సీపీఎం తోక పార్టీ : తెరాస 

Date:23/04/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్ లో జరిగిన సిపిఎం పార్టీ బహిరంగ సభలో ఆపార్టీ నేతల ప్రసంగాలు విచిత్రంగా సాగాయి. సిపిఎం నేతలు దేశాన్ని ఏలినట్టుగా పెద్ద మాటలు మాట్లాడారని తెరాస నేతలు కర్నె ప్రభాకర్, మాజీ మంత్రి రాములు, గట్టు రాంచందర్ రావు ఎద్దేవా చేసారు.  సోమవారం నాడు వారు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ మాట్లాడుతూ సిపిఎం ఎపుడూ తోక పార్టీ గానే ప్రవర్తించింది. .కార్యకర్తలు లేని సిపిఎం అన్నీ స్థానాల్లో పోటీ చేస్తామని ఆత్మవంచనతో మాట్లాడారు. .వారికి పందొమ్మిది సీట్లలో కూడా అభ్యర్థులు లేరని విమర్శించారు. తెరాస తో పొత్తు పెట్టుకోమని ప్రకటించారు. మా పార్టీ ఎప్పుడయినా మీతో పొత్తుకు ప్రయత్నించిందా అని ప్రశ్నించారు. .సిపిఎం అంటే క్యాపిటలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. సిపిఎం ఎప్పూడూ ఇతరుల మీద ఆధారపడి బతికింది. ఎప్పూడూ సొంతగా ఎదగాలని ప్రయత్నించలేదని అయన అన్నారు.జ తెలంగాణ ను అడ్డుకున్న సిపిఎం ఇపుడు తెలంగాణ అభివృద్ధి ని కూడా అడ్డుకుంటోంది. తెలంగాణ లో అభివృద్ధి తమ్మినేని కి కనపడటం లేదా అని నిలదీసారు. .తమ్మి నేని సొంత గ్రామం లో పాలేరు ఉప ఎన్నికలో ఎవరికీ ఎక్కువ ఓట్లు వచ్చాయి ? భక్త రామదాసు ప్రాజెక్టు సిపిఎం కు కనిపించడం లేదా ? కేవలం ఖమ్మం కే పరిమితమైన పార్టీ సిపిఎం  అని అన్నారు. .అన్నీ రకాల కార్మికులు మీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసాయి. మీ జెండాలు మోసిన కార్మికులకు జీతాలు పెంచింది తెరాస సర్కారు అనే విషయం గుర్తించుకోవాలని అన్నారు. పశ్చిమ బెంగాల్ ను మూడు దశాబ్దాలు పాలిస్తే మూడు శతాబ్దాలు వెనక్కి నెట్టింది సిపిఎం కాదా  అని అడిగారు. త్రిపుర లో ఎందుకు ఓడిపోయామో ఆత్మ పరిశీలన చేసుకున్నారా ? సిపిఎం ది పొత్తులు చీకటి ఒప్పందాల పరంపరే.   గూట్లో రాయి తీయ లేని వారు ఏట్లో రాయి తీస్తారట. .కేరళ లో వ్యవసాయ సంక్షేమం బాగుందని మాట్లాడేవారు తెలంగాణ లో వ్యవసాయానికి భారీ గా కేటాయింపులు చేశామని వీరభద్రం కు తెలియదా అని అడిగారు. .సాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం ..ఆగస్టు కల్ల కాళేశ్వరం ద్వారా నీళ్లిస్తాం. .రైతుల ఆత్మహత్యలు తెలంగాణ లో తగ్గాయని కేంద్రం చెబుతుంటే సిపిఎం పెరిగాయని ఎలా చెబుతోందని నిలదీసారు. సిపిఎం నేతలు పెద్దగా ఊహించడం మానుకోవాలి. తెరాస సిపిఎం తో పొత్తు పెట్టుకోదు.  తెరాస పై చేసిన విమర్శలు ఉపసంహరించుకుంటే సిపిఎం కు మంచిదని సలహా ఇచ్చారు.
Tags:CPM Tail Party: TRS

