సిటీలో పొల్యూషన్ లెవల్స్

Date:16/09/2020

హైద్రాబాద్ ముచ్చట్లు

హైదరాబాద్ లో కాలుష్యం మళ్లీ  పెరుగుతోంది. మొన్నటివరకు లాక్ డౌన్ కారణంగా పొల్యూషన్ లెవల్స్ పడిపోయాయి. జనాలు ఇంటికే పరమితమవడం , వాహనాలు రోడ్డెక్కకపోవడంతో.. కొన్ని రోజుల పాటు సిటీలో కాలుష్యం తగ్గింది. అన్ లాక్ ప్రక్రియ స్టార్ట్ కాగానే  ప్రజలు రోడ్లపైకి రావడంతో అటు ట్రాఫిక్ తో పాటు, పొల్యూషన్ పెరుగుతోంది. గ్రేటర్ పరిధిలో దాదాపు 50 లక్షల వెహికిల్స్ ఉన్నాయి.  అందులో 15 ఏళ్లు పైబడిన వాహనాలు  5లక్షల పైనే ఉన్నాయి. ఆన్ లాక్ 3 నుంచే ఆఫీసులు,  షాపులు ఓపెన్ కావడంతో రోడ్లపై  ట్రాఫిక్ పెరిగింది. లాక్ డౌన్ లో మూడు నెలలు 30 శాతానికి పడిపోయిన పొల్యూషన్ మళ్లీ పెరుగుతోంది.సికింద్రాబాద్ ప్యారడైజ్ ఏరియాల్లో గాలిలో దూళికణాల పరిమాణం  జనవరిలో 121 మైక్రో గ్రాములు ఉంటే.. లాక్ డౌన్ లో 48 మైక్రో గ్రాములకి పడిపోయింది. ఇప్పుడు మళ్లీ   89 ఎంసీజీకి  చేరుకుంది. చార్మినార్ లో మాములు రోజుల్లో 137 మైక్రో గ్రాములు ఉండగా ,లాక్ డౌన్ లో 57కి తగ్గి… ఇప్పుడు 78 మైక్రో గ్రాములు అయ్యింది. మామూలు రోజుల్లో మదాపూర్, గచ్చిబౌలి, కూకట్ పల్లి, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్  ఏరియాల్లో పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం  ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం, చాలా కంపెనీలు క్లోజ్ కావడంతో ఐటీ కారిడార్ లో పొల్యూషన్ తగ్గింది.పాశమైలారం, జీడిమెట్ల , నాచారం, బాలానగర్ , ఉప్పల్ ఇండస్ట్రీయల్ ఏరియాల్లో పరిశ్రమలు ఇంకా తెరుచుకోలేదు. దాంతో అక్కడ కూడా కాలుష్య  తీవ్రత నార్మల్ డేస్ కంటే  తక్కువగానే ఉంది. ఇవి కాకుండా మిగితా అన్ని ఏరియాల్లో పొల్యూషన్ పెరుగుతోందని చెబుతున్నారు పర్యావరణ నిపుణులు. అయితే 15ఏళ్ళ పైబడిన వాహనాల ఇంజన్ రిప్లేస్ మెంట్ చేస్తే పొల్యూషన్ లెవల్స్ తగ్గే అవకాశం ఉందంటున్నారు. కరోనా టైమ్ లో జనాలు అనవసరంగా రోడ్లపైకి రావడంతో వైరస్ వ్యాప్తితో పాటు పొల్యూషన్ కూడా పెరుగుతోందంటున్నారు నిపుణులు.

గవర్నర్ కోటాలో గోరేటి వెంకన్నకు ఎమ్మెల్సీ ?

Tags: Pollution levels in the city

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *