Politics is a must watch film

రాజకీయాలకు అతీతంగా బగ్గిడి సినిమాను చూడాలి

– ప్రధాని మోదీ సోదరుడు దామోదర్‌దాస్‌ , కన్నా లక్ష్మినారాయణ పిలుపు

Date:23/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్‌ తన స్వీయ చరిత్రతో నిర్మించిన బగ్గిడి సినిమాను రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు చూడాలని ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాదమోదీ దామోదర్‌దాస్‌ పిలుపు నిచ్చారు. ఆదివారం రాత్రి పుంగనూరులో బగ్గిడి గోపాల్‌ సినిమా ప్రీరివచ్యీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅత్యిధులుగా ప్రధాని సోదరుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జిల్లా నేతలు చల్లపల్లి నరసింహారెడ్డి, కోలా ఆనంద్‌ , శ్రీనివాస్‌ హాజరైయ్యారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బగ్గిడి గోపాల్‌ కండెక్టర్‌ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారని, ఆ సమయంలో జరిగిన స్వీయ సంఘటనలను తెరపైకి ఎక్కించారని అభినందించారు. బగ్గిడి గోపాల్‌ సినిమాను ప్రతి ఒక్కరు చూడాలని , ఆయనను మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. సినిమా సమావేశంలో రాజకీయాలేమి మాట్లాడేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సినిమా గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు అయూబ్‌ఖాన్‌, రాజారెడ్డి, గణేష్‌, భక్తవత్సలం తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులు, అనాథ భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం పుణ్య‌కార్యం :

Tags: Politics is a must watch film

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *