బీజేపీ `ఆప‌రేష‌న్ ఆగ‌స్ట్‌`

Date:11/07/2019

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యూహాత్మకంగా ఎద‌గాలి. ఎలాగైనా అధికారంలోకి రావాలి. ఇదీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేత‌ల వ్యూహం. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావ‌డ‌మే ధ్యేయంగా ముందుకు సాగాల‌ని నిర్ణయించారు. ఈ క్రమంలోనే బీజేపీ `ఆప‌రేష‌న్ ఆగ‌స్ట్‌`ను ప్రారంభించేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నార‌ని స‌మాచారం.

 

 

ఏపీలో నిల‌బ‌డేందుకు గ‌ట్టిగా పావులు క‌దుపుతున్నారు. ప్రజల్లో క్షేత్రస్థాయిలో బ‌లం అనే మాట‌ను ప‌క్కన పెట్టి.. నాయ‌కుల‌ను సాధ్యమైనంత వ‌ర‌కు పెద్ద ఎత్తున ఇత‌ర పార్టీల నుంచి తీసుకునేందు కు వ్యూహానికి పావులు క‌దుపుతున్నారు.ఈ నేప‌థ్యంలో `ఆప‌రేష‌న్ ఆగ‌స్ట్`ను ప్రారంభించారని స‌మాచారం. ముఖ్యంగా టీడీపీకి సెంటిమెంట్‌గా వ‌స్తున్న “ఆగ‌స్టు సంక్షోభాన్ని“ త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయ‌త్నిస్తున్నట్టు స‌మాచారం. సాధ్యమైనంత వ‌ర‌కు టీడీపీలో చీలిక‌లు తీసుకువ‌చ్చి.. త‌ట‌స్థంగా ఉన్న నాయ‌కుల‌ను బీజేపీ దిశ‌గా పార్టీ మారే విధంగా వ్యూహాత్మకంగా అడుగు లు వేయాల‌ని నిర్ణయించుకున్న‌ట్టు ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం. ప్రస్తుతం కాపు సామాజిక వ‌ర్గం త‌ట‌స్థంగా ఉంది.

 

 

 

 

త‌మ‌కు మేలు చేసే విధంగా టీడీపీ అధినేత వ్యవ‌హ‌రించ‌డం లేద‌ని, కాబ‌ట్టి త‌మ దారి తాము చూసుకోవ‌డ‌మే క‌రె క్ట్ అని భావిస్తున్నారు.కాపు సామాజిక వ‌ర్గంలోని ఈ వీక్ నెస్‌ను గుర్తించిన బీజేపీ నాయ‌కులు.. ఈ వ‌ర్గం.. జ‌న‌సేన‌కు ద‌గ్గ‌ర‌కు కాకుండా త‌మ‌వైపు తిప్పుకొనేందుకు క‌మ‌ల ద‌ళం కాపు కాయాల‌ని నిర్ణయించుకుంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ నాయ‌కుల‌ను పార్టీలోకి ఆహ్వా నించాల‌ని, సాధ్యమైనంత ఎక్కువ సంఖ్య‌లో నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకునేందుకు రెడీ అవుతున్నారు.

 

 

 

 

దీనికి సంబం ధించి వ‌చ్చే నెల‌లోగా ఒక క్లారిటీకి వ‌చ్చి.. ప‌రిస్థితిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ఆప‌రేష‌న్ ఆగ‌స్ట్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నార‌ని స‌మాచారం. ఈ బాధ్యత‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ స‌హా ఇత‌ర నాయ‌కులకు కూడా అప్పగించార‌ని తెలుస్తోంది. అదే టైంలో ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్యద‌ర్శి రామ్‌మాధ‌వ్ సైతం ఏపీపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. వ‌చ్చేఏ రెండు మూడేళ్లలో ముందుగా టీడీపీని టార్గెట్‌గా చేసుకుని ఆ పార్టీని బాగా వీక్ చేసి ఆ త‌ర్వాత అప్పటి రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ముందుకు వెళ్లాల‌న్నదే బీజేపీ ఎత్తుగ‌డ‌గా తెలుస్తోంది.

పదేళ్లలో కోర్సు ఎత్తేశారు 

Tags: BJP `Operation August

బడ్జెట్‌ ప్రకటనకు భిన్నంగా ఆర్థిక బిల్లు!

-పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.2 సుంకం పెంపు?

 

Date:08/07/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

మోడీ.. పాలనలో దేశం ఇలా అయ్యిందని గొప్పలు చెప్పుకునే వారికి తన తాజా బడ్జెట్ లో వరం ఇవ్వటం తర్వాత.. నిత్యవసర వస్తువైన పెట్రోల్.. డీజిల్ మీద లీటరుకు రూ.2 చొప్పున పెంచుతూ వాత పెట్టిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికలకు ముందు తాముకానీ పవర్లోకి వస్తే.. లీటరు పెట్రోల్.. డీజిల్ రూ.50 కంటే తక్కువకే కట్టడి చేస్తామని.. భారీగా వేస్తున్న పన్నుల భారం నుంచి తప్పిస్తామంటూ సోషల్ మీడియాలో చెప్పిన మాటలు అన్ని ఇన్ని కావు.అయితే.. అలాంటివేమీ మోడీ-1లో చేయని కేంద్రం.. తన తాజా టర్మ్ లోనూ అలాంటివేమీ చేయకపోగా.. కొత్త వాత పెట్టేందుకు రెఢీ అవుతున్న తీరు ఆందోళనగా మారిందని చెప్పాలి. బడ్జెట్ లో లీటరుకు రూ.2చొప్పున పెంచుతున్నట్లు చెప్పగా.. ఆర్థిక బిల్లులో మాత్రం అందుకు భిన్నంగా లీటరుకు రూ.5 చొప్పున పెంచేస్తూ బిల్లును రూపొందించినట్లుగా తెలుస్తోంది. దీంతో రానున్న రోజుల్లో పెట్రో బాదుడు మరింత భారీగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది.పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రం బడ్జెట్‌లో చెప్పింది ఒకటి.. ఆర్థిక బిల్లులో పొందుపర్చింది మరొకటి! పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.2 సుంకాలు పెంచుతున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించింది. కానీ, మరో రూ.5 పెంచేందుకు వీలుగా ఆర్థిక బిల్లును రూపొందించింది. దీన్ని బట్టి చూస్తే మున్ముందు మళ్లీ పెట్రో బాదుడుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.

 

 

 

 

 

 

 

ప్రస్తుతానికి పెట్రోల్‌, డీజిల్‌ ధర లీటరుకు రూ.2 మాత్రమే పెంచాలని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలను ఆదేశించినా, అదను చూసి ధరలు పెంచే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు ప్రత్యేక అదనపు పన్ను (ఎస్‌ఏడీ) రూపాయి, రహదారులు, మౌలిక వసతుల సుంకం మరో రూపాయి చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు.దీన్ని బట్టి లీటరు పెట్రోల్‌కు ఎస్‌ఏడీ రూ.8కి, డీజిల్‌పై రూ.2కు పెరుగుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ రెండింటిపైనా సుంకం రూ.9కు పెరుగుతుంది. బడ్జెట్‌ ప్రకటనలను చట్టంగా మార్చే ఆర్థిక బిల్లు వద్దకు వచ్చేసరికి మాట మారిపోయింది. ఈ పన్ను, సుంకం ఇంకా పెంచేందుకు వీలుగా ప్రభుత్వం మార్గం తెరిచి ఉంచుకుంది. లీటరు పెట్రోల్‌పై ఎస్‌ఏడీ రూ.7 నుంచి రూ.10కి, డీజిల్‌పై రూపాయి నుంచి రూ.4కు పెంచేందుకు వీలుగా ఆర్థిక బిల్లులోని 185వ క్లాజ్‌లో పొందుపర్చింది. అలాగే 201వ క్లాజ్‌లో రహదారులు, మౌలిక వసతుల సెస్సు రూ.8 నుంచి రూ.10కి పెంచేలా నిర్దేశించింది. ఈ రెండూ కలుపుకుంటే పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు లీటరుకు మరో రూ.5 పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి రూ.2 పెంచినా, ప్రభుత్వం కావాలనుకున్నప్పుడు మరింత పెంచుతుంది.

 

వైకాపా కార్యాలయంలో వైఎస్ జయంతి

Tags: Budget Advertisement Financial Bill!

మహానేతకు పుంగనూరు నేతలతో విడదీయ్యలేని బంధం

www.telugumuchatlu.com

Date:07/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గ నాయకులతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి అనుబంధం చెప్పలేనిది. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పేరు పెట్టి పిలిచేంత అనుబంధం .ఆయన తొలుత 1996 ఉప ఎన్నికల్లో స్థానిక ట్రావెలర్స్ బంగ్లాలో కొద్దిసేపు గడిపారు. ఆ సమయంలో అప్పటి కాంగ్రెస్‌ నాయకులు , ప్రస్తుత చిత్తూరు ఎంపి రెడ్డెప్ప, జిల్లా సేవాదల్‌ అధ్యక్షుడుగా ఉన్న మున్సిపల్‌ చైర్మన్‌ నాగభూషణంను ఏం…భూషణ్‌ అంటు పేర్లు పెట్టి సంబోధించేవారు. అలాగే 2009 ఎన్నికల్లో రాజశేఖర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఆ సమయంలో మంత్రి పెద్దిరెడ్డితో ఎన్నికలపై చర్చించారు. మహానేతకు ఎంపి రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఖాదర్‌ఖాన్‌, ఎంఎం.మహమ్మదాలి కలసి వెంకటేశ్వరుని మెమెంటోను అందజేశారు. ఈ సంధర్భంగా ఎంపి రెడ్డెప్ప మహానేత కాళ్లకు నమస్కరించారు. సభలో మైకు పనిచేయకపోవడంతో చలోక్తులు విసిరారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేరే మైకుతో మాట్లాడించారు. ఆలస్యమౌతొందంటు ప్రజలకు అబివాదం చేస్తూ , తన వాచిలో టైం చూసుకుంటు సభ ముగించి వెళ్లారు. కారు ఎక్కబోతు ఎంపి మిధున్‌రెడ్డిని పిలిచి రహస్యంగా సంబాషించారు. అదే మహానేత రాక చివరి సారి కావడం పట్టణ ప్రజలను తీవ్ర విషాదానికి గురి చేస్తోంది.

 

      

పుంగనూరులో భగీరథయత్నం

 

Tags; Mahanate is an inseparable bond with the Punganur leaders

దేశవ్యాప్తంగా పోలీసుల కొరత

Date:04/07/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

తెలంగాణలో 30వేలు, ఆంధ్రప్రదేశ్‌లో 17వేల పోలీసుల కొరత ఉందని కేంద్రం రాజ్యసభలో ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 5.42 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. దేశవ్యాప్తంగా 24.84 లక్షల పోలీసు పోస్టులకు గాను 19.41 లక్షల మందే ఉన్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో 76,407 మంది పోలీసులు అవసరం కాగా ప్రస్తుతం 46,062 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్ తర్వాత పోలీసు పోస్టులు అధికంగా ఖాళీ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో 72,176 మంది పోలీసులు అవసరం కాగా.. ప్రస్తుతం 54,243 మంది ఉన్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. పోలీసుల నియామకం అంతా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుందని, అందువల్ల ఆయా ఖాళీలను భర్తీతో కేంద్రానికి సంబంధం లేదని పేర్కొన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు పోస్టులను వెంటనే భర్తీ చేసుకోవాలని సూచించారు.

 

మళ్లీ కర్ణాటక ఎమ్మెల్యేల రిసార్ట్స్ బాట

Tags: Shortage of police throughout the country

 బీజేపీలో కనిపిస్తున్న దూకుడు

Date:04/07/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

దేశంలో కొత్త రాజకీయ నిర్వచనాలు పుట్టుకొస్తున్నాయి. నిన్నామొన్నటివరకూ కాంగ్రెసు పార్టీ గంగా ప్రవాహం వంటిదని క్లెయిం చేసుకుంటుండేది. అంటే తమ పార్టీలోకి ఎవరైనా వచ్చి చేరవచ్చనేది దాని ఉద్దేశం. అంతేకాదు తమ పార్టీలో చేరితే ఎంత పాపాత్ములైనా పునీతులైపోతారనేది నినాదం. ఇప్పుడు పార్టీ మారింది. సిద్దాంతం మాత్రమే అదే. హస్తం పార్టీ స్థానంలో కమలం చేరింది. ఏ పార్టీవారైనా వచ్చి తమ పార్టీ తీర్థం పుచ్చుకోవచ్చని కమలనాథులు ఆహ్వానిస్తున్నారు. సామదానభేదోపాయాలను ప్రయోగిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కనబరుస్తున్న ఈ దూకుడు ప్రత్యర్థులను కంగారు పెట్టిస్తోంది. అటు పశ్చిమబంగ మొదలు తెలుగు రాష్ట్రాల వరకూ అదే స్పీడు. కాంగ్రెసు, కమ్యూనిస్టులను ఖాళీ చేయించి పశ్చిమబంగాలో పారాహుషార్ చేస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాలపైనా కన్నేసింది. తమ నాయకులు వరసగా చేజారుతుంటే..తెలుగుదేశం తెల్లమొహం వేస్తోంది. బీజేపీ తెలంగాణ రాష్ట్రసమితికి చెక్ పెట్టేందుకు చకచకా పావులు కదుపుతోంది. దేశ ప్రణాళికను నీతి అయోగ్ గుప్పెట్టో పెట్టేసింది. ఒకే దేశం..ఒకే ఎన్నిక పేరిట మరో ప్రయత్నం జోరందుకుంటోంది. సిద్దాంతరాద్ధాంతాలు లేవు. ఏ పార్టీ విత్ డిఫెరెన్స్ అన్న నైతిక నియమాలు పాతమాటే. మాపార్టీ గంగానది అంటూ కొత్తగా భాష్యం చెబుతున్నారు. అసలు కమలం కరెక్టు రూట్ లోనే వెళుతోందా?కమ్యూనిస్టులు, కాంగ్రెసు పార్టీ పరస్పరం పోటీపడుతూ ప్రతిపక్షస్థానాన్ని ఖాళీ లేకుండా చేస్తారని పశ్చిమబంగలో తృణమూల్ కాంగ్రెసు భావిస్తూ వచ్చింది.

 

 

 

 

 

 

 

 

 

దీనివల్ల భారతీయ జనతా పార్టీ వంటి రైటిస్టు పార్టీకి బెంగాల్ లో పెద్దగా స్థానం ఉండదని ధీమాగా ఉంటూ వచ్చింది. అయితే కాంగ్రెసు, కమ్యూనిస్టు పార్టీలు రెండూ దాదాపు ఒకేతాటిమీదకు వచ్చి పరస్పర అవగాహనతో మమతా బెనర్జీని ఢీకొనేందుకు ప్రయత్నించాయి. తమలో ఎవరు ప్రధానపక్షం అన్న సంగతి పక్కనపెట్టి చేతులు కలిపాయి. అయినా వారి ప్రయత్నం విఫలమైంది. ముఖ్యంగా త్రుణమూల్ కాంగ్రెసు, కాంగ్రెసు, కమ్యూనిస్టులందరూ ఒకే సిద్ధాంత నిబద్ధతతో ఉండటంతో మమతను నిలువరించడం సాధ్యం కాలేదు. ఈ మూడు పార్టీలు మైనారిటీ సంతృప్తీకరణను రాజకీయ అజెండాలో పెట్టుకున్నాయి. అందువల్ల ఒకపార్టీకి మరొక పార్టీని ప్రత్యామ్నాయంగా ప్రజలు భావించలేదు. ప్రధాన పాత్ర లో టీఎంసీ నిలిచింది. కాంగ్రెసు, కమ్యూనిస్టులను ప్రజలు నిర్లక్ష్యం చేశారు. ప్రత్యామ్నాయ అజెండాతో ముందుకెళ్లిన బీజేపీ బలపడింది. ఇప్పుడు టీఎంసీకి అక్కడ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ మాత్రమే. ఎందుకంటే హిందూ భావనలతోపాటు చరిత్రాత్మకంగా పశ్చిమబంగ ప్రజలు గర్వంగా ఫీలయ్యే వివేకానంద, బంకిం చంద్ర చటర్జీ వంటి వారసత్వాన్ని బీజేపీ క్లెయిం చేస్తోంది. ఫలితంగా కాంగ్రెసు ఖాళీ అయిపోతోంది. గతంలో కమ్యూనిస్టుల్లో కనిపించే దూకుడును బీజేపీ సొంతం చేసుకుంది. దాంతో మొత్తం కామ్రేడ్ల క్యాడర్ కమలం బాట పట్టింది.తెలుగు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ జోరు పెంచింది.

 

 

 

 

 

 

 

 

టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ఎత్తుగడలు వేస్తోంది. అదే సమయంలో అధికారపక్షాన్ని వదిలిపెట్టాలని భావించడం లేదు. వైసీపీ వైఫల్యాలపై ఆచితూచి ఎదురుచూపులు చూస్తోంది. ఈ రెండు పార్టీలను అవసరమైతే ఒకే చూపు చూసేయాలనుకుంటోంది. టీడీపీ, వైసీపీలు రెంటికీ బలహీనతలు ఉండటమే ఇందుకు కారణం. టీడీపీకి ఆర్థిక మూలాలుగా నిలిచిన నాయకుల్లో చాలామంది బ్యాంకు కుంభకోణాలు, అవినీతి కేసులు, దివాలా పద్దుల్లో ఉన్నారు. గడచిన అయిదేళ్లలో పారదర్శకత లేని పాలన విధానాలతో చంద్రబాబు నాయుడు సైతం లోతుగా తవ్వి తీస్తే ఏదో ఒక కేసులో ఇరుక్కునే అవకాశాలున్నాయి. ఆ బాధ్యతను ఎలాగూ అధికారపక్షం చేస్తుంది. ఆ తర్వాతనే తాను ఎంటర్ కావాలని బీజేపీ భావిస్తోంది. చంద్రబాబుపై కొంత సానుభూతి ఏర్పడుతుంది. కానీ టీడీపీ పోరాట పటిమను కోల్పోతుంది. వైసీపీతో పోరాటానికి అనివార్య పరిస్థితుల్లో టీడీపీ మొత్తం బీజేపీ వెనక చేరుతుంది. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెసుతో రాజకీయ పోరాటం చేయాలనుకుంటోంది.

 

 

 

 

 

ఎలాగూ వైసీపీకి కొన్ని సాంకేతికమైన చిక్కు ముడులు ఉండనే ఉన్నాయి. ఆర్థికపరమైన కష్టాలు వెన్నాడుతుంటాయి. ఇచ్చిన వాగ్దానాలనూ పూర్తి చేయడం సాధ్యం కాదు. పొలిటికల్ స్పేష్ అనేది ఏర్పడుతుంది. తెలుగుదేశం అధినేత సహా అభిమానులు కూడా తాము అధికారంలోకి రాకపోయినా ఫర్వాలేదు వైసీపీని నిరోధిస్తే చాలనుకునే మానసిక స్థితికి వచ్చేస్తారు. ఆయా పరిస్థితులను సులభంగా అవకాశంగా మలచుకోవచ్చనేది బీజేపీ యోచనగా రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.తెలంగాణ రాష్ట్రసమితి విషయంలో  భారతీయ జనతా పార్టీ ఎత్తుగడల్లో అనేక మలుపులు కనిపిస్తున్నాయి. దత్తాత్రేయ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల సాధ్యపడలేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి, డీకే అరుణ, అరవింద్ వంటి నాయకులు టీఆర్ఎస్ తో సమర్థంగా పోరాడగలిగిన వారిగా కేంద్రం గుర్తించింది. కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి దక్కింది. అరవింద్ , డీకే అరుణలను కూడా కీలకమైన పదవులతో అధికారపార్టీపైకి ఉసిగొల్పడమే మిగిలి ఉంది. తొలి నుంచీ కేసీఆర్ పై పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డి వంటి వారిని ఆకర్షిస్తే ప్రయోజనం ఉంటుందనే భావన ఉంది. రాష్ట్రంలో కాంగ్రెసును పూర్తిగా నిర్వీర్యం చేయడానికి అవసరమైన సహాయసహకారాలు కేసీఆర్ కు కేంద్రం నుంచి లభించాయి. రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు కేంద్రం పూర్తిగా సహకరించింది.

 

 

 

 

 

 

 

 

తాజా లోక్ సభ ఎన్నికలతో తనకున్న పొటెన్షియాలిటీని బీజేపీ నిరూపించుకోగలిగింది. దాంతో అధికార టీఆర్ఎస్ ను పక్కనపెట్టి క్రమేపీ పాగా వేస్తోంది. ఇంటర్ బోర్డు వైఫల్యాలను రాష్ట్రపతి స్థాయికి తీసుకెళ్లింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని బాగా పోకస్ చేస్తోంది. అవసరమైన సందర్బాల్లో గవర్నర్ సహాయసహకారాలను రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడానికి వినియోగించుకుంటారు. అనధికారికంగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య కొనసాగిన పొత్తు, మైత్రీబంధం దాదాపు ముగిసిపోయినట్లే చెప్పుకోవాలి. అంతేకాకుండా జగన్, కేసీఆర్ కలిసి నడుస్తున్న తీరుపైనా కేంద్రం నిఘా ఉంచింది. దక్షిణాదిన ఈ రెండుపార్టీలు తమ రాష్ట్రాల్లో చాలా బలంగా ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ ఏకచ్ఛత్రాధిపత్యానికి సవాల్ విసరాలని కేసీఆర్ గతంలో కలలు కన్నారు. తనకంటూ ఒకరోజు వస్తే ఆ ప్రయత్నం మరోసారి చేస్తారు. ఆ అవకాశం ఏర్పడకుండా రాష్ట్రస్థాయిలోనే టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని కమలనాథులు పక్కా ప్లాన్ తోనే ముందుకు కదులుతున్నారు.

తెలుగు రాష్ట్రాలకు తప్పని మొట్టికాయలు

 

Tags: The aggression seen in the BJP

బడ్జెట్ లో మహిళలకు పెద్ద పీట

Date:03/07/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

నిర్మలా సీతారామన్ తొలిసారి ఆర్థిక మంత్రిగా మోడీ క్యాబినెట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. జులై 5న జాతీయ బడ్జెట్‌ 2019-20కు ముహూర్తం ఖరారవగా మహిళల కోసం ఎంతవరకూ కేటాయించారోనని ప్రశ్నలు తలెత్తుతుంటే ఇది పూర్తిగా మహిళలకు అనుకూలంగా ఉండే బడ్జెటేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అలా ఉండాలంటే ఏ విషయాలు పరిగణనలోకి తీసుకోవాలంటే..

 

 

 

1. ఆర్థిక శాఖ దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సామాన్యుల నుంచి సర్వే తీసుకుని ప్రత్యేకంగా మహిళల అభిప్రాయాలను సేకరించారు. ఈ బడ్జెట్‌తో నిర్మలా సీతారామన్ మహిళల కలలను సాకారం చేయాలని ఆశిస్తున్నారు.
2. మహిళా పెట్టుబడులను ప్రోత్సహించేలా ఉండనుంది. నీల్సన్-బ్రిటానియా సర్వే ఆధారంగా 48శాతం గృహిణులు కొత్త వ్యాపారాలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారట. నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలనుకుంటున్నారు.
3. మహిళల భద్రతలోనూ ఈ బడ్జెట్ కీలకంగా వ్యవహరించనుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జన సంచారం ఉన్న ప్రాంతాల్లో మహిళలకు భద్రత కల్పించేలా కొత్త టెక్నాలజీతో ప్రతి ప్రాంతాన్ని మానిటరింగ్ చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో సీసీ కెమరాలు, ఫోన్లు, పెట్రోలింగ్ సిబ్బందిపై దృష్టి సారించారు.

 

 

 

 

4. పరిశ్రమల్లో  పనిచేస్తున్న మహిళల శాతం క్రమంగా తగ్గుతూ వస్తుంది. 2016లో 32శాతం ఉండగా 2018కి 23శాతానికి పడిపోయింది. ప్రతి ఒక్కరూ కార్పొరేట్ ప్రపంచంపై ఆసక్తి చూపిస్తుండటంతో పరిశ్రమల్లో దినసరి కూలీలు తగ్గిపోతున్నారు. ఫలితంగా సొంత వ్యాపారాలకు మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు.
5. సెక్షన్ 80సీ ప్రకారం.. ఐటీ  మినహాయింపును మరింత పెంచనున్నారు. మహిళా ఉద్యోగినులు ప్రావిడెంట్ ఫండ్‌ను తొలి మూడేళ్లు 12 నుంచి 8శాతానికి తగ్గించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
6. రోజువారీ వస్తువులపైనా.. అంటే చిరుద్యోగులు, చిన్నారులు వాడే ఫేస్ క్రీమ్ ల వంటి వాటిపై ట్యాక్స్ అమౌంట్ తగ్గించనున్నారట.
7. గృహిణులకు ప్రాధాన్యతనిస్తూ.. గ్రామీణ మహిళలకు ఆరోగ్యం గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు.

 

సిటీ ట్రాఫిక్ లో డిజిటల్ లైటింగ్

 

Tags: Big plateau for women on a budget

సీనియర్లపై కొనసాగుతున్న రాహుల్ అలక

Date:01/07/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

రాహుల్ గాంధీ ఎందుకంత మొండిగా ప్రవర్తిస్తున్నాడు. అధ్యక్షపదవి పేరు చెబితే ససేమిరా అంటున్నాడు. అఖిల భారత పార్టీ అధ్యక్షునిగా ఇది తొలిసార్వత్రిక పరాజయమే. 2014 ఎన్నికలనాటికి సోనియానే అధ్యక్షురాలు. 2019 మాత్రమే ఆయన కాతాకు చెందుతుంది. మొదటి ఓటమికే బెంబేలెత్తితే భవిష్యత్తు ఏమిటి? నిజానికి రాజకీయం పూల పాన్పు కాదు. ముళ్ల కిరీటమే. కానీ పార్టీలో పునరుత్తేజం నింపలేకపోతున్నాననే ఆందోళనతోనే రాహుల్ గాంధీ ఈ బాధ్యత వద్దనుకుంటున్నట్లుగా సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెసును నైతికంగా దెబ్బతీసే క్రమంలో భాగంగా ప్రధాని మోడీ రాహుల్ ను వారసుడు, యువరాజంటూ ఎద్దేవా చేస్తున్నారు. సహజంగానే రాహుల్ కు అటువంటి కీర్తికిరీటాలపై పెద్దగా మోజు లేదు. అయినప్పటికీ ఆరోపణలు, విమర్శలు మోయాల్సి వస్తుందనే ఆవేదనకు గురవుతున్నట్లుగా ఏఐసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. వారసునిగా తనకు కాకుండా కొత్తవారికి అవకాశమిచ్చి చూస్తే పార్టీపై ఆనువంశిక ముద్ర పోతుందేమోననే యోచనతోనే భీష్మించుకుని కూర్చున్నట్టుగా చెబుతున్నారు.కాంగ్రెసు పార్టీ అతి క్లిష్టమైన దశను ఎదుర్కొంటోంది. వరసగా రెండోసారి ప్రతిపక్ష హోదాకు తగిన సంఖ్యలో లోక్ సభలో స్థానాలు తెచ్చుకోలేకపోయింది. పార్టీని ఒకవైపు సీనియర్లు పట్టుకుని వేలాడుతున్నారు. పెద్ద పదవులు నిర్వహించి గతంలో ప్రభుత్వ హోదాలు అనుభవించినవారు పార్టీ కోసం త్యాగం చేసేందుకు సిద్ధం కావడం లేదు. తమతోపాటు తమ బంధుమిత్రులు వారసుల కోసం తాపత్రయపడుతున్నారు.

 

 

 

 

 

 

ఫలితంగా కొత్త రక్తాన్ని ఎక్కించడం సాధ్యం కావడంలేదు. వారిని పూర్తిగా దూరంగా పెడదామంటే ఇప్పటికే దెబ్బతిని ఉన్న పార్టీపై దుష్ప్రచారం పెరిగిపోతుంది. అందుకు సోనియా ఇష్టపడటం లేదు. స్వచ్ఛందంగా వారు ఇతర పార్టీలకు వెళ్లి ఆశ్రయం పొందితే అభ్యంతరం లేదనే సంకేతాలను పలుమార్లు రాహుల్ గాంధీ ఇచ్చి చూశారు. కానీ అవినీతి విషయాల్లో వారికున్న ట్రాక్ రికార్డు ద్రుష్ట్యా బీజేపీ వంటి పార్టీలు కాంగ్రెసు వారికి పెద్దగా అవకాశం ఇవ్వడం లేదు. దీంతో పార్టీకి భారమైనప్పటికీ కాంగ్రెసు అభయహస్తం నీడలోనే సేదతీరుతున్నారు.కాంగ్రెసు పార్టీలో రాహుల్ గాంధీ అయిదో తరం వారసుడు. మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూలు స్వాతంత్ర్యానికి ముందుతరంలో పార్టీకి నాయకత్వం వహించారు. ఇందిర కాలంనుంచే వారసత్వం స్థిరపడిందని చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే ఒరిజినల్ కాంగ్రెసు స్థానంలో తనదైన ఇందిరాకాంగ్రెసును ఆమె నిర్మించుకున్నారు. సీనియర్ నాయకుల సిండికేట్ నుంచి , తిరుగుబాట్ల నుంచి , బహిష్కరణల నుంచి అనేక పాఠాలు ఇందిర నేర్చుకున్నారు. స్వయంగా కాంగ్రెసులో ఆమె ఎదుర్కున్న సవాళ్లు అన్నీ ఇన్నీ కాదు. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకున్నారు. రాజీవ్ గాంధీ కూడా క్లిష్టసమయంలో బాధ్యతలు చేపట్టారు. పార్టీ తిరిగి కోలుకోవడం కష్టమనే సమయంలోనే సోనియా అధ్యక్షురాలిగా బాధ్యత తీసుకున్నారు. బీజేపీ హయాంలో ఆరేళ్లపాటు ఆమె పార్టీని భుజస్కంధాలపై మోస్తూ 2004లో అధికారానికి తెచ్చారు. సోనియాకు, రాజీవ్ కు సైతం అధ్యక్షపదవి విషయంలో కొంత పోటీ ఎదురైంది. నిజానికి రాహుల్ కు ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రాల్లోనూ, కేంద్రంలోనూ పరాజయం ఎదురవుతున్నప్పటికీ పార్టీ పీఠం విషయంలో అతడిని సవాల్ చేసేవారు లేరు. కానీ పోరాట పటిమ విషయంలో ఇందిర, సోనియా చూపిన తెగువను చూపలేకపోతున్నారు.

