిచింది. అయినప్పటికీ ప్రజలకు ఆ పార్టీ వల్ల ఏమి ఒరిగింది అంటే గాల్లో లెక్కలు వేసుకోవాల్సిందే. అలాంటి బీజేపీ ఇప్పుడు ఏపీలో ఉనికి కోసం పాదయాత్ర చేస్తానంటోంది. కానీ.. మిగతా పార్టీల మాదిరి వ్యక్తిగత పాదయాత్ర కాదంటోంది. ఒక్కో ప్రాంతంలో కొందరు బీజేపీ నేతలు కలిసి రాష్ట్రం అంతా పాదయాత్రగా పర్యటిస్తామని ఆ పార్టీ నేత సత్యకుమార్ వెల్లడించారు. బీజేపీ పాదయాత్ర సంక్రాంతి తర్వాత ఆరు నెలల పాటు సాగుతుందని ఆయన తెలిపారు. ఏపీలో   పట్టణాల్లో అంతంత మాత్రంగా  బీజేపీకి ఉనికి ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ పెద్ద జీరో అని చెప్పొచ్చు. అందుకే పట్టణ ప్రాంత ఓటర్లను పాదయాత్ర సందర్భంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుందని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.ఈ ఏడాది చివరి నుంచి వచ్చే సంవత్సరం ఆఖరి దాకా ఏపీలో రాజకీయ పార్టీల పాదయాత్రలతో సందడిగా మారబోతోందనేది వాస్తవం.

 

Tags: Political trips after Sankranti

Post Midle

Leave A Reply

Your email address will not be published.