కమలం గూటికి పోంగులేటీ

Date:10/08/2019

ఖమ్మం ముచ్చట్లు:

తెలంగాణలో బలపడేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా మాజీ ఎంపీ వివేక్ బీజేపీలో చేరడంతో… మరికొందరు ముఖ్యనేతలు కూడా తమ పార్టీలోకి వస్తారని తెలంగాణ కమలనాథులు చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ… టీఆర్ఎస్,కాంగ్రెస్‌లో అసంతృప్తిగా ఉన్న నేతలకు గాలం వేస్తోంది. ఈ క్రమంలోనే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా త్వరలోనే బీజేపీ గూటికి చేరతారని ఊహాగానాలు జోరందుకున్నాయి.

 

 

 

2014 ఎన్నికల్లో వైసీపీ తరపున ఖమ్మం లోక్ సభ సభ్యుడిగా ఎన్నికైన పొంగులేటి… ఆ తరువాత టీఆర్ఎస్‌లో చేరిపోయారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడ్డ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ సీటు నిరాకరించింది టీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి పొంగులేటి ప్రయత్నించారనే ఆరోపణల కారణంగానే ఆయనను పార్టీ నాయకత్వం పక్కనపెట్టిందనే వార్తలు వినిపించాయి.

 

 

 

అయితే మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో తనకు ఎంపీ సీటు దక్కకపోయిన టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు గెలుపు కోసం కృషి చేశారు పొంగులేటి. అయితే పార్టీ కోసం ఎంతగా కష్టపడినా… తనకు పెద్దగా గుర్తింపు లభించడం లేదనే భావనలో పొంగులేటి ఉన్నట్టు తెలుస్తోంది. తనకు ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పోస్టు ఇస్తామని గతంలో టీఆర్ఎస్ నాయకత్వం హామీ ఇచ్చిందని… కానీ దాన్ని కేసీఆర్, కేటీఆర్ పట్టించుకోవడం లేదనే భావనలో పొంగుటేని ఉన్నట్టు ఖమ్మం రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

 

 

 

 

పొంగులేటి అసంతృప్తిని గమనించిన బీజేపీ నేతలు ఇటీవల ఆయనతో చర్చలు జరిపారని… పార్టీలోకి వస్తే సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే బీజేపీ చీఫ్ అమిత్ షా వస్తారని… అప్పుడు పొంగులేటి బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలంగాణ బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు.

 

ఏపీలో వరద రాజకీయం

Tags: Pomegranate

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *