మంత్రి పెద్దిరెడ్డి పర్యటనను జయప్రదం చేయండి

– పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి , పోకల , కొండవీటి పిలుపు

Date:19/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈనెల 21న శుక్రవారం తొలిసారిగా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ కార్యదర్శులు పెద్దిరెడ్డి, పోకల అశోక్‌కుమార్‌, కొండవీటి నాగభూషణం, విశ్వనాథ్‌, జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, ఎంపీపీ నరసింహులు కలసి బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోకల అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి హ్గదాలో తొలిసారిగా వస్తున్న మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. మంత్రి బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా పట్టణంలోని హనుమంతరాయుదిన్నె ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని, అక్కడ పూజలు చేసి, పర్యటన ప్రారంభిస్తారని ఆయన తెలిపారు.అక్కడి నుంచి నేరుగా రోడ్‌షో నిర్వహిస్తూ బిఎంఎస్‌క్లబ్‌లో ప్రజలు, నాయకులతో సమావేశంలో పాల్గొంటారు. అక్కడి నుంచి చౌడేపల్లె మీదుగా నియోజకవర్గం అంతా పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పర్యటనను జయప్రదం చేసేందుకు ప్రజలు, పార్టీ అభిమానులు, ప్రజాప్రతినిధులు, పెద్దిరెడ్డి అబిమానులు ప్రతి ఒక్కరు హాజరుకావాలెనని ఆయన కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ ఉద్యోగ కార్మికసంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, కౌన్సిలర్లు అమ్ము, మనోహర్‌, కో-ఆప్షన్‌ మెంబర్‌ ఖాదర్‌బాషా, పార్టీ నేతలు విజయభాస్కర్‌రెడ్డి , తుంగామంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజ్‌ తరుణ్‌ హీరోగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో 

Tags; Make a visit to the Minister Peddireddy tour

ధర్టీ ఇయర్ ఇండస్ట్రీకి అవకాశాలెక్కడ

Date:19/06/2019

హైదరాబాద్ ముచ్చట్లు:

కమెడియన్ పృధ్వీ తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే మంచి మంచి సినిమాలు చేస్తూ మంచి పేరు తెపించుకుంటున్నాడు. వరసగా కమెడియన్ అవకాశాలు దక్కించుకుంటూ సినిమాలు మీద

సినిమాలు చేస్తున్న తను రీసెంట్ గా వైసిపి తరఫున ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ పై చాలానే కామెంట్లు చేసాడు. ఒకసారి అయితే గీత దాటాడు కూడా.టీవీ చానెల్స్ వారు ఆ వీడియో పదేపదే వేసి

చూపించారు. దాంతో మనోడు మెగాఫ్యామిలీ సినిమాలు అన్నటికి దూరం అవుతున్నాడు. ఇటువంటి వాళ్ళు లౌక్యంగా ఎలాంటి నెగెటివ్‌ కామెంట్లు లేకుండా తమ పార్టీకి ప్రచారం చేసుకుంటే మంచిది.

కానీ పృధ్వీ హద్దులు దాటాడు. ఇతన్ని త్రివిక్రమ్ తన సినిమా తీసేశాడట. త్రివిక్రమ్ ఎప్పుడు తన సినిమాల్లో ఇతనికి మంచి పాత్రలు ఇచ్చేవాడు. కానీ ఈసారి బన్నీ అతను మన సినిమాలో వద్దు

అని చెప్పడంతో అతన్ని తీసేశారని టాక్ వస్తుంది. అలానే మిగతా మెగా హీరోల సినిమాలలోను ఇతనికి ఛాన్స్‌లు రాకపోవచ్చు. అలా మనోడు రాజకీయం మీద పిచ్చి తో ఏది పడితే అది మాట్లాడి

సినిమా ఛాన్స్ లు పోగొట్టుకుంటున్నాడు.

జగన్ ద్వారా ఎంట్రీకి బీజేపీ ప్లాన్

Tags:Opportunities for Dharti Year Industry

 జగన్ ద్వారా ఎంట్రీకి బీజేపీ ప్లాన్

Date:19/06/2019

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

కమలనాథుల ఆలోచనలు చాలా షార్ప్ గా ఉన్నాయి. దేశమంతా తమ గుప్పిట్లో ఉన్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో వెలుగు లేకుండా పోయిందే అన్న చింత మోడీ షా ద్వయంలో బాగా ఎక్కువగా ఉంది.