సీపీఎం ఒక దివాళుకోరు పార్టీ : బీజేపీ నేత కిషన్ రెడ్డి

Date:23/04/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
సీపీఎం జాతీయ సభలు  ప్రధానమంత్రిని, బీజేపీని తిట్టడం తో ముగించారని బీజేపీ శాసనసభాపక్షనేత కిషన్ రెడ్డి విమర్శించారు.  సోమవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు.  సీపీఎం హైదరాబాద్లో సభ పెట్టి కాంగ్రెస్ పార్టీతో పనిచేయాలని నిర్ణయించుకోవడం ఆపార్టీ దివాళకోరు తనానికి నిదర్శనమని అన్నారు. ఆ పార్టీ… బీజేపీని కౌరవులతో పోల్చిందని అయన అన్నారు. ‘ చిన్నా చితక పార్టీలతో కూటమిని ఏర్పాటు చేసి, కులం, మతం, భాష పేరుతో కూటములు కట్టే మీరు కౌరవులా? దేశం కోసం జాతీయ భావన సిద్ధాంతంతో పనిచేస్తున్న భారతీయ జనతాపార్టీ కౌరవులా? అని అయన ప్రశ్నించారు. సీపీఎం పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారని, అలాంటప్పుడు పాండవులని ఏ రకంగా ఆ పార్టీ అనుకుంటుందో అర్థం కావడంలేదన్నారు. కేరళలోనే ఆ పార్టీ ఉందని, పశ్చిమబెంగాల్లో సీపీఎం పార్టీ రోజు రోజుకు కనుమరుగు అవుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు. అక్కడ బీజేపీ రెండో స్థానంలో ఉందని, సీపీఎం మూడో స్థానంలో ఉందని ఆయన గుర్తుచేశారు. కేరళలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి వస్తుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.  జాతీయ సభల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ పై వాళ్ళ వైఖరి చెప్పలేదు.. కమ్యూనిస్ట్ పార్టీ ల గోడలకు బీటలు వారాయని అయన అన్నారు. హైద్రాబాద్ లో జరిగే సభల లో దిశ నిర్దేశనం చేస్తారని కమ్యూనిస్ట్ వాళ్ళు ఎదురు చూశారని అయన అన్నారు. స్వతంత్ర వచ్చినపట్టి  నుంచి కాంగ్రెస్ పార్టీ చేసిన పాలనకు సీపీఎం కి బాధ్యత లేదా.  యూపీఏ హయంలో  జరిగిన అవినీతి కి సీపీఎంకు భాగ్యస్వామ్యం లేదా అని అయన అన్నారు. సీపీఎం రెండు గా విడిపోయి…సభలు నిర్వహించారు.. బీజేపీ తిట్టడం అంటే భారత ప్రజలను అవమానించడం. దేశం కోసం ఏ పార్టీ పని చేస్తుంది అనేది ప్రజలు నిర్ణయించారు. మతాల గూర్చి మాట్లాడారు. నాలుగు  సంవత్సరాల లో ఎక్కడా  మతఘర్షణలు లేవు. దిగ జారుడు రాజకీయాలు సీపీఎం కే సాధ్యమని అన్నారు. సీపీఎం పార్టీకి దమ్ము ధైర్యం వుంటే , మోడీ అవినీతి ని నిరూపించాలని అన్నారు. సీపీఎం కి కార్యకర్తలు తగ్గారు. ఎవరూ గుండాలో, ఎవరూ రౌడీలో, ఎవరూ హత్యలు చేస్తున్నారో ప్రజలకు తెలుసని అన్నారు. సీపీఎం అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్నారని అన్నారు
Tags:

యువతి రాష్ డ్రైవింగ్

– ఒకరి మృతి
Date:23/04/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
రాచకొండ పోలీస్ కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీఏఈ కాలనీ గేటు వద్ద ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.  నలుగురు బీటెక్ విద్యార్థినిలు ఏ.ఎస్.రావు నగర్ నుండి నుండి తార్నాక వైపు స్కోడా కారులో వెళుతున్నారుర.  వాహానం అతివేగంగా నడపడంతో  డీఏవీ కాలనీ దగ్గర  అదుపు తప్పి డివైడర్ ఎక్కి గోడను ఢీకొట్టింది.  అక్కడే  ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న అశోక్ అనే చెప్పులు కుట్టుకునే వ్యక్తిపైకి దూసుకెళ్లడంతో అతడికి తీవ్రగాయాలు అయ్యాయి. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అశోక్ మృతి చెందాడు.  శ్రీనిధి కళాశాలకు చెందిన విద్యార్థినిలు  ఈశాన్య, హారికా, సుజన,అమృత లు ఒక పార్టీకి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.  ఘటన జరిగినప్పుడు ఈశాన్యరెడ్డి అనే విద్యార్థిని,  డ్రైవింగ్ చేస్తుంది.  ప్రమాద సమయంలో మితిమీరిన వేగంతో అరుపులు కేకలతో వెళుతూన్నారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. పోలీసులు ప్రమాదం కేసులో నిందితులుగా ఉన్న నలుగురు యువతులు అరెస్ట్ చేసారు. యువతుల్లో మలక్పేట సీఐ గంగిరెడ్డి కుమార్తె హారికారెడ్డి  వుంది. ఘటనపై కుషాయిగూడ సోలీసు ఇనెస్పెక్టర్  చంద్ర శేఖర్ మాట్లాడుతై ఈశాన్య  రెడ్డి అనే యువతి అజాగ్రత్తగా వాహనాన్ని నడపడం ద్వారా ప్రమాదం జరిగిందని అన్ఆరు. వాహనాన్ని నడుపుతున్న యువతి మద్యం సేవించి లేదు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం లో నలుగురు యువతులు ఉన్నారు.  వారిలో మాలక పేత సీఐ గంగా రెడ్డి కూతురు హారిక రెడ్డి కూడా ఉంది. మిగిలిన ముగ్గురిలో ఒక యువతి మద్యం సేవించి ఉందని అన్నారు. 304 ఏ కింద కేసు  నమోదు చేసి దర్యపు చేస్తున్నామని అన్నారు.
Tags:The young woman driving the rash

ఎమ్మార్వొలే రిజిస్ట్రార్లు

23/04/2018
మెదక్ ముచ్చట్లు:
రైతులకు ఇబ్బందులు కలుగకుండా పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు ఉండేలా ప్రభుత్వం జూన్ నుంచి తహసీల్దార్లకే బాధ్యతలు అప్పగించనున్నది. రైతుల చెంతనే భూ రిజిస్ట్రేషన్లు నిర్వహించడానికి సీఎం కేసీఆర్ నూతన రిజిస్ట్రేషన్ విధానానికి శ్రీకారం చుట్టారు. భూ రిజిస్ట్రేషన్లు చేయడంతోపాటు పాస్‌బుక్‌లను కొరియర్‌లో ఇంటికి పంపేలా రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నది. త్వరలోనే ధరణి వెబ్‌సైట్‌ను ప్రారంభించనుంది. తహసీల్దార్ కార్యాలయాల్లో భూ రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల వీటన్నింటికీ చెక్ పడనున్నది. రిజిస్ట్రేషన్‌కు వచ్చే రైతుల భూ వివరాలను సవివరంగా తహసీల్దార్ చూడడంతోపాటు కబ్జాలో ఎవరున్నారు, పట్టాదారు ఎవరు, ఇంతకుముందు కాస్తులో ఎవరు ఉన్నారు, పట్టాభూమా ప్రభుత్వ భూమా, పహాణిలో ఎవరి పేరు ఉంది అనే తదితర వివరాలను పరిశీలించనున్నారు. క్రయవిక్రయాలు జరిగే క్రమంలో ఆ గ్రామంలోని ఇద్దరు రైతుల సమ్మతితోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగేటట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. భూమి క్రయవిక్రయాలు జరిగే సమయంలో సబ్ రిజిస్టర్ సమయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయానికి వారు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తారు. సెల్‌డీడీ పాస్‌పుస్తకాలు సమర్పిస్తే రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. అమ్మినవారి పాస్‌పుస్తకం నుంచి రిజిస్ట్రేషన్ జరిగిన భూమిని తీసేసి కొన్నవారి పాస్‌పుస్తకంలో నమోదు చేస్తారు.  రెండో విడుత మే 12 నుంచి పైలట్ ప్రాజెక్టుగా రామాయంపేట మండలాన్ని తీసుకొని ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేయనున్నది. జిల్లాలో 20 మండలాలు ఉండగా నాలుగు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మండలాల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి. మిగతా 16 మండలాల్లో తహసీల్ కార్యాలయాల్లో భూ రిజిస్ట్రేషన్లు చేసే బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించనున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లపై తహసీల్దార్లకు హైదరాబాద్‌లో ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. మండలాల్లోని రిజిస్టేషన్లు చేయడం వల్ల భూములు ఉన్న ప్రతి రైతుకు లాభం చేకూరనున్నది. మూడుదఫాలుగా తహసీల్లార్లకు శిక్షణ ఇచ్చారు. రైతు సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నది. రైతు సమ్మతి లేకుండానే అతడి భూమిని ఇంకో రైతుపైన చేయడంపైన వివాదాలకు దారితీస్తున్నది. ఒకే సర్వే నంబర్‌ను బైనంబర్లతో రిజిస్ట్రేషన్లు చేస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత అదే రోజు పాస్ పుస్తకాన్ని తిరిగి సబ్‌రిజిస్టర్‌కు పంపుతారు. సబ్ రిజిస్టర్ ఎవరి పుస్తకాన్ని వారికి సెల్‌డీడీ భూమిని కొన్నవారిని కొరియర్ ద్వారా పంపిస్తారు. దీంతో భూమి కొన్నవారు, అమ్మినవారు భూరిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టు తిరిగే సమస్య ఉండదు. ఇప్పటికే జిల్లాలో భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహించింది. దీంతో భూయజమానులపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ప్రతి మండల కేంద్రంలో ఒక ప్రత్యేక అధికారి ఉండి ఏ రోజుకారోజు ధరణి వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు పూర్తి సమాచారాన్ని పొందుపరుస్తారు. దీంతో రైతులకు రిజిస్ట్రేషన్ల కార్యాలయాల చుట్టూ తిరుగకుండా పనిభారం తగ్గుతుంది.
Tags:Emmoral registrars

 అడ్డూ, అదుపు లేని ఇసుక మాఫియా

Date:23/04/2018
నిజామాబాద్ ముచ్చట్లు:
సందట్లో సడేమీయా అనే చెందంగా ఇసు క రవాణాలో అక్రమాలు చోటు చేసుకుంటున్నా అధికారులు మౌనం దాల్చడం వెనుక ఆంతర్యమేమిటని అడ్డాకుల మండల ప్రజలు ప్రశ్నిస్తు న్నారు. స్థానిక అవసరాలకు అవసరమైన ఇసుక తరలింపుకు ప్రభు త్వం అనుమతులు ఇచ్చింది. ఇదే అదునుగా చూసుకున్న ప్రజా ప్రతిని ధులు, అధికారులు, నాయకులు ఇసుక మాఫియాతో చేతులు కలిపి అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా మండల పరిధిలోని కందూరు వాగు నుంచి జోరుగా సాగుతోంది. బుధ,గురు వారాల్లో ఇసుకను తర లించేందుకు అనుమతులు ఇవ్వడంతో వారానికి ఆ రెండు రోజులు అధికారికంగా ప్రభుత్వానికి కాకీ లెక్కలతో సరిపెడుతూ వస్తున్నారు.వాస్తవానికి రెండు రోజుల్లో కనీసం 800 ట్రాక్టర్ల ట్రిప్పులు ఇసుకను ఇక్కడి నుండి తరలిస్తున్నారు. అధికారికంగా ఒక్కొ ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.600 చెల్లించాలి. అక్రమంగా మరో రూ.400 నుండి రూ.600 వరకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు వసూళ్లు చేస్తున్నారు. దీం తో రూ.4 లక్షలకు పైగా అక్రమార్జన సంపాధించుకుంటున్న విషయం అధికారులు, అనధికారులకు తెలిసినప్పటికీ అక్రమ వసూళ్లలో అధికా రులు జోక్యం చేసుకోవడం లేదంటే వారి కనుసన్నలతోనే ఈ తతంగం నడుస్తుందని పుకార్లు వినపడుతున్నాయి. కందరూ గ్రామానికి చెందిన అన్ని పార్టీల నాయకులు ఏకమై ఇసుక తరలింపు చేస్తున్నారు. ఇసుక డంప్పింగ్ దగ్గర ఉండి అక్రమంగా రూపాయలు వసూలు చేయాలని నిబంధనలను పెట్టుకొని వచ్చిన కాడికి దండుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల నష్టపోయేది లబ్ధిదారులేనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.స్థానిక అవసరాల నిమిత్తం ప్రభుత్వం ఇసుక అనుమతులను వాగులో మీటర్ లోతు ఇసుకను తీయాలనే నిబంధనలతో ఆదేశాలు జారీ చేసినప్పటికి కందూరు వాగులో మాత్రం 3 మీటర్ల లోతుపైనే ఇసుకను తీయటం పట్ల భూ గర్భ జలాలు అడుగంటి పోతాయని, చుట్టూ ఉన్న వ్యవసాయ దారులు వాపోతున్నారు.కందూరు పెద్ద వాగు నుంచి అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణాతో పాటు అక్రమ వసూళ్లు చేస్తున్నారని అధికారులు పర్యవేక్షణ కొరవడింది.
Tags:Baffle, uncontrolled sand mafia

