విద్యాశాఖలో అంతా తానై వ్యవహరిస్తున్న ఉద్యోగి

– ఫార్మలిటీస్‌ పేరుతో దందా

Date:28/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

పవిత్రమైన విద్యాశాఖలో ఓక్లర్క్ అంతా తానై వ్యవహరిస్తూ ఫార్మలిటిస్‌ పేరుతో వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఉద్యోగి ప్రైవేటు పాఠశాలలను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్లు దాఖలాలు ఉన్నాయి. ఈ విషయాలను బహిరంగంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు చెప్పుకుంటు ఉండటం వెలుగుచూసింది. మదనపల్లె డీవైఈవో కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగి సుమారు పది సంవత్సరాలుగా మదనపల్లెలో పని చేస్తున్నారు. తిరుపతికి బదిలీ చేసినా ఫైరవిలు చేసి తిరిగి మదనపల్లెలో కుర్చోని ప్రైవేటు పాఠశాలలను ప్రోత్సహిస్తున్నాడు. పుంగనూరులో 23 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో అధిక సంఖ్యలో పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నిర్వహిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న మదనపల్లె డీవైఈవో కార్యాలయంలోని ఓ ఉద్యోగి అంతా తానై వ్యవహరిస్తూ , డీవోఈవోను కలిసేందుకు కూడ ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలకు అనుమతి ఇవ్వకుండ పాఠశాలలకు అనుమతులు మంజూరు చేయడం, నిలిపియేయడంలో కీలకపాత్ర పోషిస్తాడని చర్చించుకుంటున్నారు.. ఏళ్ల తరబడి ఇష్టారాజ్యాంగా విద్యావ్యాపారం చేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.్య ధికారులను సైతం ఆ ఉద్యోగి తన చెప్పు చేతుల్లో ఉండేలా చేసుకుంటాడని ఆరోపణలు ఉన్నాయి. జిల్లా అధికారుల పర్యటనలను సైతం అతడు ముందుగా పాఠశాలలకు తెలియజేయడం, వారికి హుకుం జారీ చేసి, అధికారి కారు డీజల్‌, రహదారి ఖర్చులను సైతం యాజమన్యాల నుంచి వసూలు చేయడం ఆనవాయితీగా మారిందని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా , డీఈవో పాండురంగస్వామి వెంటనే చర్యలు తీసుకుని, డీవైఈవో కార్యాలయంలో అంతా తానై వ్యవహరిస్తున్న ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వివరణ….

ఈ విషయమై మదనపల్లె డీ వైఈవో ముష్ఠాక్‌అలిఖాన్‌ను ఫోన్‌లో సంప్రదించి ఉద్యోగి విషయమై వివరణ కోరగా ఈ విషయాలపై డీఈవోకు నివేదికలు పంపి, అతనిని బదిలీ చేస్తామని, అక్రమాలు జరగకుండ చర్యలు చేపడుతామని , పుంగనూరు పాఠశాలలను తానే స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు.

పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

Tags: He is an employee in the education department

ఈవీఎంల‌ గూర్చి ఎందుకు ప్ర‌శ్నిస్తున్నారు?:ప్రదాని మోదీ 

Date:26/06/2019

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

ఈవీఎంల‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్న ప్ర‌తిప‌క్షాలపై ప్ర‌ధాని మోదీ ధ్వ‌జ‌మెత్తారు. రాజ్య‌స‌భ‌లో ఆయ‌న ఇవాళ మాట్లాడారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానం సంద‌ర్భంగా మాట్లాడుతూ.. స‌భ‌లో ఎందుకు కొంద‌రు స‌భ్యులు ఈవీఎం అంశాన్ని ప్ర‌స్తావిస్తున్నార‌ని అడిగారు. మా పార్టీకి మొద‌ట్లో ఇద్ద‌రు ఎంపీలు మాత్ర‌మే ఉండేవారు, మ‌మ్ముల్ని చూసి జ‌నం న‌వ్వుకున్నారు, కానీ మేం క‌ష్ట‌ప‌డ్డాం, ప్ర‌జ‌ల విశ్వాసాన్ని గెలిచాం, మేం ఏనాడూ పోలింగ్ బూత్‌ల‌ను నిందించ‌లేద‌ని మోదీ అన్నారు. దేశంలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో జ‌రుగుతున్న ప్ర‌గ‌తిని మ‌నం మెచ్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. 1950 ద‌శ‌కంలో పోలింగ్ కోసం ఎక్కువ స‌మ‌యం కేటాయించాల్సి వ‌చ్చింది, బూత్ ఆక్ర‌మ‌ణ‌, హింస లాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగేవి, కానీ ఇప్పుడు ఓట‌ర్ల ట‌ర్నౌట్ కీల‌క‌మైంద‌ని, ఇదొక ర‌కంగా ఆరోగ్య‌క‌ర‌మైన సంకేత‌మ‌న్నారు. ఈవీఎంల‌తో ఇప్ప‌టికే ఎన్నో ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించార‌ని, అనేక పార్టీలు కూడా అనేక రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాన్ని పాలించాయ‌ని, కానీ ఇప్పుడు ఈవీఎంల‌ను ఎందుకు ప్ర‌శ్నిస్తున్నార‌ని మోదీ అడిగారు. ఈవీఎంల గురించి ఎన్నిక‌ల సంఘం ఆహ్వానిస్తే.. కేవ‌లం రెండు పార్టీలు మాత్ర‌మే వెళ్లాయ‌ని, ఆ పార్టీలు త‌మ‌కు ఉన్న అనుమానాల‌ను నివృత్తి చేసుకున్నాయ‌న్నారు. ఎప్పుడూ ఆరోప‌ణ‌లు చేస్తున్న విప‌క్ష పార్టీలు ఎందుకు ఈసీ వ‌ద్ద‌కు వెళ్ల‌లేద‌ని మోదీ ప్ర‌శ్నించారు.

వైశ్యులు అన్ని రంగాలలో ముందుకు రావాలి 

Tags: Why are you questioning EVMs ?: Pradhani Modi

లోక్ సభలో జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లు

Date:24/06/2019

న్యూ డిల్లీ  ముచ్చట్లు:

జమ్మూకశ్మీర్ లో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లును జమ్మూలోక్ సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెడతారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ… చివరి నిమిషంలో హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రవేశపెట్టారు. జమ్ములో అంతర్జాతీయ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో, కశ్మీర్ లో నియంత్రణ రేఖకు 10 కిలోమీటర్ల దూరంలో నివసించే యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లను కల్పించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు.మరోవైపు, ఆధార్ చట్ట సవరణ బిల్లు 2019ను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారు. ఆందోళనల మధ్యే ఈ బిల్లుపై రవిశంకర్ ప్రసాద్ ప్రసంగం చేశారు. అనంతరం ప్రత్యేక ఆర్థిక జోన్ల సవరణ బిల్లును కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ప్రవేశపెట్టారు.

 

తానూ అవినీతి వ్యతిరేకమని జగన్ ప్రకటనలు చేయడం హాస్యస్పదం

Tags; Amendment Bill of Jammu and Kashmir Reservation in Lok Sabha

మంత్రి పెద్దిరెడ్డి పర్యటనకు భారీ ఏర్పాట్లు

– ఎటు చూసినా స్వాగత బ్యానర్లు

 

Date:21/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం ఉదయం 8 గంటలకు పుంగనూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, కొండవీటి నాగభూషణం, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, కౌన్సిలర్లు అమ్ము, పూలత్యాగరాజు ఆధ్వర్యంలో స్వాగత ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి బెంగళూరు నుంచి రోడ్డు మార్గం గుండ పుంగనూరు చేరుకుంటారు. ఉదయం 8 గంటలకు పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేట వద్ద గల హనుమంతరాయునిదిన్నె ఆంజనేయస్వామి ఆలయంలో మంత్రి పూజలు నిర్వహించి, అక్కడి నుంచి రోడ్‌ షో నిర్వహిస్తూ స్థానిక బిఎంఎస్‌క్లబ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ మేరకు సభ వేదికను సిద్దం చేశారు. మంత్రి బహిరంగ సభలో ప్రసంగించి, అక్కడి నుంచి 10 గంటలకు బయలుదేరి చౌడేపల్లె మండలం చేరుకుంటారు. అక్కడి నుంచి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోను మంత్రి పర్యటించి, ప్రజలను , పార్టీ నేతలను కలుసుకుంటారు. పట్టణంలోని అన్ని ప్రధాన రహదారులు, కూడలి ప్రాంతాలతో పాటు విద్యుత్‌ స్తంభాలకు మంత్రి పెద్దిరెడ్డికి స్వాగతం పలుకుతూ ఆయన అభిమానులు నిలువెత్తు ప్లెక్సిలు ఏర్పాటు చేసి, స్వాగతం పలికేందుకు సిద్దమైయ్యారు.

పేకాటరాయుళ్లు అరెస్ట్

Tags: Huge arrangements for Minister Peddi Reddy’s visit

వెంకయ్యకు తప్పని పితలాటకం

Date:21/06/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ఆపరేషన్ కమలం దెబ్బకు టీడీపీ సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్, గరికపాటి రామ్మోహన్ రావు బీజేపీకి గూటికి చేరారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడిని కలిసిన ముగ్గురు ఎంపీలు.. తమను బీజేపీలో విలీనం చేయాలని కోరారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లోని నాలుగో పేరాగ్రాఫ్ ప్రకారం టీడీపీ లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో కలపాలని వారు వెంకయ్యను కోరారు. బీజేపీలో చేరిన ఎంపీలు అమిత్ షా‌ను కలిసి తమను బీజేపీ సభ్యులుగా గుర్తించాలని కోరనున్నారు. మా అభ్యర్థనను అమిత్ షా స్వీకరించి.. వెంకయ్యకు సిఫారసు చేయాలని వారు బీజేపీని కోరారు. తర్వాత వెంటనే జేపీ నడ్డా సమక్షంలో వారంతా బీజేపీలో చేరారు. అమిత్ షా సిఫారసు చేయడం.. వెంకయ్య దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇక లాంఛనమే. మేం బీజేపీలో విలీనం అవుతాం, మీరు అంగీకరించండని చంద్రబాబుకి ఆప్తుడిగా పేరొందిన వెంకయ్య నాయుడిని టీడీపీ ఎంపీలు కోరడం విశేషం. పార్టీలు వేరైనప్పటికీ.. చంద్రబాబు, వెంకయ్య నాయుడి మధ్య 1995 నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇరు పార్టీల మధ్య పొత్తులో వెంకయ్య కీలక పాత్ర పోషించారు.

 

 

 

 

 

ఆయన వల్లే ఏపీలో బీజేపీ బలపడలేదనే వాదన కూడా లేకపోలేదు. కేంద్రంలో కీలక మంత్రిగా ఉన్న వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా పంపిన తర్వాత ఆయనకు ఏపీ రాజకీయాలతో సంబంధం తెగిపోయింది. అప్పటికే బీజేపీకి దగ్గరయ్యేందుకు ఉత్సాహంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కమలం పార్టీకి మరింత దగ్గర కావడం, టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వెళ్లిపోవడం జరిగాయి. వెంకయ్యకు ఉపరాష్ట్రపతి పదవిని కట్టబెట్టగానే.. టీడీపీలో సంతోషం కంటే కలవరమే ఎక్కువగా కనిపించింది. చంద్రబాబుకి, టీడీపీకి ఇబ్బందులు తప్పవేమోనని చాలా మంది అప్పుడే అంచనా వేశారు. 2019 ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక.. ఏపీపై ప్రధానంగా ఫోకస్ పెట్టిన బీజేపీ.. టీడీపీ నేతలను తమవైపు తిప్పుకునేందుకు పాచిక వేసింది. రాంమాధవ్ రంగంలోకి దిగడంతో బీజేపీ ఆకర్ష్ మొదలైంది. ఇక టీడీపీ శ్రేణులకు బాధను కలిగించే అంశం ఏంటంటే.. తమను బీజేపీలో కలిపేయండని టీడీపీ రాజ్యసభ సభ్యులు రాజ్యసభ చైర్మన్ అయిన వెంకయ్యకు వినతి పత్రం సమర్పించడం. బాబుతో అనుబంధం ఓవైపు.. పార్టీ ప్రయోజనాలు మరోవైపు.. ఈ రెండు అంశాల మధ్య సంఘర్షణలోనే వెంకయ్య ‘తప్పనిసరి పరిస్థితి’లో పార్టీ వైపే మొగ్గు చూపాల్సిన పరిస్థితి తలెత్తిందని వారు వాపోతున్నారు.

 

బీజేపీలోకి మళ్లీ ఆకుల…

 

Tags: The Venkayya is the wrong pathalakalam

హైకోర్టు న్యాయమూర్తులుగా మానవేంద్రనాథ్ రాయ్, వెంకట రమణ ప్రమాణస్వీకారం

Date:20/06/2019

అమరావతి ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి కోర్టు హాలులో గురువారం ఉదయం చీకటి మానవేంద్రనాథ్ రాయ్, మఠం వెంకట రమణలు హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు తాత్కాలిక రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ న్యాయమూర్తుల నియామక ఉత్తర్వులు చదివి వినిపించగా,  హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సి.ప్రవీణ్ కుమార్ వారిచేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు బార్ అసోసియేషన్ పాలకవర్గ సభ్యులు, నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

 

కామారెడ్డి కమలంలో కలవరం

Tags: Manavendranath Rai, Venkata Ramana sworn in as High Court Judges

జగన్ వ్యూహామా…తొందరపాటా…

Date:20/06/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

అయిదేళ్ళ పాటు ప్రత్యేక హోదా పోరాటం జగన్ చేశారు. అప్పుడు విపక్షంలో ఆయన ఉన్నారు. మరో వైపు చంద్రబాబు హోదా విషయంలో చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించడం కూడా జగన్ మోహన్ రెడ్డి కి బాగా కలసివచ్చింది. దీంతో జగన్ హోదా పొరాట  వీరుడుగా ముద్ర పడ్డారు. ఇక చంద్రబాబుకు ఏ ఎండకూ ఆ గొడుకు పట్టే నైజంతో పాటు ఏపీలోని ఆర్ధిక పరిస్థితి, మోడీ తో ఢీ కొట్టే సాహసం చేయలేకపోవం, బలమైన వైసీపీ జనంలో ఉండడం వంటి అనేక అనివార్యతలు హోదా విషయంలో వెనక్కు తగ్గేలా చేశాయి. చివరి ఏడాది హోదా జపం చేసినా యూ టర్న్ తీసుకున్నా  జనం నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి చంద్రబాబు దారుణంగా ఒటమి పాలు అయ్యారు.జగన్ మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు. అయిదేళ్ళ పాటు హోదా పోరాటాన్ని నడిపారు. అపుడు కూడా విపక్ష నేతగా ప్రధాని మోడీని కలసి హోదా ఇమ్మని పదే పదే  విన్నపాలు చేసుకున్నారు. బందులు ధర్నాలు, నిరాహార దీక్షలు ఇవన్నీ చేసి కూడా జగన్ హోదా విషయంలో ఎక్కడా కదలిక తేలేకపోయారు. దానికి చంద్రబాబు తప్పు ఎంత వుందో కేంద్రంలోకి మోడీ మొండితనం అంతే ఉంది. ఇపుడు చంద్రబాబు స్థానంలో జగన్ మోహన్ రెడ్డి వచ్చారు.

 

 

కాబట్టి బలంగా ముఖ్యమంత్రి హోదాలో హోదా వాణిని డిల్లీ వరకూ వినిపించగలరు. అంతవరకూ జగన్ సక్సెస్ అవుతారు. కానీ ఆ తరువాత పని కేంద్రానిది. అంటే మోడీ, అమిత్ షాలది. మరి వారు ఇదివరకు మాదిరిగానే మొండిగా ఉంటే జగన్ మోహన్ రెడ్డి హోదా ఎలా సాధించగలరన్నదే ఇక్కడ కీలకమైన ప్రశ్న.ఇక హోదా విషయంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేస్తూ   ఆమోదించింది. దీనికి చంద్రబాబు కూడా ఏ అభ్యంతరం లేకుండా మద్దతు ఇచ్చారు. ఇక్కడే చంద్రబాబు రాజకీయం చూపారనుకోవాలి. జగన్ కి 22 మంది ఎంపీలు ఇచ్చారు కాబట్టి మీరు హోదాను తీసుకురండి సంతోషిస్తామని బాబు కాస్తా సెటైరికల్ గా మాట్లాడారు. అంటే తాను తేలేకపోయానని ఒప్పుకుంటూనే జగన్ మోహన్ రెడ్డి సైతం తేలేరన్న స్వరంతోనే బాబు ఈ మాట అన్నారనుకోవాలి. నిజంగా హోదా కనుక జగన్ తెస్తే బాబు రాజకీయం మరింతగా మసకబారడం ఖాయం. ఆ మాత్రం
తెలియని వారు బాబు కాదు అనుకోలేం.జగన్ మోహన్ రెడ్డి కంటే కూడా బాబు మోడీని దగ్గరుండి చూశారు. మోడీ ఇవ్వరన్న ధీమాతోనే బాబు అలా  ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారన్నమాట. జగన్ మోహన్ రెడ్డి సైతం హోదా కోసం చివరి వరకూ పోరాటమే అంటూ చెప్పుకొచ్చారు. అయితే జనాలు మాత్రం అయిదేళ్ళే టైం ఇస్తారు. చంద్రబాబు అయితే అది కూడా ఇవ్వరు, ఆరు నెలలు ఆగి ఏదీ హోదా జగన్ అంటూ వెంట పడతారు, అపుడు జగన్ మోహన్ రెడ్డి సంగతేంటి. ఓ విధంగా జగన్ పులి మీద స్వారీ చేస్తున్నారనుకోవాలి. లేదా మోడీతో బాబు కంటే దగ్గర చుట్టరికంతో  ధీమాగా హోదా  గురించి ముందుకు వెళ్తూండాలి. హోదా తోనే తన రాజకీయాన్ని ముడి వేసుకున్న జగన్ మోహన్ రెడ్డి ది వ్యూహమా. తొందరపాటా అన్నది త్వరలోనే తెలిసిపోతుంది.

చంద్రబాబును నట్టేట ముంచేసిన కొత్త నాయకులు

 

Tags: Pics Tutorial

నిరుద్యోగ భృతి 3,500

Date:19/06/2019

జైపూర్ ముచ్చట్లు:

నిరుద్యోగ భృతి అంశంపై భిన్నవాదనలు ఉన్నాయి. కొందరేమో దీనికి మద్దతు తెలిపితే.. మరికొందరేమో పెదవి విరుస్తున్నారు. అయితే ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం నిరుద్యోగ భృతి అందించారు. ఇప్పుడు రాజస్థాన్ ప్రభుత్వం కూడా చంద్రబాబును ఆదర్శంగా తీసుకున్నట్లుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిరుద్యోగ భృతి అందించేందుకు సిద్ధమౌతోంది. గ్రాడ్యుయేషన్ లేదా దీనికి సమానవైన డిగ్రీ పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న వారికి రూ.3,500 అందించనుంది. ముఖ్యమంత్రి యువ సంబల్ యోజన పథకం కింద అర్హులైన వారికి నిరుద్యోగ భృతి అందనుంది. ఫిబ్రవరి నుంచి స్కీమ్ అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేవలం రాజస్థాన్‌కు చెందిన వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. పథకం కింద మహిళా నిరుద్యోగులకు నెలకు రూ.3,500 లభిస్తుంది. అదే నిరుద్యోగులు మగవారు అయితే నెలకు రూ.3,000 ఇస్తారు. నిరుద్యోగ భృతి రెండేళ్ల వరకు ఇస్తారు. ఇకపోతే టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిరుద్యోగ భృతి పథకాన్ని వైసీపీ ప్రభుత్వం కొనసాగించడం లేదు.

 

సందీప్ కిషన్ కోసం నటులుగా మారిన దర్శకులు

Tags: Unemployment rate is 3,500