అయితే రెండవమారు బంపర్ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి రావడం తెలుగు రాష్ట్రాలో ఎంట్రీకి తెలంగాణా ఓ ఓ గేట్ తెరచుకోవడంతో కాషాయదళం కొత్త ఆలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

తాజా లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా నాలుగు ఎంపీలు గెలుచుకున్న బీజేపీ మంచి యమ హుషార్ గా ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ముందుకు సాగుతోంది. ఇందుకోసం కొత్త వ్యూహాలను

కూడా రచిస్తోంది.ఏపీలో ల్యాండ్ స్లైడ్ విక్టరీతో దేశమంలోని అందరి ద్రుష్టిని ఆకట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి ఇపుడు మోడీ, షాలకు హాట్ ఫావరేట్ అయిపోయాడని టాక్. ఏపీకి పూర్తి మద్దతుగా

ఉంటామని, అవసరమైన సాయం చేస్తూనే ఉంటామని ఈ ఇద్దరూ జగన్ కి గట్టి భరోసావే ఇచ్చేశారు. జగన్ సైతం ఏపీని ముందుకు తీసుకునేందుకు మోడీ, షా తో కలసి ఉండాలని డిసైడ్

అయిపోయారు. ఇదిలా ఉండగా ఏపీలోనే కాదు, తెలంగాణాలో కూదా వైస్సార్, జగన్ చరిష్మా గట్టిగా ఉన్న సంగతి తెలిసిందీ. అక్కడ సామాజిక వర్గ సమీకరణలు చూసుకుంటే రెడ్లు రాజకీయంగా

బలంగా ఉంటారు. జగన్ ఇపుడు రెడ్లకు ఐకాన్ గా ఒక్కసారిగా మారిపోయారు. దానితో జగన్ని దువ్వడం ద్వారా తెలంగాణాలో పట్టు సంపాదించాలని, అక్కడ పాగా వేయాలని బీజేపీ వ్యూహాలు

రచిస్తోందని టాక్.ఇక తెలంగాణా సీఎం కేసీయార్ నిన్నటి వరకూ మోడీ, షా గుడ్ లుక్స్ లో ఉండేవారు. ఆయన ఫెడరల్ ఫ్రంట్ అంటూ నేషనల్ లెవెల్లో ఫిడేల్ వాయించాక ఆయనతో అవసరం లేదని

తీర్మానించుకున్నారట. ఈ నేపధ్యంలో జగన్ని దువ్వడం ద్వారా తెలుగు రాష్ట్రాలో ఉనికిని చాటుకోవాలన్నది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోంది. విభజన హమీల విషయలో ఎటూ ఏపీకి, తెలంగాణాకు

పేచీ ఉంది. ఇది ముదిరి పాకాన పడితే జగన్ కేసీయార్ దోస్తీ కూడా డౌట్లో పడుతుంది. అపుడు రంగంలోకి బీజేపీ దిగి జగన్ వైపు ఉంటూ కేసీయర్ ని కట్టడి చేస్తుందని అంటున్నారు. అలా జగన్ని

కేసీయార్ మీదకు ఉసిగొల్పడం ద్వారా వైసీపీని కూడా తెలంగాణాలో ఎంట్రీ ఇప్పించి రెడ్ల మద్దతు తెసుకోవాలని, వచ్చే ఎన్నికల్లో అక్కడ బీజేపీ, వైసీపీ పొత్తుల ద్వారా అధికారం సంపాదించాలన్నది

కమలనాధుల మాస్టర్ ప్లాన్ ట. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

 

కమలం వైపు టీడీపీ, కాంగ్రెస్ ఎంపీలు

Tags:BJP plan for entry through pics

ఆర్థిక శాఖ అధికారులతో మోడీ భేటీ

Date:19/06/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్ కంటే ముందుగానే ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఐదు డిపార్ట్‌మెంట్ల ఉన్నతాధికారులతో ఈ నెల 20న

సమావేశం కాబోతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ఉద్యోగ కల్పనపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీంతో అదేరోజు జరుగాల్సిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

ఆ మరుసటిరోజుకు వాయిదా పడనున్నదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఐదేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన జీడీపీని మళ్లీ పెంచాలనే ఉద్దేశంతో ప్రతి

డిపార్ట్‌మెంట్ నుంచి ప్రత్యేక రోడ్ మ్యాప్‌పై మోదీ ప్రత్యేకంగా సమీక్షించనున్నట్లు తెలుస్తున్నది. జూలై 5న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కంటే ముందుగా ఈ

సమావేశం జరుగుతుండటంతో దీనికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. దీంతోపాటు మోదీ సర్కార్ 2.0 ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న వంద రోజుల ఎజెండా కూడాదీంట్లో చర్చకు రానున్నది.

ఈ సమావేశానికి ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ, ఖర్చులు, ఆర్థిక సేవలు, దీపం విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరుకాబోతున్నారు. ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వృద్ధి పెంచడానికి,

ఉద్యోగ కల్పన, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే రెవెన్యూ మంత్రిత్వ శాఖ..పన్నుల పరిధి మరింత

విస్తరించడానికి, సమస్యలను పరిష్కరించడానికి, జీఎస్టీపై నివేదిక సమర్పించనున్నది.

ట్యాక్స్ ఎగ్గొడితే…అంతే

Tags:Modi’s meeting with Finance Department officials

ట్యాక్స్ ఎగ్గొడితే…అంతే

Date:19/06/2019

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

పన్నులు ఎగవేసి.. దొరికితే జరిమానాలు చెల్లించి తప్పించుకోవచ్చులే అనుకుంటే ఇక ఎంతమాత్రం కుదరదు. ఆదాయం పన్ను (ఐటీ) శాఖ కొత్త మార్గదర్శకాలను తెచ్చింది మరి. సవరించిన ఈ

నూతన నిబంధనల ప్రకారం తీవ్ర నేరాల కేసుల్లో ఇరుక్కున్నవారికి ఇక ఊరటనేదే లేదు. మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం, అవినీతి, బినామీ ఆస్తుల జప్తు, అప్రకటిత విదేశీ ఆస్తుల

కేసులు.. ఐటీ ఎగవేత నేరాల్లో ఊరటనిచ్చే అవకాశాలను మింగేయనున్నాయి. పన్ను డిమాండ్లు, జరిమానాలు, వడ్డీలు చెల్లించి ఐటీ ఎగవేత కేసులను పరిష్కరించుకోలేరు. ఈ మేరకు ప్రత్యక్ష

పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ)  స్పష్టం చేసింది. సవరించిన మార్గదర్శకాలు అన్ని కేసులకు వర్తిస్తాయని, ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది కూడా. కొత్త నిబంధనల వివరాలను

అందరికీ తెలియజేయాలని సీనియర్ అధికారులకు సూచనలూ చేసింది.తాజా మార్గదర్శకాలు నేరాలను మూడు విభాగాలుగా వర్గీకరించాయి. టీడీఎస్, టీసీఎస్ కింద ఎగవేతలు, రిటర్నుల దాఖలులో

వైఫల్యం మొదటి కేటగిరీలోకి వస్తాయి. రెండో కేటగిరీలో ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతలు, పన్ను రికవరీని అడ్డుకునేందుకు ఆస్తులను దాచడం వంటి నేరాలున్నాయి. ఇక మూడో కేటగిరీలో ప్రత్యక్ష

పన్ను చట్టాల కింద కోర్టులు అపరాధిగా ప్రకటించడం, బోగస్ ఇన్వాయిస్‌లతో మనీ లాండరింగ్‌కు పాల్పడటం, నల్లధనం, బినామీ లావాదేవీల చట్టం కింద విదేశీ బ్యాంక్ ఖాతాలు, ఆస్తులను

ప్రకటించకపోవడం వంటి నేరాలున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ, లోక్‌పాల్, లోకాయుక్త ఇత ర ఏదైనా కేంద్ర, రాష్ట్ర సంస్థల దర్యాప్తుల్లో ఉన్నవారి పన్ను ఎగవేతలనూ సాధారణంగా

తీసుకోవద్దని సీబీడీటీ.. ఐటీ శాఖకు స్పష్టం చేసింది.

