Natyam ad

అనంతలో రాజకీయాలు వేడి

అనంతపురం ముచ్చట్లు:
 
విమర్శలు హద్దులు దాటాయి.. ఆరోపణలు శృతి మించాయి.. ఎన్నికలప్పుడు కత్తులు దూసుకున్న ఆ రెండు కుటుంబాలు.. ఇప్పుడు రూటు మార్చాయి. ఆస్తులు, సంపదలపై విమర్శల దాడి చేసుకుంటున్నాయి. నీ ఆస్తి ఎంత అంటే.. మీ ఆస్తులు ఇంత అంటూ ఒకరి ఆస్తుల గురించి మరొకరు బయట పెట్టుకుంటున్నారు. అనంత రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ హాట్ టాపిక్. ఇది మరీ హద్దులు మీరడంతో.. ఇందులో ఐఏఎస్ అధికారులు, ఇతర రెవెన్యూ అధికారులు ఇరుక్కుంటున్నారు. ఇంతకీ ఆ రెండు కుటుంబాల మధ్య వార్ ఎందుకు మొదలైంది.. ఎవరు ఆ రెండు కుటుంబాలు.రాప్తాడు.. పౌరుషాల గడ్డ.. ఇక్కడి నేతలు రక్తం పౌరుషాలతో మరుగుతుంటుంది. ప్రధానంగా రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న వైరం.. సినిమా సీన్లను తలపిస్తుంది. సాధారమంగా ఇంట్రవెల్ బ్రెక్ ముందు వచ్చే పవర్ సీన్ల తరహాలో ఆ రెండు కుటుంబాల మధ్య డైలాగ్ లు పేలుతుంటాయి. ఇంతకీ ఆ రెండు కుటుంబాలే.. మాజీ మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఫ్యామిలీస్. వీరు ఎప్పుడు ఎందుకు ఎవరి మీద ఆరోపణలు చేస్తారో తెలియదు. ఫ్యాక్షన్ లేమి ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయాల కోసం చేసే రాజకీయాలు హైటెన్షన్ రేపుతుంటాయి. ఎన్నికలప్పుడు చూడాలి.. వీరి మధ్య వైరం ఓ రేంజ్ లో సాగుతుంది. కానీ ఇప్పుడు ఎన్నికల లేకపోయినా.. ఈ రెండు కుటుంబాల వారు రూట్ మార్చారు. సీన్ మారిందో లేక ట్రెండ్ మార్చారో తెలియదు కానీ.. వందలు, వేల కోట్ల ఆస్తుల అంటూ రగడ రాజేస్తున్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాప్తాడు దద్దరిల్లుతోంది…అసలు ఈ గొడవ ఎక్కడ ప్రారంభమైందంటే… మాజీ మంత్రి పరిటాల సునీత గౌరవ సభల్లో మాట్లాడిన మాటలే ఇప్పుడు కాంట్రావర్షీగా దారి తీసింది. రెండు వారాలుగా రాప్తాడులో రాజకీయ రణరంగం సాగుతోంది.
 
