Natyam ad

23న శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం

తిరుపతి ముచ్చట్లు:

ఏప్రిల్ 23వ తేదీ శ్రీ గోవిందరాజ స్వామి పొన్నకాల్వ ఉత్సవం వైభవంగా జరుగనుంది.శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి, ఆండాల్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామి, చక్రత్తాళ్వార్‌తో పాటు తొమ్మిది మంది దేవేరులు ఉదయం 6 గంటలకు ఊరేగింపుగా బయలుదేరి తనపల్లి రోడ్డులో గల పొన్నకాల్వ మండపానికి చేరుకుంటారు.అక్కడ ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి 4.30 గంటల వరకు ఊంజలసేవ, సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు.

 

Post Midle

శ్రీగోవిందరాజస్వామి వచ్చే సమయంలో అమ్మవారి ఆలయంలో ఒక తలుపు మూసి ఉంచుతారు. బావగారైన గోవిందరాజస్వామివారు వచ్చారని పద్మావతి అమ్మవారు లోపలి నుండి ఆసక్తిగా తొంగి చూస్తారని, అందుకే ఆలయం ఒక తలుపు మూసి ఉంచుతారని పురాణాల ద్వారా తెలుస్తోంది. అక్కడినుండి గోవిందరాజస్వామివారు ఊరేగింపుగా బయలుదేరి రాత్రి 8 గంటలకు తిరిగి శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకోవడంతో పొన్నకాల్వ ఉత్సవం ముగుస్తుంది.

 

Tags: Ponnakalva festival of Shri Govindarajaswamy on 23rd

Post Midle