బాబును ముంచేసిన నేతల తప్పులు

Tags:If the tags are extinguished … that’s it

21 మంత్రి పెద్దిరెడ్డి పర్యటన

Date:18/06/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈనెల 21న పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆయన తిరుపతి నుంచి ఉదయం బయలుదేరి రొంపిచెర్ల, పులిచెర్ల, సదుం, సోమల, చౌడేపల్లె, పుంగనూరులో పర్యటించి, ఆయన ప్రజాప్రతినిధులు , పార్టీ నేతలు, ప్రజలతో సమావేశం నిర్వహిస్తారు. ఈ మేరకు మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు ఆయన సోదరుడు , పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి మూడు రోజుల పాటు చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలోను పర్యటించనున్నట్లు సమాచారం.మంత్రి పర్యటన విజయవంతం చేయాలని పెద్దిరెడ్డి కోరారు.

రైతులకు వేరుశెనగ విత్తనాలు పంపిణీ

Tags: 21 Minister Peddi Reddy’s visit

పెట్రోల్, డీజిల్ వాహనాలు బంద్.. అన్నీ ఎలక్ట్రికే!

Date:18/06/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

దేశంలో డీజిల్, పెట్రోల్ వాహనాల వినియోగం తగ్గితే.. భారత్కు ముడి చమురు దిగుమతుల భారం దిగివస్తుంది. విదేశాల నుంచి ఇండియా క్రూడాయిల్ కొనుగోలుకు భారీగా ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే వాయు కాలుష్యం కూడా తగ్గుతుంది. బైక్ నడిపేవారు వారి వాహనానికి పెట్రోల్ కొట్టిస్తారు. అదే కారు కలిగి ఉన్నవారు పెట్రోల్ లేదా డీజిల్ తో వాహన ట్యాంక్ నింపుతారు. అయితే భవిష్యత్లో పెట్రోల్, డీజిల్ వాహనాలు కనుమరుగయ్యే అవకాశముంది. ఎందుకంటారా? కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. నీతి ఆయోగ్ తాజాగా కేంద్ర
ప్రభుత్వానికి ఒక సిఫార్సు చేసింది. ఇందులో 2030 తర్వాత దేశంలో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయించాలని ఉంది. అంటే డీజిల్, పెట్రోల్ వెహికల్స్ బంద్ కావొచ్చు. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కు సంబంధించి ప్రతి శాఖకు తగిన బాధ్యతలు అప్పగించాలని కేంద్రాన్ని కోరింది.  కేంద్ర రోడ్డు రవాణా శాఖ 2030 కల్లా డీజిల్, పెట్రోల్ వాహనాలను తొలగించేందుకు దశల వారీగా తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

 

 

 

 

 

ఇందులో భాగంగానే ఇ-హైవేస్ ప్రోగ్రామ్ ను కూడా లాంచ్ చేయొచ్చు. ఇందులో ఎంపిక చేసిన జాతీయ రహదారుల్లో ఎలక్ట్రిక్ బస్సులను, ట్రక్కులను
నడుపుతారు. దీనికి అవసరమైన ఎలక్ట్రిక్ నెట్వర్క్ను ఏర్పాటు చేస్తారు. అప్కమింగ్ ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేను ఈ-హైవేగా తీర్చిదిద్దుతామని కేంద్ర రోడ్డు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశంలో డీజిల్, పెట్రోల్ వాహనాల వినియోగం తగ్గితే.. భారత్కు ముడి చమురు దిగుమతుల భారం దిగివస్తుంది. విదేశాల నుంచి ఇండియా క్రూడాయిల్ కొనుగోలుకు భారీగా ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే వాయు కాలుష్యం కూడా తగ్గుతుంది.

 

మ్యాజిక్ అని మునిగాడు.. శవమై తేలాడు

 

Tags: Petrol and Diesel Vehicles Band .. All Electric!