మధ్యమానేరు ప్రజలకు నీటి కష్టాలు

Date:23/04/2018
నిజామాబాద్ ముచ్చట్లు:
మద్యమానేరు ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్న పొత్తూరు, కందిట్కూర్ గ్రామాల ప్రజలకు నీటి కష్టాలు మాత్రం తీరడంలేదు.అభివృద్ది చేశామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప నీటి కష్టాలను కూడా తీర్చడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ మద్యకాలంలోనే మద్యమానేరు ప్రాజెక్టులోని నీటిని బోరు మోటర్ల ద్వారా జడ్పీటీసి సిద్ద వేణు చోరవతో నీటిని వ్యవసాయ పోలాల కోసం పంపిణీ చేశారు. అయిన నీటి కష్టాలు మాత్రం ఏమాత్రం తీరడం లేదు. గ్రామ శివారులోని బీరప్ప ఆలయంకు వెళ్లె దారిలో వ్యవసాయం పోలం కోసం వేసుకున్న పైప్‌లైన్ లీకేజి నీటిని పట్టుకోవడానికి గ్రామస్థులు వస్తున్నారుఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో ని మద్యమానేరు వాగులో సుమారు వందకు పైగా బోర్లను వేసి రైతులు వ్యవసాయం సాగు చేస్తున్నారు. వాగునుండి లిఫ్ట్‌ల ద్వారా పైపులైన్‌లను కిలోమీటర్ల నుండి వేసుకుని వ్యవసాయం సాగుచేస్తున్న రైతులకు అటూ వ్యవసాయానికి, మరో వైపు తాగేందుకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రైతులు వేసిన బోర్లు, గ్రామంలోకి నల్లాల ద్వారా నీటిని సరఫరా ద్వారా పంపిణీ చేసే బోరు బావులు లో నీటి శాతం అడుగంటడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్లాల బోరు ఎండిపోవడంతో గ్రామపంచాయతీ కొత్త బోరును తవ్వి బావి ద్వారా నీటిని సరఫరా చేస్తుంది. బావి నీళ్లు మురికి నీటి కంటే దారుణంగా ఉన్నాయని , నల్లా నీళ్లను తాగకుండా వ్యవసాయ బావుల దగ్గరకు, లిప్ట్‌ల వద్ద క్యూ కడుతున్నారు. మురికి నీళ్లు వస్తున్నాయని, తాగలంటే నరకం కనపడుతుందని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్ని సార్లూ చెప్పిన పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.ఇప్పటి వరకు గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయలేదని గ్రామస్థులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు..దీంతో ఒక్కో చుక్క నీటిని పట్టుకుని తాగునీటి కష్టాలతో గ్రామస్థులు కుస్తీ పడుతున్నారు. తలాపున మద్యమానేరు ఉన్న తాగేందుకు నీరు కరువు కావడం పై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసిన పంటపోలాలు ఎండిపోయాయని, మమ్మల్ని ప్రభుత్వం అదుకోవాలని రైతులు, గ్రామస్థులు కొరుతున్నారు.
Tags:

