రేపే 49 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌- సర్వం సిద్ధం

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

సార్వత్రిక ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్ కు ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజక వర్గాలకు రేపు ఓటింగ్ జరగనుంది.ఈ విడతలో 695 మంది అభ్యర్థులు ఉండగా ఈ ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుది ట్టమైన ఏర్పాట్లు చేసింది.ఈ విడత ఉత్తరప్రదేశ్‌లోని 14 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా మహారాష్ట్రలో 13, బెంగా ల్‌లో 7, బిహార్, ఒడిశాలో 5 చొప్పున, ఝార్ఖండ్ 3, జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లో ఒక్కో నియోజక వర్గానికి పోలింగ్ జరగనుంది.ఈ విడతలో 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఐదో విడతలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయబరేలీ నుంచి పోటీలో ఉన్నారు.రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లఖ్‌నవూ నుంచి పోటీలో ఉన్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రెండోసారి అమేఠీ బరిలో నిలిచారు. ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలుప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య సరన్ లోక్ సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు.నేషనల్ కాన్ఫరెన్స్ ఉపా ధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్ముకశ్మీర్ బారాముల్లా నుంచి పోటీ చేస్తున్నారు. వీరే కాకుండా అనేక కీలక నియోజక వర్గాల్లో అనేక మంది ప్రముఖులు పోటీలో ఉన్నారు.ఐదో విడత అభ్యర్థుల్లో 33శాతం మంది కోటీశ్వ రులు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

 

Tags:Polling for 49 Lok Sabha seats tomorrow – all set

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *