Natyam ad

పల్లెల్లో పడకేసిన పారిశుధ్యం

– ప్రభలుతున్న విష జ్వరాలు

నంద్యాల ముచ్చట్లు:

పారిశుద్ధ్య పనులు చేపట్టడంలో పంచాయతీ  అధికారులు విఫలం అయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడంలో వైద్య అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రదాన ఆరోపణలు వినిపిస్తున్నాయి.   రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య పనులు మరియు సీజనల్ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న మండల స్థాయి గ్రామస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడంతో గ్రామాల్లో విష జ్వరాలు ప్రభలుతున్నాయి. గత వారం రోజుల నుంచి భారీ వర్షాలు పడడంతో గ్రామాల్లో రహదారులు, వీధులలో వర్షపు నీరు ఆగి బురదమయంతో నీటి కాలుష్యం, దోమలు ఏర్పడి విష జ్వరాలకు దగ్గర అవుతున్నారు . గతంలో ఆళ్లగడ్డ మండలం జమ్ములదిన్నె  గ్రామ ప్రజలు సీజనల్ వ్యాధులతో చాలా ఇబ్బందులు పడ్డారు. గ్రామాల్లో  రోజు రోజుకు  వాంతులు, విరేచనాలు వంటి అనేక సమస్యలతో జిల్లా కేంద్రంలో  ప్రైవేటు ఆసుపత్రిలు కిట కిట లాడుతున్నాయి.

 

 

గ్రామ అధికారులు మరియు వైద్యాధికారులు అప్రమత్తమై మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చికిత్స చేస్తూ గ్రామ ప్రజలకు ఆరోగ్యపరమైన సూచనలు ఇస్తూ సీజనల్ వ్యాధులపై ముందస్తు జాగ్రత్తలు తెలియజేయాలని పలువురు కోరుతున్నారు. . గ్రామాల్లో  ఎక్కువగా కలుషిత నీటి ప్రభావంతో వస్తున్నాయని బోరింగ్ నీరు తో పాటు మినరల్ వాటర్ తాగిన వారికి కూడా సీజనల్ వ్యాధులు వస్తున్నాయని పలువురు అంటున్నారు . మండల అధికారులు ఎమ్మార్వో, ఎంపీడీవో మరియు గ్రామ అధికారులు, పంచాయతీ సెక్రెటరీ, సర్పంచ్ గ్రామంలో పర్యవేక్షించి  పారిశుద్ధ్య లోపాలను మరియు వాటర్ ట్యాంకు లను శుభ్రం చేయాలని కోరుతున్నారు.  గ్రామ ప్రజలు ఎలాంటి భయాందోళన గురి కాకుండా  మనోధైర్యాన్ని అధికారులు నింపాలని పలువురు కోరుతున్నారు.

 

Tags: Poor sanitation in rural areas