కొత్త జిల్లాల్లో  అధికారుల కొరత

– ఇంచార్జీలతోనే పాలన
Date:23/04/2018
అదిలాబాద్ ముచ్చట్లు:
కొత్త జిల్లాల్లో కొత్త కష్టాలు నెలకొన్నాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసినప్పటికీ ఆయా శాఖల్లో పూర్తి స్థాయిలో అధికారులు,సిబ్బది లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.అధికారులను పూర్తి స్థాయిలో భర్తీ చేయని కారణంగా ఇంచార్జీలతో కాలం వెల్లదీస్తున్నారు. ఇక్కడ ఉన్న అధికా రులకు పదోన్నతులపై వేరే ప్రాంతాలకు బదిలీ చేస్తున్నా రు.  2016 అక్టోబర్ 11న కొత్త జిల్లా ఏర్పడినప్పటికీ కీలకమైన కలెక్టర్‌తో పాటు ఇతర శాఖల్లో పోస్టులు ఖాళీగా ఉండ డం, పాలన విభాగంపై ప్రభావం చూపుతంది. మంచి ర్యాల జిల్లా పరిధిలో 18 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లు ఉ ండగా పోలీసుశాఖ మినహా, మిగిత శాఖ లకు 574 పోస్టులు మంజూరయ్యాయి. వీరిలో 383 మంది విధుల్లో చేరగా సుమారు 204 పోస్టులు ఖాళీగా ఉ ండడం గమనార్హం. ముఖ్యంగా కలెక్టరేట్ విభాగంలో 54 పోస్టుల్లో కేవలం 24 మంది మాత్రమే విధులు నిర్వహి స్తున్నారు. పశుసంవర్థక శాఖలో 10 పోస్టులు ఖాళీ ఉండ గా, మైనార్టీ శాఖలో మూడు పోస్టులు మంజూరు కాగా ఇంక రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెవెన్యూ విభాగంలో 13 మం ది విధులు నిర్వహిస్తుండగా ఇంక 7 పోస్టులు ఖాళీగా ఉ న్నాయి. పౌర సరఫరాల విభాగంలో 5 పోస్టులు ఉండగా , కీలకశాఖలో కూడా 204 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.పాలన సౌలభ్యం కోసం జిల్లాల ఏర్పాటును ప్రభుత్వం చేపట్టింది. అంతే కాకుండా డిప్యూటేషన్‌లపై ఉద్యోగులను తరలి స్తున్నారు. దీని కారణంగా అభివృద్ది కుంటుపడుతుంది. ఇటివల కాలంలో తహసీల్దార్లకు ఆర్డీవోగా పదోన్నతులు ఇచ్చి వారి స్థానంలో ఇంచార్జీలను నియమించారు. ఆయా జిల్లాలో కీలక శాఖలైన ఉపాదిహామీ, వ్యవసాయ శాఖ అధికారులను బదీలి చేశారు. వారి స్థానంలో పక్క మండ లాల అధికారులకు అదనపు బాద్యతలు ఇచ్చారు. దీంతో వారు ఏ మండలానికి న్యాయం చేయలేకపోతున్నారు.పని ఒత్తిడి కారణంగా అభివృద్ది కుంటుపడుతుందని పలువురు అంటున్నారు. సామాన్య ప్రజలు బర్త్, కుల, ఆదాయ దృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుం టున్నారు. కానీ వారికి అధికారులు లేక సకాలంలో దృవీకరణ పత్రాలు అందడం లేదు. ఇంచార్జీగా అధికారి సకాలంలో ఏ మండలంలో అందుబాటులో లేక పోతు న్నారు. కొత్త జిల్లాల్లో పూర్తి స్థాయిలో అధికార సిబ్బందిని నియమించడంలో ప్రభుత్వం తలమునకలు అవుతుంది. పూర్తి స్థాయిలో అధికారులు లేకపోవడంతో ఉన్నవారితో నే పనులు చేయించడం పై అధికారులకు ఇబ్బందులను కలిగిస్తుంది.