భారత్ కు కామన్ వెల్త్ లో రెండు పతకాలు

-మల్లేశ్వరితో తర్వాత మీరుబాయే
Date:05/04/2018
న్యూఢిల్లీముచ్చట్లు:
కామన్వెల్త్ క్రీడల్లో తొలిరోజు భారత వెయిట్‌లిప్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. పురుషుల వెయిట్‌ లిఫ్టింగ్‌ 56 కేజీల విభాగంలో గురురాజా రజత పతకంతో భారత్‌కి తొలి పతకాన్ని అందించగా.. మీరాబాయి చాను స్వర్ణ పతకంతో సత్తా చాటింది. తద్వారా ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల పోటీల్లో సాయిఖోమ్ మీరాబాయి చానూ స్వర్ణ పతకం సాధించి, భారత పతాకాన్ని రెపరెపలాడించింది. వెయిట్ లిఫ్టింగ్ 48 కేజీల విభాగంలో పోటీ పడ్డ చానూ, మిగతావారికన్నా మిన్నగా రాణించి స్వర్ణపతకాన్ని ఎగరేసుకుపోయింది. ఈ పోటీల్లో ఇండియాకు లభించిన తొలి స్వర్ణ పతకం ఇదే. స్నాచ్ విభాగంలో తన మూడు అటెంప్ట్ లలో వరుసగా 80, 84, 86 కిలోల బరువును ఎత్తిన ఆమె, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో వరుసగా 103, 107, 110 కిలోల బరువును ఎత్తింది. మొత్తంగా 196 కిలోల బరువును ఎత్తిన ఆమె, కామన్వెల్త్ రికార్డును నెలకొల్పింది. కామన్వెల్త్‌లో 77 కిలోల బరువెత్తడమే అత్యధికం కాగా.. 86 కిలోల బరువెత్తిన ఈ మణిపురీ అమ్మాయి కామన్వెల్త్ రికార్డును బ్రేక్ చేసింది. ఓవరాల్‌గా 194 కిలోల బరువులెత్తిన ఆమె తన సమీప ప్రత్యర్థి కంటే 10 కిలోలు అధికంగా బరువులెత్తడం విశేషం. గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి రజతం సాధించింది. గత ఏడాది నవంబర్లో జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మీరాబాయి స్వర్ణం సాధించింది. తద్వారా కరణం మల్లీశ్వరీ తర్వాత ఈ ఘనత సాధించిన భారతీయ మహిళా వెయిట్‌లిఫ్టర్‌గా రికార్డు నెలకొల్పింది.
Tags:Two medals in Commonwealth for India

ఎడీబీ అధికారులను కలిసిన మేయర్ ప్రతినిధి  బృందం 

Date:05/04/2018
న్యూ డిల్లీ  ముచ్చట్లు:
గ్రేటర్ హైదారాబాదులో మౌలిక స‌దుపాయాల‌ కల్పన కు ఆర్డిక సహాయాన్ని అందించాలని కోరుతూ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ నేతృత్వం లో రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారుల బృందం న్యూ డిల్లీ లో నేడు ఆసియా అభివృద్ది బ్యాంక్ ఉన్నాతాదికారులను కలిసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రం లో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయని, వీటిలో ప్రధానంగా మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ, టీ- ఫైబర్,    డబుల్ బెడ్‌రూం ఇళ్ల‌ నిర్మాణం, ఎస్ఆర్డీపీ తదితర కార్యక్రమాలు ఉన్నాయని ఏడీబీ అడికారులకు వివరించారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె టీ ఆర్ ఆదేశాల మేరకు న్యూ డిల్లీ  లొని ఆసియా అభివృద్ది బ్యాంకు అధికారులను మేయర్ రామ్మోహన్ తో పాటు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యడర్శి అరవింద్ కుమార్, పరిశ్రమలు, ఐటీ శాఖ ముక్య కార్యదర్శి జయెశ్ రంజన్ లు సమావేశ మయ్యారు. ఎడీబీ న్యూ డిల్లీ మిషన్ డైరెక్టర్ యొకొయమా తో సమాయెశమై  తెలంగాణా లో ముక్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కాల్పనా రంగం లో చెపటీన పలు పధకాలను వివరించారు. ప్రడానంగా సిగ్నల్ ఫ్రీ ప్రయాణనీకీ  చేపట్టిన వ్యూహాత్మక రోడ్ల అభివృద్ది కార్యక్రమం,  హైదరాబాద్ మెట్రో రైల్,  లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్ల‌ నిర్మాణం, మూసి సుంద‌రీక‌ర‌ణ‌ ప్రాజెక్ట్ పనులు తదితర కార్యక్రమాలను మేయర్ రామ్మోహన్ వివరించారు. పలు అంతర్జాతీయ, జాతీయ సంస్థ‌లు  కూడా హైదరాబాద్ నగరాన్ని ప్రపoచం లొనే ఉత్తమ నివాసయొగ్యమైన నగరంగా ప్రకటించిన విషయాన్ని మేయర్ ఈ సందర్భంగా ఎడీబీ అడికారులకు గుర్తుచేశారు. త్వరలొనె ట్రామ్ రైల్ ను కూడా చెపట్టన్నున్నామని చెప్పారు. కాగా, త్వరలోనే  హైదరాబాద్ నగరాన్ని సందర్శించిన  అనంతరం ఆర్డిక సహాయాని అందించేందుకు సానుకూల నిర్ణయం టీసుకొనున్నట్టు ఎ డీ బీ ఇండియన్ మిషన్ హెడ్ యొకొయమా మేయర్ రామ్మోహన్ బృందానికి తెలుపారు.
Tags:Mayor’s delegation to meet ADB officials

శుక్రవారానికి రాజ్యసభ వాయిదా

 -సభలోనే తెదేపా సభ్యుల నిరసన
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
విపక్షాల ఆందోళనతో 21వ రోజు కూడా ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే గురువారం  రాజ్యసభ వాయిదా పడింది. తెదేపా, వైకాపా, కాంగ్రెస్‌, అన్నాడీఎంకే సభ్యుల నిరసనలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. రాజ్యసభ వాయిదా పడిన తర్వాత కూడా తెదేపా సభ్యులు సభలోనే కూర్చుని ప్లకార్డులతో నిరసన తెలిపారు. తెదేపా సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్‌, గరికపాటి మోహనరావు, కనకమేడల రవీంద్రకుమార్‌, సీతారామలక్ష్మిని సభ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు రాజ్యసభ సిబ్బంది, మార్షల్స్‌ ప్రయత్నించారు. ఈసందర్భంగా మార్షల్స్ తో టీడీపీ ఎంపీలు వాగ్వాదానికి దిగారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వచ్చేది లేదని తెదేపా ఎంపీలు స్పష్టం చేయడంతో ఉద్రిక్తత చాలాసేపు కొనసాగింది. సభ వాయిదా పడినా టీడీపీ ఎంపీలు సభలోనే కూర్చుని నినాదాలు చేశారు. అంతకుముందు టిడిపి వైకాపా, కాంగ్రెస్ సభ్యులు సభలో అరుస్తూ గందరగోళం సృష్టించారు.  సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు నినాదాలు ఆపలేదు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలోను ఎంపీలు సభ లోపలే కూర్చుని నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా విభజన హామీల కోసం అదే తీరులో సభలోనే కూర్చుని ఆందోళన చేపట్టారు. వారిని బయటకు తీసుకువెళ్లేందుకు మార్షల్స్ ప్రయత్నించారు. రాజ్యసభలో తెలుగుదేశం సభ్యులు ధర్నా చేస్తుంటే వారికి మద్దతుగా పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఆ పార్టీ లోక్ సభ సభ్యులు ధర్నా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీలు నెరవేర్చాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ తెలుగుదేశం ఎంపీలు ఆందోళన కొనసాగించారు.
Tags:Postponed to the Rajya Sabha on Friday

తెలంగాణపై ప్రశంసలు కురిపించిన మాజీ ప్రధాని

Date:05/04/2018
న్యూ ఢిల్లీ  ముచ్చట్లు:
గురువారం నాడు పార్లమెంట్ లాబీ ల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను తెరాస రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ,బడుగుల లింగయ్య యాదవ్ ,బండ ప్రకాష్ కలిసారు. రాజ్యసభ సభ్యుడు కేశవరావు కొత్త రాజ్యసభ సభ్యులను మన్మోహన్ కు పరిచయం చేసారు. ఈ సందర్భంగా కొద్ది సేపు తెరాస  రాజ్యసభ సభ్యులతో మాజీ ప్రధాని సంభాషించారు. దేశంలో అత్యుత్తమ పాలన సాగుతున్న రాష్ట్రం తెలంగాణ అంటూ మన్మోహన్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ అభివృద్ధి లో దూసుకు పోతోందని మన్మోహన్ కితాబు ఇచ్చారు. తెలంగాణ లో అభివృద్ధి ఇలాగే కొనసాగాలని మన్మోహన్ సింగ్ ఆకాంక్షించారు. తెలంగాణ లో తాగు నీరు ,సాగు నీటి అవసరాలు తీర్చేందుకు చేపడుతున్న పథకాలు ,కార్యక్రమాల గురించి మన్మోహన్ కు కేశవరావు వివరించారు. .ప్రజల కనీస అవసరాలు తీర్చే పనులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలు తనకు తెలుసు కనుకే పాలన ఉత్తమంగా సాగుతోందని మన్మోహన్  ప్రశంసించారు. చివరకు మన్మోహన్ సింగ్ ప్రశంసలకు తెరాస సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Tags:  Prime Minister who praised Telangana

కేంద్రం ఇష్టానుసారం వ్యవహరిస్తోంది : తెరాస ఎంపీలు

Date:05/04/2018
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
డిల్లీలోని  తెలంగాణ భవన్ లో ఎంపీలు, ఎమ్మెల్యేల సహాయక కార్యాలయాన్ని టీఆర్ఎస్ ఎంపీలు గురువారం  ప్రారంభించారు.  ఈ సందర్బంగా రాజ్యసభ సభ్యుడు కేశవ రావు మాట్లాడుతూ ఎంపీలకు అవసరమైన సదుపాయాల కల్పనకు ఒక ఉపయోగకరంగా  ఈఫెసిలిటషన్ సెంటర్ ఉంటుంది. రాబోయే రోజుల్లో మరింత ఉపయోగపడేలా సిద్ధం చేస్తామని అన్నారు.  రాష్ట్రంలో పరిపాలన చాలా బాగుంది అని నిన్న మన్మోహన్ సింగ్ మెచ్చుకున్నారు. బిల్స్ ఏవైనా అశాస్త్రీయంగా జరిగిన దాఖలాలు లేవని అన్నారు. మీకు బిల్లు పాస్ అవ్వడం మీకు ఇష్టం లేకపోతే పార్లమెంట్ నుండి బయటికి వెళ్లిపోవాల్సిందని అన్నారు.టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత జితేందర్ రెడ్డి మాట్లాడుతూ  ఎంపీలు అందరికి చాలా బాధాకరంగా ఉంది. తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోవడానికి, పార్లమెంటులో చర్చిద్దామని అనుకుంటే అంతా డ్రామా లాగానే సాగిందని అన్నారు రిజర్వేషన్ల విషయంలో స్పష్టత వస్తుందనుకుంటే రాకుండా పోయింది. కేంద్రం వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ మా సమస్యలను పరిష్కరించకపోవడం బాధాకరమని అన్నారు. రాబోయే రోజుల్లోనైనా పార్లమెంట్ సమావేశాలు సరిగ్గా జరిగి సమస్యల పరిష్కరించదిశగా ఉంటుందని ఆశిస్తున్నాం. మేము థర్డ్ ఫ్రంట్ అని ఎప్పుడూ చెప్పలేదు. ఫెడరల్ ఫ్రంట్ దిశగానే అడుగులు వేస్తున్నాం. పార్టీలను దగ్గరికి తీసుకొచ్చి అధికారం కోసం వెంటపడట్లేదని అన్నారు.
Tags:The Center is acting in favor of TRS MPs

పుంగనూరులో రంగ స్థలం సినిమా పేరుతో థియేటర్ల టికెట్‌ న్యూ పేరుతో దోపిడి

– ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రేక్షకులు
– పట్టించుకోని అధికారులు

Date:05/04/2018

పుంగనూరు ముచ్చట్లు:

ప్రముఖ సినినటుడు రామచరణ్‌తేజ హిరోగా నిర్మించిన రంగస్థలం సినిమా కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు థియెటర్ల వద్ద టికెట్లకై పోరాటం చేస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న థియెటర్‌ యజమానులు ప్రజలను దోపిడి చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పుంగనూరు పట్టణంలోని బాలాజి థియెటర్‌ వారు సాంకేతికంగా ఒక అడుగు ముందుకేశారు. టికెట్‌న్యూ పేరుతో ఫోన్‌ య్యాప్‌ను విడుదల చేశారు. ఇందులో వెహోదటి తరగతి వందరూపాయలతో ప్రారంభం చేసి డబ్బులు దోపిడి చేస్తున్నారు. అలాగే రెండు , మూడు తరగతులను థియెటర్‌ వద్ద టికెట్లు ఇస్తూ , ఒకొక్క టికెట్‌ వందరూపాయలకు విక్రయిస్తుండటంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్య తీసుకోవాల్సిన మున్సిపల్‌ , రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో రంగస్థలం పేరుతో ప్రజలను థియెటర్‌ యజమానులు దోపిడి చేస్తున్నారు. ఈ విషయమై తహశీల్ధార్‌ మాదవరాజును వివరణ కోరగా ఈ విషయమై ఫిర్యాదు వచ్చిందని , తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Theater ticket in the name of the movie Punganaru is titled New Name
Theater ticket in the name of the movie Punganaru is titled New Name

Tags: Theater ticket in the name of the movie Punganaru is titled New Name

పాకిస్తాన్ టెర్రరిస్ట్ కేంద్రం…

-తేల్చి చెప్పిన యూఎన్ నివేదిక
Date:05/04/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన ‘నిషిద్ధ ఉగ్రవాద సంస్థ’ల జాబితాలో పాకిస్థాన్‌కు చెందిన 139 సంస్థలు ఉన్నాయి. పాకిస్థాన్ మీడియాలో ఇందుకు సంబంధించిన కథనాలు ప్రసారమయ్యాయి. సంస్థలు, వ్యక్తులతో ఐక్యరాజ్యసమితి విడుదలచేసిన జాబితాలో అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ వారసుడు… అయిమాన్‌ అల్‌ జవహరీ పేరు అగ్రస్థానంలో ఉండటం విశేషం. ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ నేతృత్వంలోని లష్కరే తోయిబా వంటి సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు పాక్‌ మీడియా వెల్లడించింది. హఫీజ్‌ సయీద్‌ పేరు ఇంటర్‌పోల్‌ వాంటెడ్‌ జాబితాలో కూడా ఉందని మీడియా వెల్లడించింది. 2008లో ముంబయి దాడుల్లో ఆరుగురు అమెరికన్లతో సహా 166 మందిని మట్టుపెట్టిన కేసులో లష్కరేతోయిబా కీలకపాత్ర పోషించిందన్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం పేరు కూడా ఉన్నట్లు పాక్ మీడియా తెలిపింది. జాబితాలోని మరికొన్ని సంస్థలు: జైషేమహ్మద్‌, ఆఫ్ఘన్‌ సపోర్ట్‌ కమిటీ, లష్కర్‌ ఏ జాంఘ్వి, అల్‌ అక్తర్‌ ట్రస్ట్‌ ఇంటర్నేషనల్‌, హర్కతుల్‌ జిహాద్‌ ఇస్లామీ, తెహ్రీక్‌-ఇ- తాలిబన్‌ పాకిస్తాన్‌, జమాతుల్‌ అహ్రర్‌, ఖాటిబా ఇమామ్‌ అల్‌ బుఖారీ వంటి వారి పేర్లు కూడా వున్నాయి. వీరిలో అధికశాతం మంది ఆఫ్ఘన్‌-పాక్‌ సరిహద్దు ప్రాంతంలోనే నివసిస్తున్నారని మీడియా వెల్లడించింది. ఈ సంస్థలన్నీ కూడా పాక్ కేంద్రంగానే పనిచేస్తున్నాయని తెలిపింది.
Tags: Pakistan Terrorist Center …

నాలుగేళ్లలో ప్రధాని విదేశీ ఖర్చు 442 కోట్లు

Date:05/04/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ప్రపంచంలో మరే ప్రధాని.. ఒక్క ఏడాదిలో నరేంద్ర మోదీ చేసినన్ని విదేశీ యాత్రలు చేసి ఉండకపోవచ్చు. 2014 నుంచి 2016 వరకు మోదీ విదేశీ యాత్రల్లో బిజీగా గడిపేశారు. అయితే, 2017 నుంచి యాత్రలు కాస్త తగ్గించారు. దీంతో ఆయన విదేశీ యాత్రల ఖర్చులు సగానికి తగ్గాయి. నాలుగేళ్లలో ప్రధాని మొత్తం విదేశీ ప్రయాణాల ఖర్చు రూ.442.4 కోట్లు కావడం గమనార్హం.మోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 35 రోజుల పాటు విదేశాల్లోనే గడిపారు. 2014 జూన్ నుంచి డిసెంబరు వరకు ఆయన విదేశీ యాత్రకుల పెట్టిన ఖర్చు.. రూ.77.9 కోట్లు.
2015లో మోదీ మొత్తం 57 రోజుల పాటు విదేశాల్లో గడిపారు. ఈ ప్రయాణాలకైన ఖర్చు రూ.134 కోట్లు.
2016లో ఆయన విదేశీ ప్రయాణాల సంఖ్య 29కు తగ్గింది. ఇందుకు దాదాపు రూ.152 కోట్లు ఖర్చు పెట్టారు.
2017లో మోదీ మొత్తం 32 రోజులు విదేశాల్లో గడిపారు. ఇందుకు రూ.76.5 కోట్లు ఖర్చయ్యాయి. అంటే, 2016తో పోల్చితే ఈ ఖర్చులు సగానికి తగ్గాయి.
2018లో ఇప్పటి వరకు ప్రధాని ఆరు రోజుల పాటు విదేశాల్లో గడిపారు. రానున్న రోజుల్లో మరికొన్ని దేశాలు ఆయన పర్యటించనున్నట్లు తెలిసింది.
అత్యధికం: 2015 ఏప్రిల్‌లో మోదీ ఫ్రాన్స్, జర్మనీ, కెనడాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.31.2 కోట్లు ఖర్చు పెట్టారు.
అత్యల్పం: మోదీ 2014, జూన్‌లో మోదీ భూటాన్ వెళ్లారు. ఇందుకు రూ.2.45 కోట్లు వ్యయమైంది. ఇప్పటి వరకు ఆయన చేసిన విదేశీ ప్రయాణాల్లో ఇదే అత్యల్పం. ఈ వివరాలను ప్రముఖ వాణిజ్య పత్రిక ‘బిజినెస్ స్టాండర్డ్’ వెబ్‌సైట్ వెల్లడించింది. ఈ వివరాలన్నీ ప్రభుత్వం నుంచి సేకరించినట్లు పేర్కొంది.
Tags : In the four years, the Prime Minister’s foreign expenses amount to 442 crores