 

 

 

ఫలితంగా పలాయన మంత్రం పఠిస్తున్నారనేది పరిశీలకుల అంచనా.ఎంతగా పోరాడినా కాంగ్రెసు పార్టీ పునరుజ్జీవం పొందలేకపోతోంది. కాంగ్రెసు సిద్దాంతాలకు కాలం చెల్లిందా? కాలానుగుణంగా పార్టీ తనను తాను పునర్నిర్వచించుకోవడంలో వైఫల్యం చెందిందా? కొన్ని రాష్ట్రాల్లో నెగ్గిన ఏడాది తిరగకుండానే లోక్ సభ ఎన్నికలో పార్టీకి ఓటమి ఎందుకు ఎదురవుతోంది? అన్నీ ప్రశ్నలే. సమాధానాలు దొరికినప్పుడే బీజేపీకి దీటుగా కాంగ్రెసు నిలవగలుగుతుంది. మైనారిటీలను సంత్రుప్తి పరిచే విధానాలను దీర్ఘకాలం అనుసరించడంతో ప్రతికూలంగా మెజారిటీ హిందూ పోలరైజేషన్ కు ఆస్కారం ఏర్పడింది. ఎస్సీ,ఎస్టీ వర్గాలను అక్కున చేర్చుకుని గరీబీ హఠావో వంటి నినాదాలతో కాంగ్రెసుకు ఆయావర్గాలను అనుసంధానం చేశారు ఇందిర. విద్యా,సామాజిక పరంగా చైతన్యవంతమైన ఆయా వర్గాలు పేదరికం స్థానంలో ఆత్మగౌరవం, రాజ్యాధికారం అంటూ ఇతర పార్టీలను ఆశ్రయించడం ప్రారంభించాయి. మధ్యతరగతి, విద్యావర్గాల్లో మతపరమైన భావనలు బలపడ్డాయి. దీంతో లౌకిక వాదన అంటూ రొట్టకొట్టుడుగా చెప్పే కాంగ్రెసు సిద్దాంతం వారికి ఆకర్షణీయంగా కనిపించడం లేదు. ఆయా లోపాలను సవరించుకుంటూ దూకుడు అలవరచుకుంటేనే కాంగ్రెసుకు భవిష్యత్తు ఉంటుంది. నాయకత్వం ఎవరు వహిస్తున్నారనేది చాలా ముఖ్యం. నెహ్రూ గాంధీ కుటుంబం నుంచి కాకుండా వేరే వారు ఈ స్థానంలో ప్రస్తుత పరిస్థితిలో కూర్చుంటే పార్టీ మరింత బలహీనపడటం ఖాయం. దేశానికి జాతీయంగా ఒక ప్రతిపక్షం తప్పనిసరి. అందువల్ల ఆ బాధ్యత నుంచి రాహుల్ గాంధీ తప్పించుకోలేరు.

జగన్ ను పట్టించుకోని టాలీవుడ్

Tags: Ongoing Rahul Alaka on Seniors

ఒకే దేశం ఒకే రేషన్ కార్డు

Date:01/07/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు విధానాన్ని 2020 జూన్ 30 నుంచి అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక ఏడాది గడువు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఒకే రేషన్‌కార్డు పథకం అమలు ద్వారా లబ్ధిదారులు దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా రేషన్ షాపుల ద్వారా నిత్యవసర వస్తువులను సబ్సిడీ ధరలకు కొనుగోలు చేయవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, జార్ఖండ్, త్రిపుర వంటి పది రాష్ర్టాల్లో రేషన్ షాపులను మార్చుకునే వెసులుబాటు ఉన్నట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు అనేది మోదీ 2.0 ప్రభుత్వం వంద రోజుల ఎజెండాలో భాగమని, 2020 జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా కచ్చితంగా అమలు చేస్తామని పాశ్వాన్ తెలిపారు. ఈ వ్యవస్థను వేగవంతం చేయాలని కోరుతూ అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలకు లేఖలు రాసినట్లు చెప్పారు.22 రాష్ర్టాల్లో పీఓఎస్ యంత్రాలు వంద శాతం అందుబాటులోకి వచ్చాయని, దీంతో వచ్చే ఏడాదికల్లా దీన్ని అమలు చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన అన్నారు. పేద లబ్ధిదారుడు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లినా కూడా రేషన్ కోల్పోకుండా ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు పాశ్వాన్ తెలిపారు. ఒకే రేషన్ కార్డు విధానం ద్వారా నకిలీ రేషన్ కార్డుదారులను గుర్తించి తొలిగించవచ్చని అన్నారు. 2016 నవంబర్ నుంచి జాతీయ ఆహార భద్రతా చట్టంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి నెలా 80 కోట్ల మందికి సబ్సిడీ కింద ఆహార ధాన్యాలు సరఫరా చేస్తున్నట్లు ఆయన వివరించారు.

 

యనమలతో టీడీపీ ఒరిగిందేమి లేదు

 

Tags: Single country single ration card