రాజకీయాలు మారుతున్నాయి : సీఎం చంద్రబాబు

Date:14/03/2018
అమరావతి ముచ్చట్లు:
సీఎం చంద్రబాబు నివాసంలో తెదేపా సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూపీ, బిహార్‌లో లోక్‌సభ స్థానాల ఉప ఎన్నిక ఫలితాలతో పాటు వైకాపా వ్యవహార శైలి, విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, తదితర అంశాలపై చర్చించనున్నారు. యూపీ, బిహార్‌ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలను సీఎం నేతలను అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం. వివిధ రౌండ్లలో ఆయా పార్టీలకు వస్తోన్న ఓట్ల సరళిని అడిగి తెలుసుకున్న సీఎం.. వాటిని నిశితంగా పరిశీలించినట్టు తెలుస్తోంది. దేశంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయని నేతలతో ఆయన అన్నట్టు సమాచారం. పార్లమెంట్‌లో చర్చలు సరిగ్గా జరగని తీరు, తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకున్న గందరగోళం, ఏపీలో ప్రతిపక్షం సభలకు గైర్హాజరవుతున్న విషయాలను ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించినట్టు సమాచారం. ఈ తరుణంలో తెదేపాపై మరింత బాధ్యత పెరిగిందని, పార్టీ ప్రజాప్రతినిధులంతా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రతిపక్షం సభలో లేకపోయినా ప్రజలే మనకు ప్రతిపక్షంగా భావించి సమర్థంగా అన్ని అంశాలను చర్చించాలని, అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని నేతలకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. ప్రతిఒక్కరూ ఆత్మావలోకనం చేసుకొని తప్పొప్పుల్ని బేరీజు వేసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలు, ప్రత్యర్థుల బలహీనతలపైనా దృష్టిపెట్టాలని దిశానిర్దేశం చేశారు.
Tags: Politics are changing: CM Chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *