జనగణమన శత వేడుకలు

– పుంగనూరులో భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
-మరో చరిత్రకు కమిటి సన్నహాలు

Date:17/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

నిత్య జాతీయ గీతాలాపనతో దేశంలోనే తొలిసారిగా ఘన చరిత్ర నమోదు చేసుకున్న పుంగనూరు పట్టణం మరో చరిత్రకు శ్రీకారం చుట్టింది. మనం ఆలపించే జాతీయ గీతం జనగణమన ఇం•ష్‌ అనువాదానికి వందేళ్లు పూరైయిన సందర్భంగా శత వేడుకలు భారీగా నిర్వహించేందుకు జనగణమన కమిటి సన్నహాలు ప్రారంభించింది. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మదనపల్లెలో 1919 ఫిబ్రవరి 28న జనగణమన గీతాన్ని ఇం•ష్‌లో అనువధించారు. వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణ జనగణమన కమిటి సభ్యులు పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌, పి.అయూబ్‌ఖాన్‌, వి.దీపక్‌, ఎన్‌.ముత్యాలు, సివి.శ్యామ్‌ప్రసాద్‌ కలసి శత జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఈనెలాఖరులోపు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఈ శతజయంతి వేడుకలకు పట్టణ ప్రముఖులను, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యులు చేసి , దేశభక్తిని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

లక్ష్యం ఘనం… వ్యవసాయ రుణాలు భారం

Tags: Centennial celebrations

ఆర్టికల్ 370 రద్దుతో పటేల్ కల సాకారం చేశాం: జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ. 

Date:15/08/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

 

భారతదేశం అభివృద్ధికి, పరిరక్షణకు పాటుపడుతున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ప్రధాని నరేంద్రమోదీ. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన మోదీ అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు.

భారతదేశం కోసం త్యాగాలు చేసిన ఎందరో మహానుభావులకు అందరికీ వందనాలు తెలిపారు. అనంతరం ఇటీవల సంభవించిన వరదల్లో మృతిచెందిన వారికి మోదీ నివాళులర్పించారు. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఇదే తన ప్రసంగమని చెప్పుకొచ్చారు.

కేంద్రప్రభుత్వం తరపున తాను ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చినట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరూ అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో తాను పనిచేస్తున్నట్లు తెలిపారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఆశించినట్లు ఆర్టికల్ 370ను రద్దు చేసినట్లు తెలిపారు. ఫలితాంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలను సాకారం చేసినట్లు తెలిపారు.

అలాగే దేశంలో తమ ప్రభుత్వం ఎన్నో అద్భుత చట్టాలను తీసుకువచ్చినట్లు తెలిపారు మోదీ. దేశప్రజలకు పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ట్రిపుల్ తలాక్ బిల్లును రద్దు చేసి ముస్లిం మహిళలకు అండగా నిలిచినట్లు తెలిపారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు కఠిన చట్టాలను తీసుకువచ్చినట్లు తెలిపారు.

రాబోయే ఐదేళ్లలో మెరుగైన భారత్ ను నిర్మించేందుకు తాను నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. దేశంలో తాను రెండోసారి ప్రధానిమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 10 వారాల్లోనే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. దేశంలో ఎన్నడూ లేనివిధంగా రైతులందరికీ పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

తమ ప్రభుత్వంపై యువతకు ఎంతో నమ్మకం ఉందన్నారు. వారి నమ్మకాలను నిజం చేస్తానని హామీ ఇచ్చారు. దేశం మారుతుందన్న నమ్మకం ప్రతీ ఒక్కరూ నమ్ముతున్నారని తెలిపారు.

పాఠశాల భవనంలోని ఓ గదిలోకి తీసుకెళ్లి.. బాలికలపై టీచర్ల పైశాచికం

Tags: Patel’s dream of repealing Article 370: Modi addressing race

వరుస తప్పులతో కాంగ్రెస్ కష్టాలు

Date:14/08/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

కాంగ్రెసు చరిత్రలో సుదీర్ఘకాలం అధ్యక్షురాలిగా పనిచేసి కష్టకాలంలో పార్టీని గట్టెక్కించిన సోనియానే మరోసారి బాధ్యతలు తలకెత్తుకోవాలా? వేల మంది సీనియర్ నాయకులు, యువ నాయకులు

ఉన్న పార్టీకి వారసత్వ కుటుంబం తప్ప వేరే దిక్కే లేదా? స్వాతంత్ర్యం సముపార్జించిన పార్టీగా క్లెయిం చేసుకోవడమే కాదు. దేశంలోని రెండో పెద్దపార్టీగా నేటికీ కాంగ్రెసుకు ఆదరణ ఉంది. కోట్లాది మంది

ప్రజల సభ్యత్వంతో ప్రపంచంలోని పెద్ద పార్టీలలో ఒకటిగా ఉంది. సుదీర్ఘ చరిత్ర, అంతకుమించి భారతదేశ పరివర్తన శకంలో కీలక భూమిక పోషించిన పార్టీగా ప్రపంచానికి కాంగ్రెసు తెలుసు. పొరపాట్లు,

లోపాలు, నిర్ణయాలలో దోషాలు ఉండవచ్చు. కానీ నేటికీ దేశమంతటా వ్యాపించి పాన్ ఇండియా గుర్తింపు ఉన్న ఏకైక ప్రతిపక్షపార్టీగా కాంగ్రెసునే చెప్పుకోవాలి. నరేంద్ర మోడీ, అమిత్ షాల శకం

మొదలయ్యాక బీజేపీ వ్యాప్తిలోనూ , వ్యూహ చాతుర్యంలోనూ చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రత్యర్థిని కట్టడి చేయడంలో వారి ఎత్తుగడలు అంతుచిక్కని విధంగా ఉంటున్నాయి. ఫలితంగానే

ప్రతిపక్షం ఉండీలేనట్లుగా తయారవుతోంది. కాంగ్రెసు ముక్త్ భారత్ నినాదాన్ని నిజం చేయబోతున్నట్లుగా రాజకీయ వాతావరణాన్ని బీజేపీ మలచగలిగింది. ఈదిశలో కాంగ్రెసు

స్వయంకృతాపరాధాలతో కొన్ని కష్టాలను కొని తెచ్చుకుంటున్నట్లు కనిపిస్తోంది.మోడీ, అమిత్ షా లు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ప్రచారం చేయడానికి గడచిన రెండేళ్లుగా అత్యధిక ప్రాధాన్యం

ఇచ్చారు. యువ నాయకుడు, కాంగ్రెసు పార్టీకి దిక్సూచి రాహుల్ మాత్రమేనని వారికి తెలుసు. అందుకే యువరాజు, వారసత్వం అంటూ పదే పదే ఎద్దేవా చేస్తూ వచ్చారు. ఇది వ్యక్తిగతంగా కాంగ్రెసు

అధ్యక్షుడికి కొంత ఇబ్బందికరంగా మారింది. నిజానికి రాహుల్ గాంధీని ప్రజాస్వామ్య విలువలు తెలిసిన నాయకుడిగానే చెప్పుకోవాలి. కాంగ్రెసు ప్రధాన కార్యదర్శిగా ఉంటూ పార్టీలో విద్యార్థి,

యువజన విభాగాలకు ఇన్ ఛార్జిగా ఉన్నప్పుడు ఆ విభాగాలకు అంతర్గతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నించారాయన. తాను అనుకున్నది చేయాలనుకుంటారు. ఇందుకోసం అనేక

సందర్బాల్లో తమ పార్టీతోనూ, ప్రభుత్వంతోనూ విభేదించారు. కానీ పొలిటికల్లీ సెన్సిటివ్. ఫెయిల్ అయితే తొందరగానే అలసిపోతారు. కిల్లర్ ఇన్ స్టింక్ట్ లేదు. రాహుల్ లోని ఈ మనస్తత్వాన్ని మోడీ,

షాలు సరిగానే అంచనా వేశారు. అందుకే ఆయనపైనే గురి పెట్టారు. వారసత్వం అన్నమాట రాహుల్ కు నచ్చలేదు. అందుకే బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి భీష్మించారు. రాహుల్

అధ్యక్షునిగా లేకపోతే కాంగ్రెసు చుక్కాని లేని నావలా మారుతుంది. మరింతగా బలహీనపడుతుంది. ఇదే బీజేపీ లక్ష్యం.కాంగ్రెసు పార్టీపై కమలం పార్టీ వేస్తున్న వారసత్వ ముద్రను తొలగించాలనేది

రాహుల్ తాపత్రయం. అందుకే పార్టీకి తన అవసరం ఉందని తెలిసినా రాజీనామా చేస్తానని ముందుకు వచ్చారాయన. కానీ ఇక్కడ రాహుల్ గుర్తించని విషయం ఒకటుంది. గాంధీ ముద్ర లేకపోతే పార్టీ

వర్గాలుగా మారిపోతుంది. మళ్లీ నాయకత్వ పోరు ముదిరిపోతుంది. గతంలో తొమ్మిదో దశకంలో పీవీ నరసింహారావు, సీతారాం కేసరి వంటి వారు నాయకత్వం వహించినా ఏమాత్రం పార్టీలో

స్ఫూర్తినింపలేకపోయారు. కాంగ్రెసు పరిస్థితి బాగా బలహీనపడింది. అధినాయకత్వాన్ని వర్గాలు పెద్దగా లెక్క చేసేవి కావు. దాంతో మళ్లీ సోనియా గాంధీ వచ్చేవరకూ కాంగ్రెసు ఏకతాటిపై

నడవలేకపోయింది. నిజానికి కాంగ్రెసులో సోనియాను వ్యతిరేకించినవారు లేకపోలేదు. కానీ వారి సంఖ్య చాలా స్వల్పం. అధ్యక్షపీఠాన్ని ఆశించిన వారు, తమకు శాశ్వతంగా పార్టీలో అగ్రస్థానానికి

ఎదగడానికి అవకాశం రాదనే ఉద్దేశంతోనే అసమ్మతి గళం ఎత్తుకున్నారు. శరద్ పవార్ వంటి పెద్దస్థాయి వ్యక్తులూ ఇందులో ఉన్నారు. కానీ తర్వాత వారు సైతం కాంగ్రెసుతో కలిసి పనిచేయాల్సి

వచ్చింది. అదీ గాంధీ కుటుంబానికి ఉండే ప్రాధాన్యత. నిజానికి నాయకత్వానికి కాంగ్రెసులో సీనియర్లు, యువ నాయకుల్లో చాలా మంది అర్హులు ఉన్నారు. సమర్థంగా పనిచేయగలిగిన వారికీ కొరత

లేదు. కానీ సామర్థ్యం కంటే సెంటిమెంటుకే ఇంపార్టెన్స్. అందుకే అయిదు కమిటీలు వేసుకుని కూడా అధ్యక్షపీఠానికి అర్హులను తేల్చుకోలేకపోయింది కాంగ్రెసు.సోనియా గాంధీ పై పెద్ద బాధ్యతనే మళ్లీ

మరోసారి పెట్టేశారు. కేవలం రెండేళ్ల కాల వ్యవధిలోనే అధ్యక్షపీఠం నుంచి తప్పుకున్నారు.

 

తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు కదలిక

Tags: Congressional misery with a series of mistakes

తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు కదలిక

Date:14/08/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రానున్న సాధారణ ఎన్నికలకు ముందే జమ్మూ కాశ్మీర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం

భావిస్తున్నట్టు తెలుస్తోంది. జమ్మూలో 7 సీట్లు పెంచాల్సి ఉండగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సిక్కింలో కూడా అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉంది. దీనిపై త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని ప్రచారం

జరుగుతోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం 2026 తర్వాత జనాభా లెక్కల ఆధారంగానే అసెంబ్లీ స్థానాల పెంపు ఉంటుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత

జనాభాకు అనుగుణంగా ఏపీలో ప్రస్తుతం ఉన్న స్థానాలను 175 నుంచి 225 పెంచాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. అలాగే తెలంగాణలో ఉన్న 119 స్థానాలను 153కు పెంచాలని విభజన చట్టంలో

పొందుపరిచారు. దీంతో రాష్ట్రం విడిపోయిన దగ్గరనుంచి అసెంబ్లీ సీట్లు పెంచాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.అయితే ఈ అంశంపై అప్పుడప్పుడు పార్లమెంటులో కేంద్ర

ప్రభుత్వం స్పందిస్తూనే ఉంది. 2024 వరకు సీట్ల పెంపు ఉండదని పలుమార్లు తెగేసి చెప్పింది. అయితే ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ని రద్దు చేయడం, ఆర్టికల్ 3 ప్రకారం జమ్మూ కాశ్మీర్

నుంచి లడక్ ను విభజించడం జరిగిపోయాయి. జమ్మూకాశ్మీర్ లో చట్ట ప్రకారం ప్రస్తుతం 107గా ఉన్న సీట్ల సంఖ్యను 114కు పెంచుతామని కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం చర్చించింది.

విభజన చట్టం- సీట్ల పెంపు ప్రతిపాదనలు అందగానే ఈసీ తన ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. ఇక పనిలో పనిగా తెలుగు రాష్ట్రాల సీట్లను కూడా పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

ఎలాగో ఏపీ విభజన చట్టంలో పెంపు అంశం పొందుపరిచారు కాబట్టి దీనిపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదే జరిగితే జమ్మూకాశ్మీర్ తోపాటు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చదువు కావాలంటే 3 కిలోమీటర్లు నడవాల్సిందే

Tags: Seat increase movement in Telugu states

హ్యాట్రిక్ ప్లస్ 426 టార్గెట్

Date:13/08/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ఆటల్లోనే కాదు పాలిటిక్స్ లోను రికార్డ్ లు ఉంటాయి. ఆ రికార్డ్ లను చెరిపేసేందుకు అంతా తమవంతు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తన అద్భుత బ్యాటింగ్ తో విపక్షాల బౌలింగ్ ను ఊచకోత కోసి మరోసారి అధికారం అందుకున్న మోడీ టార్గెట్ పాత రికార్డ్ బద్దలు కొట్టడమే అంటున్నాయి కాషాయ దళాలు. దేశ పార్లమెంట్ చరిత్రలో రాజీవ్ గాంధీ పేరిట ఒక అరుదైన రికార్డ్ నెలకొని ఉంది. ఇప్పటివరకు ఏ పార్టీ అందుకోలేనంత స్థాయిలో రాజీవ్ గాంధీ రికార్డ్ ఆ విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్ట్టించారు.ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే నినాదంతో 2011 లో టీం ఇండియా ధోని సేన ప్రపంచకప్ లో అద్భుతంగా రాణించి కప్ గెలుచుకుంది.

 

 

 

అదే రీతిలో ఇప్పుడు మోడీ సైతం ఫాం లో ఉండగానే పాత రికార్డ్ చెరిపేయాలని తహతహలాడుతున్నారంటున్నారు. ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ సారథ్యంలని కాంగ్రెస్ పార్టీ 426 స్థానాలు గెలుచుకుని భారీ విజయంతో పాటు భారీ రికార్డ్ నెలకొల్పేసింది.ప్రస్తుతం మోడీ కి లోక్ సభలో 303 సభ్యుల బలం వుంది. ఈ సంఖ్యను మరింతగా వచ్చే ఎన్నికల్లో నెలకొల్పాలని మోడీ అమిత్ షా తో వ్యూహం రూపొందిస్తున్నారు. ఇప్పటికే రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ 426 ఫిగర్ ను అందుకోవడంతో బాటు హ్యాట్రిక్ కొట్టి అధికారంలోకి రావాలని భావిస్తున్నారని పొలిటికల్ టాక్.

 

 

 

 

 

ఇప్పుడున్నంత బలహీనంగా విపక్షాలు ఎప్పుడు లేవని వారు తేరుకునేలోగా పని పూర్తి చేయాలన్న కమలనాధుల వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. అయతే రాజీవ్ గాంధీ హయాంలో ప్రాంతీయ పార్టీలుఅంత బలంగా లేవు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు దాదాపు అన్ని రాష్ట్రాల్లో పట్టుతో ఉన్నాయి. మరి ఆ రికార్డును మోడీ అధిగమిస్తారా? లేదా?

దక్షిణాది రాష్ట్రాల వైపు కన్నెత్తి చూడని కేంద్రం

Tags: Hat trick plus 426 target

జార్ఖండ్, హర్యానాలపై ఎవరి లెక్కలు వారివే

-త్రిముఖ పోటీలో విజేతలు ఎవరు

Date:13/08/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ఈ ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో జరగనున్న హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్, జార్ఖండ్ ముక్తి మోర్చా, జేయూఎం పార్టీలు అస్త్ర శస్త్రాలను సమకూర్చుకుంటున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. హర్యానాలో కాంగ్రెస్, జార్ఖండ్ లో ప్రాంతీయ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నాయి. అధికారాన్ని రెండు రాష్ట్రాల్లో కాపాడుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా, అధికారాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, జేఎంఎ: శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాయి.

 

 

 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కాపాడుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. అధికారాన్ని సాధించడం పక్కన పెడితే గౌరవ ప్రదమైన స్థానాలు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్, జేఎంఎం పనిచేస్తున్నాయి.దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉండే హర్యానాపై అందరి దృష్టి ఉంది. హర్యానా పేరు చెప్పగానే దేవీలాల్, భజన్ లాల్, బన్సీలాల్ గుర్తుకు వస్తారు. ఈ లాల్ త్రయం రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు శాసించింది. దేవీలాల్ జనతాదళ్ హయాంలో ఉప ప్రధానిగా, బన్సీలాల్ 70ల్లో కాంగ్రెస్ హయాంలో రక్షణమంత్రిగా చక్రం తిప్పారు. భజన్ లాల్ కేంద్రంలో పనిచేయనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సత్తా చాటారు.

 

 

 

 

దేవీలాల్, బన్సీలాల్ కూడా సీఎంగా చక్రం తిప్పారు. ప్రస్తుతం భజన్ లాల్ , బన్సీలాల్ వారసులు రాష్ట్ర రాజకీయాల్లో కీలక స్థానాల్లో లేరు. దేవీలాల్ వారసులు మాత్రం క్రియాశీలకంగా ఉన్నారు. దేవీలాల్ వారసులు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పేరుతో పార్టీని నడిపిస్తున్నారు. ఆయన తనయుడు ఓంప్రకాశ్ చౌతాలా 1999 నుంచి 2005 వరకూ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తరువాత ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో ఇరుక్కుని ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు. చౌతాలా తనయుడు అభయ్ సింగ్ చౌతాలా పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారు.

 

 

 

2014 ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకు గాను బీజేపీ 47 స్థానాలు, 33.2 శాతం ఓట్లు సాధించి అధికారాన్ని అందుకుంది. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా పనిచేసిన మనోహర్ లాల్ ఖత్తర్ గత అయిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సారథ్యంలోనే పార్టీ ఎన్నికలకు వెళ్లనుంది. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 10 స్థానాలకు గాను పది గెలిచి బీజేపీ మంచి ఊపుమీద ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం తమదేనన్న ధీమాలో బీజేపీ నేతలున్నారు.ఇటీవల పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జయప్రకాష్ నడ్డా రాష్ట్రంలో పర్యటించి ఎన్నికలపై సమీక్ష నిర్వహించారుస్థానాల్లో గెలుపు లక్ష్యంగా పనిచేయాలని నిర్దేశించారు.

 

 

 

 

పక్కనే ఉన్న హిమాచలప్రదేశ్ కు చెందిన నడ్డాకు హర్యానా రాజకీయాలపై మంచి అవగాహన ఉంది. గత ఎన్నికల్లో 18 స్థానాలు, 24.1 ఓట్ల శాతం సాధించిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ కూడా అధికారమే లక్ష్యంగా పనిచేస్తుంది. కీలకమైన జాట్ సామాజిక వర్గానికి చెందిన పార్టీ సారథి అభయ్ సింగ్ చౌతాలాకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి పట్టుంది. పార్టీ ప్రధాన మద్దతుదారుల్లో జాట్ లు ఒకరు. 2014 ఎన్నికల వరకూ భూపేందర్ సింగ్ హుడా సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసింది. నాటి ఎన్నికల్లో హుడా సారథ్యంలోనే పోరాడిన కాంగ్రెస్ 17 స్థానాలు, 20.6 శాతం ఓట్లతో మూడోస్థానానికే పరిమితమైంది. మళ్లీ ఆయన సారథ్యంలోనే పార్టీ ఎన్నికలు ఎదుర్కొననుంది.

 

 

 

 

జార్ఖండ్ ఎన్నికలపైనా ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి బీజేపీ అధికారాన్ని చేపట్టింది. గత ఐదేళ్లుగా రఘుబరన్ దాస్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 81 స్థానాలు గల అసెంబ్లీలో 2014 ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షంతో కలసి 46 స్థానాలను సాధించింది. ప్రాంతీయ పార్టీ అయిన జార్ఖండ్ ముక్తి మోర్చా 19 స్థానాలను సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఈ పార్టీ సారధి మేమంత్ సొరేన్ ప్రతిపక్షనేతగా ఉన్నారు. కాంగ్రెస్ 8 స్థానాలతో మూడో స్థానానికే పరిమితమయింది. జేవీపీ, సీపీఐ(ఎంఎల్), బీఎస్పీ వంటి చిన్నా చితకా పార్టీలు ఒకటి, రెండు స్థానాలతోనే సరిపెట్టుకున్నాయి. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 14 స్థానాలకు గాను బీజపీ 12 స్థానాలను గెలుచుకుంది.

 

 

 

కాంగ్రెస్, జేఎంఎం చెరి ఒకటిని దక్కించుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి మధు కోడా భఆర్యత గీతా కోడా సింగ్ భూమ్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ మంచి ఊపు మీద ఉంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించగలమన్న ధీమాతో ఉంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతో సతమతమవుతుంది. పీసీసీ చీఫ్ అజయ్ కుమార్ కు వ్యతిరేకంగా రాజకీయ ప్రత్యర్థులు పావులు కదుపుతున్నారు.

 

 

 

 

 

వీరు కేంద్ర మాజీ మంత్రి సభోర్ కాంత్ సహాయ్, పీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రదీప్ బల్మూబ్, ధన్ బాద్ మాజీ ఎంపీ చంద్రశేఖర్ ప్రముఖులు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యులు కెసి వేణుగోపాల్ , అహ్మద్ పటేల్ అంతర్గత కలహాలను కొలిక్కి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీ అయిన జార్ఖండ్ వికాస్ మోర్చాతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ తలపోస్తుంది. మొత్తానికి కమలదళం ఎన్నికలను ఎదుర్కొనేందుకు మంచి ఉత్సాహంతో ఉండగా, విపక్షాలు ఇప్పుడిప్పుడే శక్తిని కూడ దీసుకుంటున్నాయి.

 

టీడీపీలో తీవ్రస్థాయికి వారసుల రచ్చలు

Tags: Whose calculations are on Jharkhand and Haryana

బీజేపీ ఇలా… కాంగ్రెస్ అలా

Date:12/08/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఇప్పట్లో తీరాలా లేవు. భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ అంశాన్ని తీసుకుని మామూలు మైలేజీ సాధించలేదు. దీంతో కాశ్మీర్ అంశంపై కాంగ్రెస్ పార్టీలోని నేతలే బీజేపీ నిర్ణయాన్ని

స్వాగతిస్తున్నారు. సొంత పార్టీపై అసహనం ప్రదర్శిస్తున్నారు. కాశ్మీర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న స్టాండ్ ను సొంత పార్టీ నేతలే స్వాగతించలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి

నమ్మకంగా ఉన్న నేతలు సయితం రాంగ్ డెసిషన్ అంటూ టెన్ జన్ పథ్ వైపు చూపుతున్నారు.అసలు లోక్ సభ ఎన్నికలకు ముందు వరకూ కాంగ్రెస్ పరిస్థితి ఇంత దయనీయంగా లేదు. వచ్చే

ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్న నమ్మకం కింది స్థాయి నుంచి పై స్థాయి నేతల వరకూ ఉండేది. ముఖ్యంగా పంజాబ్ లో విజయం సాధించడం, గుజరాత్ ఎన్నికల్లో అధికారం దక్కకపోయినా

హోరాహోరీ పోరాడటంతో రాహుల్ గాంధీ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. పార్టీలోనూ, బయటా రాహుల్ జపం మామూలుగా లేదు.ఆ తర్వాత కొంతకాలం క్రితం జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ ,

రాజస్థాన్ ఎన్నికల తర్వాత ఇక రాహుల్ గాంధీని పట్టలేకపోయారు. మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడంతో లోక్ సభ ఎన్నికల్లో విజయం తమదేనన్న ధీమా కాంగ్రెస్ లో కన్పించింది.

మిత్రపక్షాల్లోనూ మోదీని ఓడించగల సత్తా రాహుల్ గాంధీకి ఉందని నమ్మారు. దీంతో మిత్రపక్స పార్టీలన్నీ కాంగ్రెస్ తో జట్టుకట్టేందుకు డిసైడ్ అయిపోయాయి. ఉత్తరప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో

పొత్తులతో కాంగ్రెస్ బరిలోకి దిగింది. అయినా ఓటమి తప్పలేదు.అయితే తాజాగా రాహుల్ గాంధీ రాజీనామా చేయడం, కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉండటంతో మిత్రపక్షాలు కూడా హస్తం పార్టీని

దూరం పెట్టేస్తున్నాయి. కీలక బిల్లుల విషయంలో డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ మినహా పెద్దగా ఎవరూ కలసి రావడం లేదు. మాయావతి ఎప్పటి నుంచో కాంగ్రెస్ ను దూరం పెట్టేశారు. మమత బెనర్జీ

పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ కూడా కలసి రావడం లేదు. ఆర్జేడీ మిత్రపక్షంగా ఉన్నా సైలెంట్ అయిపోయింది. మొత్తం మీద లోక్ సభ ఎన్నికలకు ముందున్న ఊపు ఇప్పుడు కాంగ్రెస్ లో

లేకపోవడంతో మిత్రపక్షాలు కూడా సైడయిపోతున్నాయనే చెప్పాలి.
మూడు నెలల నుంచి నాధుడే లేడు
కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి నాధుడు లేకుండానే మూడు నెలల పుణ్య కాలం గడచిపోయింది. ఎపుడైతే ఎన్నికల ఫలితాలు దారుణంగా వచ్చాయో అప్పుడే

యువరాజు రాహుల్ గాంధి కాడి వదిలేశారు. నా కొద్దీ ప్రెసిడెంట్ గిరీ అంటూ కిరీటం పక్కన పెట్టేశాడు. నాటి నుంచి కాంగ్రెస్ లో మలుపులు అన్నీ ఇన్నీ కావు. టీవీ సీరియల్ మాదిరిగా, జీడిపాకంలా

సాగుతోంది కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి కధ. గతంలో కాంగ్రెస్ లో మేరు నగధీరులు ఉండేవారు. గాంధీ వారసులతో సరిసమానమైన సత్తా చూపించే దిగ్గజాలు ఎందరో ఉండేవారు. అందుకే సులువుగా

అధ్యక్ష పదవికి సరైన నేతలు దొరికేవారు. తన నియంత్రుత్వపు పోకడలతో వారిని పోగొట్టుకున్న కాంగ్రెస్ కి ఇపుడు మిగిలింది అంగుష్టమాత్రులే. దాంతో కాంగ్రెస్ పార్టీ ఇపుడు పిలిచి

పీఠమెక్కిస్తామన్నా ఆ స్థాయి కలిగిన నాయకులు పార్టీలో కాగడా పెట్టి వెతికినా దొరికేట్టులేరు.ఇక కాంగ్రెస్ లో జీ హుజూర్ కల్చర్ కి అలవాటు పడిన ప్రాణాలే మొత్తానికి మొత్తంగా ఉన్నాయి.

వారందరికీ గాంధీ కుటుంబం తప్పితే మరొకరిని అధ్యక్ష పీఠంపై చూసి సహించే ఓపిక, భరించే సహనం అసలే లేవు. తాము అంతా ఒక్కటి, గాంధీ కుటుంబం మాత్రమే దేశాన్ని, పార్టీని ఉద్ధరించేందుకు

దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవతలను కాంగ్రెస్ నేతలకు అతి పెద్ద భ్రమలు ఉన్నాయి. ఇప్పటికిపుడు వాటిని తొలగించుకుని మేమూ నాయకులమే అని బోరవిడిచి నిలబడే సత్తా ఎవరికీ లేదు.