మళ్లీ తెరపైకి ఒకే దేశం ఒకే ఎన్నికలు

Date:18/06/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

నరేంద్రమోడీ, అమిత్ షాల నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం మరోసారి తన రాజకీయ అజెండాను పైకి తీసింది. వివిధ రకాల అంశాలతో ఈనెల పందొమ్మిదో తేదీన ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖయే ఇందుకు పూనుకుంటోంది. అయిదు అంశాల అజెండాలో ఒకే ఒక్క అంశం అత్యంత కీలకమైనది. రాజకీయ ప్రాధాన్యంతో ముడిపడినది. మిగిలిన నాలుగు అంశాలు సాధారణమైన వ్యవహారాలే. జాతీయ స్థాయిలో చర్చ పెట్టి నిర్ణయాలు తీసుకోవాల్సినంతటి వివాదాస్పద విషయాలు కాదు. పార్లమెంటు ఔన్నత్యం పెంచడానికి ఏమేం చర్యలు తీసుకోవాలనేది అజెండాలో మొదటి అంశంగా సూచించారు. నిజానికి కేంద్రప్రభుత్వం ఈదిశలో తనంత తాను చర్యలు తీసుకున్నప్పటికీ ఎవరూ అభ్యంతరం పెట్టరు. 75 ఏళ్ల స్వాతంత్ర్యం లో నవభారత నిర్మాణం అనేది మరొక అంశం. ఇది పూర్తిగా అకడమిక్ గా కనిపిస్తుంది. అలాగే మహాత్మాగాంధీ 150 వ జయంతి ఉత్సవాల నిర్వహణ, చివరిగా వెనకబడిన జిల్లాల అభివృద్ధి . వీటిలోదేనిపైనా పెద్దగా రాజకీయ పార్టీలతో చర్చించాల్సినంతటి తీవ్రత లేదు. కానీ ఒక దేశం, ఒకే ఎన్నిక అన్న అజెండాలోని టాపిక్ మాత్రం రాజకీయ వేడిని రగిలించేదే. 2014 నుంచి ఈ అంశాన్ని కేంద్రం సజీవంగా ఉంచుతూ వస్తోంది. రకరకాల ఆప్షన్లను పార్టీల ముందు పెడుతోంది. మొండిగా ముందుకు వెళ్లడానికి సాహసించలేదు. రాజ్యసభలోనూ భవిష్యత్తులో భారీ ఆధిక్యత సమకూరబోతోంది.

 

 

 

 

 

 

దీనిని ఆసరాగా చేసుకుంటూ రాజ్యాంగ సవరణ చేసైనా ఒక దేశం ఒకే ఎన్నికలు నినాదాన్ని సాకారం చేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఒక దేశం, ఒక ఎన్నికలు అన్న నినాదం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నిరంతరం దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉండటం సాధారణ తంతై పోయింది. దీంతో ఎన్నికల కోడ్ పేరిట పథకాలు నిలిపివేయాల్సి వస్తోంది. కొత్త పథకాలు ప్రవేశపెట్టడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పైపెచ్చు కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు నిరంతరం ఎన్నికలపైనే దృష్టి పెట్టాల్సి వస్తోంది. పరిపాలన కంటే రాజకీయాలకే పెద్ద పీట వేస్తున్నాయి. దీంతో కాలక్రమ పట్టికను అనుసరించి జరగాల్సిన కార్యక్రమాలకు తిలోదకాలివ్వాల్సి వస్తోంది. పార్టీల రాజకీయ వైరుద్ధ్యాలు నిరంతరం కొనసాగుతూ వస్తున్నాయి. పరస్పర సహకారం కొరవడుతోంది. దీనికి విరుగుడుగా దేశంలో లోక్ సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిపేస్తే గొడవ వదిలిపోతుంది. తర్వాత పూర్తిగా పరిపాలనపై దృష్టి పెట్టవచ్చనేది కేంద్రం ఆలోచనగా చెబుతున్నారు. కానీ అంతర్గతంగా రాజకీయ ఉద్దేశాలు ఇమిడి ఉన్నాయనేది ప్రతిపక్షాల ఆరోపణ. రాష్ట్రాల ప్రాధాన్యాలు వేరు. జాతీయంగా ఉండే ప్రాధాన్యాలు వేరు. అసెంబ్లీ, లోక్ సభలకు ఒకేసారి ఎన్నికలు జరిపితే ప్రాంతీయ పార్టీలకు ఆదరణ తగ్గుతుందనే వాదన ఉంది.

 

 

 

 

 

 