 
పరిటాల సునీత కామన్ టార్గెట్ మాత్రం ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి బ్రదర్సే. నిన్నటివరకు సొంత ఇళ్లు లేక అద్దె ఇంట్లో ఉన్న తోపుదుర్తి బ్రదర్స్ ఇప్పుడు వందల కోట్లు సంపాదిస్తున్నారని.. రాప్తాడు నుంచి బెంగళూరు వరకూ భూదందాలు చేస్తున్నారని సునీత ఆరోపించారు. అయినా తోపుదుర్తి బ్రదర్స్ రెస్పెండా కాలేదు కానీ.. తోపుదుర్తి పాల డైరీ విషయంలో సునీత చేసిన కామెంట్స్ మాత్రం వారికి కోపాన్ని తెప్పించాయి. డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా డైరీ ఏర్పాటు చేస్తామని చెప్పి డబ్బు వసూళ్లు చేశారని..ఇప్పుడు ఆ డబ్బును ప్రకాష్ రెడ్డి సోదరులు రియల్ ఎస్టేట్ కు మళ్లిస్తున్నారని ఆరోపించారు. దీంతో తోపుదుర్తి బ్రదర్స్ పరిటాల కుటుంబంపై వార్ షురూ చేశారు. ఇన్ని రోజులు ఎన్ని మాటలు అన్నా ఊరుకున్నాం.. ఇక ఆగేది లేదుంటూ పరిటాల ఆస్తి పాస్తులపై దాడులు ప్రారంభించారు.ఒకప్పుడు కమ్యూనిస్టు ఉద్యమాల పేరుతో కొండల్లో ఉన్న వారికి ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, అనంతపురంలలో వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని సూటిగా ప్రశ్నించారు. మాకు సొంత ఇళ్లు లేదని ఎగతాళి చేస్తారా.. మరి మీకు ఎక్కడి నుంచి అన్నిఆస్తులు వచ్చాయో చెప్పండి అంటూ ప్రకాష్ రెడ్డి సోదరుడు చందు ప్రశ్నించారు. మేము ఏదో సంపాదించుకున్నాం అంటున్నారు కదా.. అవి ఏవో చూపించండి ప్రజలకు పంచేస్తాం.. మేము కూడా మీ ఆస్తులు చూపిస్తాం అవి పంచే దమ్ముందా అని సవాల్ విసిరారు. ఇటు ప్రకాష్ రెడ్డి కూడా సేమ్ డైలాగ్.. ఎన్నికల అఫడవిట్ లో ఎంతో ఆస్తి చూపించారు.. మీకు వాస్తవంగా ఉన్నవి ఎంతో లెక్కలు తీయండని సవాల్ విసిరారు. మరోవైపు డ్వాక్రా మహిళల భాగస్వమ్యంతో ఏర్పాటు చేస్తున్న డైరీలో అక్రమాలు జరిగాయంటున్నారు… అందులో ఒక్క రూపాయి మేము కానీ అందులో సభ్యులు కానీ పక్కదారి పట్టించి ఉంటే..
 
 
నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. నిరూపించలేకపోతే మీరు రాజీనామాలు చేసేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. హత్యలు, దౌర్జన్యాలతో దోచుకోవడం దాచుకోవడం అనే విధానంతో పరిటాల రవి జీవించారని.. ఇప్పుడు మీరు మీకుటుంబసభ్యులు అదే పనిలో ఉన్నారని ప్రకాష్ రెడ్డి కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ పై నాలుగైదు రోజుల తర్వాత కానీ పరిటాల శ్రీరామ్ స్పందించలేదు. పరిటాల రవి ఎమ్మెల్యే కాక ముందు నుంచే వ్యాపారాలు చేస్తున్నారని.. ఆయన చాలా కష్టాలు పడ్డ తర్వాత నిలదొక్కుకుకున్నారు. ఆ నాటి నుంచి మా కుటుంబం అంచలంచెలుగా ఎదిగింది. ఇదిదో రాత్రికి రాత్రే వచ్చిందికాదు. మేము ఏ వ్యాపారం చేసినా.. ఏది కొన్నా అంతా పక్కా రైట్ ట్రాయల్ గా ఉంటుందని.. ప్రతి దానికి ఇన్ కమ్ ట్యాక్స్ కడుతున్నామని స్పష్టం చేశారు. ఎక్కడైనా దానికి మించి ఉంటే అధికారం నీదే కదా నిరూపించుకో అని సవాల్ విసిరారు. మేము నీలాగా అదేదో ఒక పాటలో చూపించినట్టు.. రాత్రికి రాత్రే కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించలేదన్నారు. మీ గురించి.. మీ సోదరులు చేస్తున్న ఆస్తుల గురించి మాట్లాడితే సమయం సరిపోదన్నారు. తోపుదుర్తి డైరీ గురించి మాట్లాడుతూ ద్వారా 50లక్షలు ఎవరి అకౌంట్ కు మళ్లించారని.. షనరీ కొనడానికి రెండేళ్లు పడుతుందా అని ప్రశ్నించారు. ప్రకాష్ రెడ్డి, ఆయన సోదరులు, బినామీలకు ఒక్కటే హెచ్చరిక అని… అధికారం ఉందని ఇష్టమొచ్చినట్టు చేస్తే మూల్యం తప్పదని శ్రీరామ్ అన్నారు.పరిటాల శ్రీరామ్ ముక్కోటి ఏకాదశి రోజు ప్రకాష్ రెడ్డి కౌంటర్ కు ఇస్తే.. భోగి రోజు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మరోసారి పరిటాల కుటుంబం ఆస్తుల చిట్టా విప్పారు. నాపై అవినీతి ఆరోపణలు చేస్తున్న పరిటాల శ్రీరామ్ ఒక జూనియర్ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కామెంట్ చేశారు. నేను కొందరు కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు తీసుకుంటున్నానని అంటున్నారు..
 
