Natyam ad

పుంగనూరులో కాలుష్యాన్ని నివారించాలి-డాక్టర్‌ శరణ్‌కుమార్‌

పుంగనూరు ముచ్చట్లు

పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు పచ్చదనాన్ని పెంపొందించడం, ప్లాస్టిక్‌ నిషేధం అమలు చేయాలని ఆసుపత్రి అభివృద్ధి కమిటి చైర్మన్‌ డాక్టర్‌ శరణ్‌కుమార్‌ అన్నారు. శనివారం ఆయన మెడికల్‌ ఆఫీసర్‌ జశ్వంత్‌ తో కలసి స్థానిక ప్రభుత్వాసుపత్రి ఆవరణంలో వెహోక్కులు నాటారు. చైర్మన్‌ మాట్లాడుతూ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యసేవలు పేదలకు అందించడం జరుగుతోందన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడంతో పాటు వెహోక్కలు నాటడం ఆసుపత్రిలో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరు ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యులుకావాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిటి మెంబర్లు ఇనాయతుల్లాషరీఫ్‌, డాక్టర్‌ శ్రీనివాసులు, రోటరీక్లబ్‌ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Pollution should be avoided in Punganur – Dr. Sharankumar

Post Midle