జాతీయ పార్టీలకు ప్రయోజనం అధికంగా ఉంటుందని ప్రాంతీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అందుకే అన్ని పార్టీలను ఒకే ప్లాట్ ఫారం పైకి తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది.దేశంలో ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకున్న తర్వాత నేషనల్ అజెండాకు ప్రాముఖ్యం తగ్గిపోయింది. ప్రాంతీయ ఆకాంక్షలు, అస్తిత్వాలు పెరిగిపోయాయి. కొన్ని పార్టీలైతే రాష్ట్రానికి ఒక ప్రత్యేక జెండా కూడా రూపొందించుకుంటామనే స్థాయికి వెళ్లిపోయాయి. తమిళనాడు వంటి రాష్ట్రాలు జాతీయ భాష హిందీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రాంతీయత్వం బాగా పెరిగిపోవడం జాతీయ సమగ్రతకే భంగకరమని బీజేపీ భావిస్తోంది. గడచిన మూడు దశాబ్దాలుగా ఏ జాతీయ పార్టీకి లేనంత బలం బీజేపీకి ఇప్పుడు లభించింది. దీనిని సద్వినియోగం చేసుకుంటూ మొత్తం భారత దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిపేస్తే రాజకీయ స్థిరత్వాన్ని సాధించవచ్చని కమలనాథుల అంచనా. దానివల్ల కశ్మీర్ వంటి వివాదాస్పద అంశాల్లో దృఢమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆర్టికల్ 370 రద్దు వంటి విషయాల్లోనూ జాతీయ వైఖరికి మద్దతు ఒకేసారి కూడగట్టవచ్చు. ప్రాంతీయ పార్టీల డిమాండ్లు, వాటి లోకల్ అజెండాను పక్కనపెట్టేయవచ్చనేది బీజేపీ యోచన.

 

 

 

అయితే లోక్ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిపితే ప్రాంతీయపార్టీలు నష్టపోతాయని ఆయా పార్టీల అధినేతలు విమర్శిస్తున్నారు. ఉదాహరణకు ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కానీ లోక్ సభ ఎన్నికల విషయానికొచ్చేసరికి జాతీయపార్టీలైన బీజేపీ, కాంగ్రెసు పుంజుకున్నాయి.దేశంలో ప్రతి ఆరునెలలకు ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయి. దీనివల్ల కేంద్రంలోఅధికారంలో ఉన్న పార్టీ పూర్తిగా ఆ రాష్ట్రంపై ద్రుష్టి పెట్టాల్సి వస్తోంది. పైపెచ్చు కోడ్ పేరుతో అనేక పథకాలు పెండింగులో పడుతున్నాయి. అభివ్రుద్ధి కుంటుపడుతోంది. ప్రాంతీయ పార్టీలు అధికారం కోసం ఇరుగు పొరుగు రాష్ట్రాలతో విభేదాలను రెచ్చగొడుతున్నాయి. జాతీయంగా అవే పెద్ద సమస్యలుగా రూపుదాలుస్తున్నాయి. అదే దేశవ్యాప్త ఎన్నికలు జరిగితే అంత పెద్ద ఎత్తున చర్చకు తావుండదు. జాతీయవాదం, దేశ రక్షణ వంటి అజెండాను భుజానకెత్తుకునే బీజేపీ వంటి పార్టీలకు గరిష్ఠంగా లబ్ధి సమకూరుతుంది. కానీ ప్రస్తుతమున్న రాజకీయ వాతావరణంలో ఒకేసారి దేశవ్యాప్త ఎన్నికలంటే ప్రాంతీయ పార్టీలు అంగీకరించకపోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీల కాలవ్యవధిని కుదించాల్సి వస్తుంది.

 

 

 

 

 

 

కొన్నిచోట్ల పెంచాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారం రాజ్యాంగబద్ధం కావాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. సగం పైగా రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాల్సి ఉంటుంది. అయితే కేంద్రంలోని బీజేపీకి ప్రస్తుతం ఈరకమైన సవరణ చేసేందుకు అవసరమైన చట్టసభల బలం లభించింది. సగానికిపైగా రాష్ట్రాల్లో బీజేపీ, మిత్రపక్షాలే అధికారంలో ఉన్నాయి. లోక్సభ, రాజ్యసభల్లోనూ మెజార్టీ మార్కు ఎన్డీఏదే. అందువల్ల రానున్న రెండేళ్ల పాటు చర్చలు, సంప్రతింపుల పేరిట తతంగం నడిపి 2024 నాటికి ఒకే దేశం, ఒకే ఎన్నిక కు బీజేపీ ప్రయత్నిస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. లేదంటే దేశంలోసగం అసెంబ్లీలకు ఒకసారి మిగిలిన అసెంబ్లీలకు లోక్ సభతో కలిపి నిర్వహించే అవకాశం కూడా ఉందంటున్నారు.

జేసీ మాటల్లో ఆంతర్యం ఏమిటీ

Tags: Once again, the same country is the same election