అధనపు భారంతో పనులు సకాలంలో చేయ లేక ప్రజల నుండి విమర్శలను ఎదుర్కొవాల్సి వస్తుందని ఉన్నతాధికారులు సైతం వాపోతున్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను నాలుగు జిల్లాలుగా ప్రకటించింది. ప్రజల వద్దకు పాలన మరింత దగ్గర చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అ ఇదిలా ఉంటే వీరికి పథకాల అమలు, హరిత హా రం మొక్కల పర్యవేక్షణ, నర్సరీల పరిశీలన లాంటి పను లను అప్పగిస్తున్నారు. అదికారులు ఎటు పోవాలో ఎం చేయాలో తోచని స్థితిలో ఉన్నారు. ప్రజలకు పాల దగ్గర అనే అంశం ఎమో గానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఏ పనికైన కార్యాల యా నికి వెళ్లితే అక్కడా వారికి సార్ లేరు. బదిలీపై వెళ్లారు …వారి స్థానంలో పక్క మండలం అధికారి ఇంచార్జీగా ఉన్నారు. సార్ వచ్చే వరకు వేచి ఉండడండని సమాదానం వస్తుంది. జిల్లా విభజన కారణంగా ప్రజలకు మరింత ఇబ్బందులు ఎదురవు తున్నాయని పలువురు ఆరోపిస్తున్నా రు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, ఇం చార్జీల స్థానంలో రెగ్యూలర్ అధికారులను నియమిం చాలని ప్రజలు కోరుతున్నారు. పాలన సౌలభ్యం కోసం వ్యవస్థను మెరుగు పర్చేందుకు ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి సీఎం కేసీఆర్ నూతన జిల్లాలను ఏర్పాటు చేశారు. కానీ దీంతో ప్రజల సమస్యలు పరిష్కారం కాకపోగా నిర్వహణ బారం పెరుగుతోందని ప్రజలు భావిస్తున్నారు. జిల్లాలోని చాలా కార్యాలయాల్లో అధికారులు లేక ఉన్నవారినే ఇంచార్జీలు గా చేసి అదనపు బాద్యతలు కట్టబేట్టారు. నూతనంగా ఉద్యోగులు నియమకం జరగ కపోవడంతో చాలా కార్యా ల యాల్లో ఈ సమస్య ఎదురవు తుంది. ప్రజలు తమ సమ స్యలు పరిష్కారం కాకపోగా సమయం వృధాతో పాటు ప్రయాణ ఖర్చులు అధికం అవుతున్నయంటున్నారు.అధికారులపై పని భారం పెరిగి తీవ్ర ఒత్తిడి లోనై ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు. కాగా అధికారులు స్థాని కంగా ఉండాలని అనే ప్రభుత్వ నిబంధనాలను మండల స్థాయి అధికారులు పట్టిం చుకు న్న దాఖలలు లేవు అని చెప్పావచ్చు. గతంలో ప్రజలు తమ సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు తెలియజేశే వారు. అక్కడ పరిష్కా రం లభించకపోతే చివరగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే వారు. అప్పట్లో సోమవారం మాత్ర మే కలెక్టర్ ఫిర్యాదుల విభాగం ఉండేది కానీ ఇప్పుడు జిల్లాలు దగ్గరగా ఉండ డంతో ప్రతి రోజు కలెక్టరేట్లో ఫిర్యాదులు సమర్పించుకునే వారు కనిపిస్తున్నారు.  ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు గ్రామాని కి కలెక్టర్ వస్తే ప్రజలు గౌవరంగా చూసే వారు కానీ ఇప్పుడు జిల్లా లు దగ్గర కావడంతో గ్రా మ స్థాయిలో పరిష్కారం జరిగే సమస్యను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నారని ఉన్నతమైన స్థానానికి ప్రజలు ఎ లాంటి గౌరవం ఇస్తున్నారో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. కొత్త జిల్లాతో దూరాభారం తగ్గించి, సుపరిపాలన అందించే లక్షంతో టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తజిల్లాలను ఏర్పాటు చేసింది..కొత్త జిల్లా ఏర్పాటుతో గతంలో పాత జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌కు వెళ్ళాలంటే దాదాపుగా 150 నుండి 200 కిలోమీటర్లు వెళ్ళాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ బాధ తప్పిందని ఇక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Tags:Shortage of officers in new districts

