తెలుగుముచ్చట్లు రంజాన్‌ శుభాకాంక్షలు

Date:04/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ యాజమాన్యం , సిబ్బంది శుబాకాంక్షలు తెలిపారు. ముస్లింలు సుఖసంతోషాలతో రంజాన్‌ పండుగను కుటుంబ సభ్యులతో కలసి నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

ఇట్లు…

తెలుగుముచ్చట్లు వెబ్‌సైట్‌ , పుంగనూరు .

9న బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం కార్యవర్గం ఎన్నిక

Tags: Congratulations to Ramzan

ఇద్దరు ఎస్సీపేటలో సజీవదహనం

Date:07/09/2018
రాజమండ్రి ముచ్చట్లు :
శంఖవరం ఎస్సీపేటలో ఇద్దరి వ్యక్తుల సజీవ దహనంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామంలో ఎస్సీపేటలో పులి సుధాకర్, మీరా రాజేంద్రప్రసాద్, హత్యకు గురైన బత్తిన నూకరాజు, ప్రసాద్‌ మధ్య తలెత్తిన వివాదమే ఈ హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పెద్దాపురం డీఎస్పీ సీహెచ్‌వీ రామారావు, ప్రత్తిపాడు సీఐ అద్దంకి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలో ఎస్సీపేటలో కర్కట నాగేశ్వరరావు కుమారుడు ప్రసాద్, పులి మోజేష్‌ కుమార్తె శిరీషల ప్రేమ వివాహం సందర్భంగా గురువారం రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పెళ్లి కుమారుడు తరఫు బంధువులు మృతులు బత్తిన నూకరాజు, ప్రసాద్, పెండ్లి కుమార్తె తరఫున పులి సుధాకర్, మేరా రాజేంద్రప్రసాద్‌ తదితరులు ఒకరినొకరు ఘర్షణకు దిగారు.
మృతులు నూకరాజు, ప్రసాద్‌లు ప్రత్యర్థి వర్గీయులైన పులి సుధాకర్, రాజేంద్రప్రసాద్‌ల వర్గీయులతో కవ్వింపు చర్యలు దిగి దాడి చేశారు. ఈ దాడిలో సుధాకర్, రాజేంద్రప్రసాద్‌లను బత్తిన నూçకరాజు, ప్రసాద్‌లు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ సుధాకర్, రాజేంద్రప్రసాద్‌ వారి అనుచరులతో కలసి నూకరాజు, ప్రసాద్‌లను వెంటాడారు. సుధాకర్, రాజేంద్రప్రసాద్‌ వర్గీయుల నుంచి తప్పించుకోవడానికి ముందుగా బుద్ధాల లోవరాజుకు చెందిన ఇంట్లోకి వెళ్లారు.
అక్కడ ఆ ఇంటిపై దాడి చేయడంతో ప్రాణభయంతో మరలా ఎదురుగా ఉన్న పెండ్లి కుమారుడు తండ్రి కర్కాట నాగేశ్వరరావు ఇంట్లోకి ప్రవేశించారు. దీంతో సుధాకర్, రాజేంద్రప్రసాద్‌ తదితరులు ఆ ఇంటిని చుట్టుముట్టి  గది తలుపులకు తాళాలు వేసి గది పక్కనే ఉన్న కిటికీలోంచి పెట్రోల్‌ బాటిళ్లు విసిరి నిప్పుపెట్టారు. దీంతో లోపల ఉన్న పర్నీఛర్‌ అంటుకుని మంటలు చెలరేగి గదిలో దాగి ఉన్న నూకరాజు, ప్రసాద్‌లు సజీవ దహనమయ్యారు.
ఘటనా స్థలంలో వందలాదిమంది ప్రజలు ఉన్నా సుధాకర్, రాజేంద్రప్రసాద్, తదితరులు చేస్తున్న దాడులకు భయపడి వారందరూ పరుగులు తీశారు.ఘటనా స్థలానికి పెద్దాపురం ఆర్డీఓ వసంతరాయుడు, తహసీల్దార్‌ ఎం.సుజాత, పెద్దాపురం డీఎస్పీ సీహెచ్‌వీ రామారావు  చేరుకున్నారు. గ్రామంలో పర్యటించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్‌ విధించారు.
ఈ ఘటనకు సంబంధించి పలువురి నిందితులను పులి సుధాకర్, మేరా రాజేంద్రప్రసాద్, మేరా సుశీల, పులి కృష్ణ, కాపారపు సింహాచలం, కాపారపు నానిబాబు, తదితరులును అదుపులోకి తీసుకున్నట్టు పెద్దాపురం డీఎస్పీ సీహెచ్‌వీ రామారావు తెలిపారు. పూర్తి నేరపరిశోధన జరిపి బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు.
Tags:Two lives in the SCP