 
 
నేను కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమన్నారు. ముందు నా గురించి మాట్లాడే ముందు.. అసలు మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తేల్చుకోండని కామెంట్ చేశారు.మీరు వ్యాపారాలు చేసుకొని పైకి వచ్చామంటున్నారు.. మరి విప్లవాలు, పోరాటాలని ఎందుకు మాట్లాడుతారని ప్రశ్నించారు. సీఎం జగన్ తో నేను 20ఏళ్లుగా నడుస్తున్నాని.. ఆయన వెంటే జీవితాంతం ఉంటానని స్పష్టం చేశారు. మరోవైపు మీ తల్లిగారు సివిల్ స్ప్లైస్ మంత్రిగా పని చేశారని..ఇప్పటికీ సివిల్ సప్లైస్ లో మీ పెత్తనం సాగుతోందన్నారు. కొడాలి నాని ఉన్నా ఆశాఖలో మీది జరుగుతోందని ప్రకాష్ రెడ్డి కామెంట్ చేశారు. మీరు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారో ఇక నుంచి వరుసగా రిలీజ్ చేస్తానని చెప్పారు…అనుకున్నట్టుగానే.. ఎమ్మెల్యే ప్రకాష రెడ్డి. తాజాగా అనంతపురం, రాప్తాడు చుట్ట పక్కల జరిగిన భారీ భూ కుంభకోణాల చిట్టా బయట పెట్టారు. పరిటాల సునీత మంత్రిగా ఉన్న సమయంలో భూములు ఎలా కాజేశారో చూడండి అంటూ కొన్ని సర్వే నెంబర్లతో సహా వివరించారు. రెవెన్యూ చట్టాల్లోని లొసుగుల ద్వారా వందల కోట్లు విలువ చేసే భూములు కాజేశారన్నారు.
 
 
 
ఎక్స్ ఆర్మీ, వంక పరంబోకు, అసైన్డ్ ల్యాండ్ చట్టాల ద్వారా వీటిని చట్ట రూపంలోకి మార్చారని ఆరోపించారు. ఇందులో కొందరు రెవెన్యూ అధికారులు సహకారం అందిందని.. గతంలో ఇక్కడ పని చేసిన కలెక్టర్ల ఎలా సహకరించారో త్వరలోనే చెబుతానన్నారు. అసలు ఐఏఎస్ అధికారులు ఎక్కడికి ఎలా బదిలీపై వెళ్లారో చెప్తానన్నారు. మేము ఈ విషయాల్ని బయట పెట్టకుంటే ఏదో ఒక రూట్లో దానిని సెట్ చేస్తారని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులకు చీటర్స్ వెళ్లినా స్టేలు వచ్చేస్తున్నాయన్నారు. వారు చేసే అక్రమాలకు ఇప్పటికీ నా పేరు వాడుకుంటున్నారన్నారు. ఇలా ఎవరైనా నా పేరు చెబితే చెప్పుతో కొట్టండి.. ఆ తర్వాత నాక్ కాల్ చేయండని ప్రకాష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.డైలీ సీరియల్స్ ని తలపిస్తున్న.. వీరి అవినీతి ఆరోపణలు.. ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని తెరపైకి వస్తున్నాయి. ఇది రాజకీయంగా కూడా సంచలనంగా మారాయి. అయితే ఇక్కడితో ఇది ఆగదని.. ప్రభుత్వ, దళితుల భూముల ఆక్రమణల ఎలా జరిగాయో వెల్లడిస్తానని ప్రకాష్ రెడ్డి మరో బాంబ్ పేల్చారు. ప్రస్తుతం పరిటాల శ్రీరామ్ కు కరోనా పాజిటీవ్ రావడంతో క్వారంటైన్ లో ఉన్నారు. ఆయన బయటకు వస్తే వీటిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Politics is hot in infinity