బిబిలోనే ఎయిమ్స్

date:23/04/2018
నల్గొండ ముచ్చట్లు:
 మూడున్నర సంవత్సరాల పోరాటంతో బీబీ నగర్ లో  ఎయిమ్స్ కేంద్రం ఓకే  చెప్పడంతో ఆ ప్రాంతాల్లో  ఆనందోత్సహాలు వెల్లివిరుస్తున్నాయి. ఎయిమ్స్ కు  కేంద్ర ఆర్థికశాఖ రూ. 3,400 కోట్లు ఎయిమ్స్ కోసం కేటాయించగా…. 2015లోనే సీఎం కేసీఆర్ బీబీనగర్‌కు విచ్చేసి ఎయిమ్స్ ఇస్తామని చేసిన ప్రకటన చేశారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనేక సార్లు ఢిల్లీ పెద్దలతో జరిపిన మంతనాలు, ఒత్తిడి వల్లనే ఎయిమ్స్ సాధ్యమైందది. ఇప్పటికి సేకరించిన 160 ఎకరాలతో పాటు మరో 40 ఎకరాల స్థలం కూడా సిద్ధంగా ఉంచారు ఇక్కడి గల సాయిల్ టెస్టు కూడా పూర్తి చేశార. నిర్మాణాలకు అనువైన స్థలమని కేంద్ర వైద్యశాఖ అధికారులు నిర్దారించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నిధులు కేటాయిస్తూ ఇచ్చిన లేఖను స్వయంగా కేంద్ర ఖర్చులు, పద్దుల శాఖ సంయుక్త కార్యదర్శి సునీల్‌శర్మకు అందజేశారు. సీఎం తమపై పెట్టిన గురుతర బాధ్యతను భుజాల మీద వేసుకుని అనేక సార్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులను, వైద్యశాఖ కార్యదర్శులను కలిశామని గుర్తు చేశారు ఎంపీ నర్సయ్య గౌడ్. ఎక్కడ విసుగు పడకుండా ఎన్నోసార్లు ఎయిమ్స్‌పై పోరాటం చేసిన స్థాయిలో స్పందించిన ఫలితంగా నిధుల విడుదల చేశారన్నారు వైద్యరంగంలో వినూత్న పోకడలకు ఎయిమ్స్ కేంద్రంగా కానుంది. మొదట్లో తెలంగాణకు ఎయిమ్స్ అవసరం లేదని కేంద్ర వైద్య శాఖ నిర్ధారించిందని గుర్తు చేశారు. దీనిపై అనేక పోరాటాలు చేసి రెండు సంవత్సరాల క్రితం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో ప్రకటన వెలువడేలా చేశామని  చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్నప్పటికీ కావాలని తెలంగాణకు ఆలస్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిమ్స్ ఏర్పాటుకు స్థలం సిద్ధంగా ఉంది. రైలు, రోడ్డు, విమాన సర్వీసులు సులభంగా అందుబాటులో ఉన్నాయి. అందువల్ల బీబీనగర్‌లో ఎయిమ్స్ చేయడం అనువైనదిగా  వివరించారు. ముఖ్యమంత్రి నిర్ణయం వెలువడిన తర్వాతనే ఎక్కడ ఏర్పాటవుతుందనే విషయం ఖాయమవుతుందని తెలిపారు. మూడు నాలుగు నెలల్లో కార్యాచరణ ప్రణాళిక అమలవుతుందని చెప్పారు.
Tags:Biblically Aims