నల్లగొండలో రంగులు మారుతున్న రాజకీయం

Date:15/03/2018
నల్లగొండ ముచ్చట్లు:
న‌ల్ల‌గొండ జిల్లా రాజ‌కీయం వేడెక్కుతోంది. అసెంబ్లీలో జ‌రిగిన గొడ‌వ‌తో స‌స్పెన్ష‌న్‌కు గురైన  ఎమ్మెల్యేలు న‌లుగురూ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, జానారెడ్డి, సంప‌త్‌లు ఒకే జిల్లాకు చెందిన వారు కావ‌ట‌మే ఇందుకు నిద‌ర్శ‌నం.. వాస్త‌వానికి న‌ల్ల‌గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకు కంచుకోట‌. అటువంటి చోట పాగా వేయ‌టం.. టీఆర్ ఎస్‌కు స‌వాల్ గా మారింది. ఇదే కొన‌సాగితే.. 2019లో కేసీఆర్ శిబిరం.. అక్క‌డ నిల దొక్కుకోవ‌టం క‌ష్ట‌మ‌నే భావ‌న కూడా నెల‌కొంది. ఇటువంటి నేప‌థ్యంలోనే న‌ల్ల‌గొండ పుర‌పాల‌క ఛైర్మ‌న్ భ‌ర్త శ్రీనివాస‌రావు దారుణ‌హ‌త్య జ‌రిగింది. గులాబీ గూటిలోకి చేరేందుకు వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేసినందుకే.. బొడ్డుప‌ల్లి శ్రీనివాస్ హ‌త్య జ‌రిగిందంటూ కోమ‌టిరెడ్డి వెంట‌క‌రెడ్డి ప్ర‌భుత్వంపై పెద్ద అబాండ‌మే వేశాడు. అదే స‌మ‌యంలో హ‌త్య కేసు ద‌ర్యాప్తు చేస్తున్న ఇన్‌స్పెక్ట‌ర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇటువంటి స‌మ‌యంలో కేసీఆర్ న‌ల్ల‌గొండ‌లో పాగా వేసేందుకు ఇదంతా వ్యూహాత్మ‌కంగా న‌డిపించారా! అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌స్తుతం తెలంగాణ కాంగ్రెస్‌కు కీల‌క‌మైన నేత‌లు..  ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ అంద‌రూ.. న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన వారే.. దీంతో.. అక్క‌డ కీల‌క‌మైన నేత‌ల్ని రాజ‌కీయంగా దెబ్బ‌తీయ‌టం ద్వారా టీఆర్ ఎస్ బ‌ల‌ప‌డాల‌నే ఎత్తుగ‌డ‌తోనే త‌మ‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేశారంటూ కోమ‌టిరెడ్డి ఆరోపిస్తున్నారు. బొడ్డుప‌ల్లి హ‌త్య‌కు కార‌కుడైన ఎమ్మెల్యేను వ‌దిలేసి.. త‌మ‌పై వేటు వేయ‌టం పూర్తిగా రాజ‌కీయ దురుద్దేశ‌మేనంటారు. ఈ నేప‌థ్యంలోనే.. న‌ల్ల‌గొండ జిల్లా ఎస్పీగా వున్న శ్రీనివాస‌రావును బ‌దిలీ చేశారు. అదే స్థానంలో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏ.వి.రంగ‌నాథ్‌కు అక్క‌డ పోస్టింగ్ కేటాయించారు. ఇలా వ‌రుస‌గా జ‌రుగుతున్న ప‌రిణామాలు.. గులాబీ పార్టీ న‌ల్ల‌గొండ‌పై ప‌ట్టు సాధించేందుకే నంటూ.. కాంగ్రెస్ మండిప‌డుతోంది. ఏది ఏమైనా.. కోమ‌టిరెడ్డి, సంప‌త్  స‌భ్య‌త్వం ర‌ద్ద‌యితే.. ఉప ఎన్నిక‌లు అనివార్య‌మైన‌ట్లే.. దీంతో.. ఉప్ప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి.. ఎన్నిక‌ల‌కు ముందే.. త‌మ విజ‌యాన్ని ఖాయమ‌నే సంకేతాలు ప్ర‌జ‌ల్లోకి చేర‌వేయ‌టమే అనేది కారు పార్టీ ఎత్తు కావ‌చ్చ‌న్న‌మాట‌.
Tags: Politics of changing colors in Nallagonda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *