స్వచ్చంధ సంస్థ నిషేధంపై పాపులర్‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా ధర్నా 

Popular Front of India Dharna on Swamy Foundation ban

Popular Front of India Dharna on Swamy Foundation ban

Date:24/02/2018

పుంగనూరు ముచ్చట్లు:

జార్ఖండ్‌ రాష్ట్రంలో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా స్వచ్చంధ సంస్థ పై నిషేధం విధించడంపై పుంగనూరు తహశీల్ధార్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్‌ అధ్యక్షుడు ఫయాజ్‌ మాట్లాడుతూ 2015 నుంచి జార్ఖండ్‌ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో పాపులర్‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా పని చేస్తుందన్నారు. జార్ఖండ్‌ రాష్ట్రంలో అణగారిన వర్గాల కోసం పాపులర్‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా శ్రమించుట వలన హిందుత్వపరిపాలన శక్తులు తమ రాజకీయ వ్యాపారం కోసం, రాజ్యాంగం ప్రసాధించిన ప్రాథమిక హక్కులను కాలరాసేలా నిషేధం విధించిందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది జహుర్‌బాషా, అతిక్‌బాషా, ఆసిఫ్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags: Popular Front of India Dharna on Swamy Foundation ban

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *