పుంగనూరు ముచ్చట్లు:
ఆదివారం అమావాస్యను పురస్కరించుకుని శ్రీచౌడేశ్వరిదేవి జయంతి వేడుకలు మండలంలోని చదళ్ల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో గణపతి హోమము, నవగ్రహ, మృత్యుంజయ హ్గమాలు నిర్వహించి, అభిషేక కార్యక్రమాలు చేశారు. అమ్మవారిని వివిధ పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి నెయ్యిదీపాలు వెలిగించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ధర్మకర్త వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
మారెమ్మ ఆలయంలో..
పట్టణంలోని బస్టాండ్‌లో వెలసియున్న శ్రీవిరూపాక్షి మారెమ్మ ఆలయంలో ఆదివారం అమావాస్య పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని నల్లరంగుతో అలంకరించి నిమ్మకాయలు, గుమ్మడికాయలు పెట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి నెయ్యిదీపాలు వెలిగించి, చలిపిండి, పెరుగన్నం పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Tags; Poojas to Shri Choudeshwaridevi in Punganur