అందుకే కాంగ్రెస్ పార్టీలో నాయకుడు అన్న వారే లేకుండా పోయారు. ఇపుడు ఈ విచిత్ర పరిస్థితే కాంగ్రెస్ కు లీడర్ అన్న వారు లేకుండా చేస్తోంది. రాహుల్ గాంధి వద్దు పొమ్మంటున్నా వర్కింగ్ కమిటీ

తీర్మానల మీద తీర్మానాలు చేస్తూ శరణం అంటోంది. నిజంగా ప్రజాస్వామిక లక్షణాలు ఏవీ ఆ పార్టీకి లేవన్నది తాజా ఉదంతం చూస్తే అర్ధమవుతోంది.కొడుకు పార్టీని విడిచిపెడితే తల్లి సోనియమ్మే

అధ్యక్షురాలు కావాలని కాంగ్రెస్ మొత్తం కోరుకుంటోంది. 2017 డిసెంబర్ లో ఆర్భాటంగా కాంగ్రెస్ కిరీటాన్ని స్వయంగా సోనియా రాహుల్ కు తొడిగారు. ఈనాడు పార్టీకి అధ్యక్షుడు, రేపు దేశానికి

ప్రధాని అంటూ నాడు సోనియమ్మతో సహా అంతా ఆనందించిన సందర్భమది. ఆ మురిపాలు తీరకుండానే కాంగ్రెస్ పార్టీ పుట్టె ముంచుతూ రాహుల్ పదవిని కాలదన్నారు. మరో వైపు తన కుటుంబం

నుంచి ఎవరూ పార్టీ బాధ్యతలు స్వీకరించరారదని షరతు కూడా పెట్టారు. ఎవరెన్ని చెప్పినా కూడా కాంగ్రెస్ శ్రేణులు మాత్రం వినేలా లేవు. రాహుల్ కాకపోతే సోనియమ్మ మా పెద్ద అంటున్నారు.

ఆమెను అధ్యక్షురాలిగా చేసుకుంటామంటున్నారు. నిజమే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇపుడు దయనీయంగా ఉంది. సోనియా ప్రెసిడెంట్ గా ఉన్నపుడు ఇలా లేదు. రెండు సార్లు యూపీయేను ఆమె

అధికారంలోకి తీసుకువచ్చారు. మిత్ర పక్షాలతో ఆమె కలసి కూటమిని కట్టారు. ఇపుడు ఆ చొరవ తెగువ రాహుల్ లో లేకపోవడం ఓ కారణమైతే సోనియా మీద ఉన్న నమ్మకం, గౌరవం కొడుకు మీద

మిత్రులకు కూడా లేదు. అందువల్లనే కాంగ్రెస్ శ్రేణులు కూడా సోనియా అయితేనే ఈ సంక్షోభం నుంచి పార్టీని గట్టెక్కిస్తుందని గంపెడాశలు పెట్టుకున్నారు. మరి సోనియాగాంధీ పార్టీని గట్టెక్కిస్తారా? లేదా? చూడాలి.

వారసుడిగా… ఒప్పులకోలేకపోతున్నారు 

Tags: Like the BJP … Congress does that

మస్లింలకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి, ఎంపి మిధున్‌

Date:11/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

బక్రీద్‌ పండుగను పురస్కరించుకుని ముస్లిం మైనార్టీలందరికి పండుగ శుభాకాంక్షలను రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖమంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్‌ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి , తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి విడివిడిగా ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్‌ పండుగను పురస్కరించుకు ముస్లిలందరు వారి కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో పండుగను జరుపుకోవాలని కోరారు. చిత్తూరు జిల్లా ముస్లిం మైనార్టీలకు , అలాగే రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోని ముస్లిలందరికి శుభాకాంక్షలు తెలిపారు.

జగన్‌ను, గవర్నర్‌ విశ్వభూషణ్‌ను కలిసిన గిరిజన సంఘ నాయకుడు

Tags: Bakrid’s best wishes to Muslims, Peddi Reddy, MP Mithun