చెరువు గట్టు పరిశుభ్రతకు శ్రీకారం

రామసముద్రం ముచ్చట్లు:

 

చెరువు గట్టు పరిశుభ్రతకు శ్రీకారం చుట్టినట్లు కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. గురువారం స్థానిక పంచాయతీ పరిధిలోని గుంతయంబాడి పెద్ద చెరువు గట్టుపై ఏపుగా పెరిగిన ముళ్ల పొదలను తొలగించడానికి ఉపాధి హామీ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంతయంబాడి గ్రామంలోని రైతులు పొలాల వద్దకు వెళ్లడానికి చెరువు గట్టుపై వెళ్తుంటారు. అయితే గట్టుపై ముళ్ల పొదలు ఏపుగా పెరిగి అడవిని తలపిస్తోందని గ్రామస్థులు చెప్పారన్నారు. వెంటనే ఆయన ఉపాధి హామీ ఏపీవో గౌరీ శంకర్ కు సమస్యను వివరించారన్నారు. ఈ క్రమంలో ఉపాధి సిబ్బంది చెరువు గట్టుపై ఉన్న ముళ్ల పొదలను తొలగించడానికి అంచనాలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇంద్రాణమ్మ, టెక్నికల్ అసిస్టెంట్ సురేష్, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటరమణ, నాయకులు బాబు, ఎల్లారెడ్డి, ఎల్.మునస్వామి, విటి.జయచంద్ర, నాగరాజ, చిన్న కదిరప్ప, వెంకటరమణ, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags; Pond embankment cleanliness initiative

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *