అధ్వానంగా తయారైన బిట్రగండ కల్వర్టు
-ప్రమాదం జరిగితే గాని పట్టించుకోరా
విశాఖపట్నం ముచ్చట్లు:
డుంబ్రిగుడ మండలం పరిధిలోగల కొల్లాపూటు పంచాయితీ నందివలస,బిట్రగండ మధ్య ఉన్న కల్వర్టు ప్రమాదకరంగా మారి వాహనదారులకు,పాదసారథిలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది.ఎన్నోమార్లు ప్రభుత్వ అధికారులకు,ప్రజాప్రతినిధులకు కల్వర్టు కోసం బిట్రగండ,బలియగూడ గ్రామస్తులు వినతుల ద్వారా విన్నవించుకున్నా స్పందించటం లేదని గ్రామవార్డు సభ్యుడు బి.సుందర్,యూత్ కమిటీ సభ్యులు ఎం.నర్సింగ్,ఆనంద్ రావు,రామ్మూర్తి,గ్రామ పెద్ద బి.పండు స్థానిక విలేకర్ల ముందు వాపోయారు.ఈ రహదారిలో నిత్యం రాత్రి పగలు రాకపోకలు సాగిస్తుంటరని ఏమాత్రం వాహనదారులు ఆదమరిస్తే ప్రమాదం తప్పదని తెలిపారు.దానితోపాటు రెండు గ్రామాల విద్యార్థిని విద్యార్థులు నందివలస గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్య అభ్యసించడానికి ప్రతిరోజు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు.ఇంత ప్రమాదం పొంచి ఉన్న కల్వర్టుకు మాత్రం అధికారులు గాని ప్రజా ప్రతినిధులుగాని స్పందించకపోవడం దారుణం అన్నారు.ఇప్పటికైనా స్పందించి సంబంధిత అధికారులు కల్వర్టును మరమత్తు నిర్మాణం చేపట్టాలని రెండు గ్రామస్తులు గిరిజనులు కోరుతున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Poorly made bitraganda culvert