బెజవాడ హోటల్ లో అశ్లీల నృత్యాలు… పోలీసుల దాడులు…అదుపులో యాభై మంది 

Pornography dances in the Bejawada hotel ... police raids ... fifty people in custody

Pornography dances in the Bejawada hotel ... police raids ... fifty people in custody

Date:19/07/2018
విజయవాడ ముచ్చట్లు:
విజయవాడ భవానీపురం లోని ఆలీవ్ ట్రీ హోటల్ పై అర్ధరాత్రి పోలీసుల దాడి చేసారు. మహిళలతో అసభ్య నృత్యాలు నిర్వహిస్తున్నారనే సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించారు. యాబై మంది పురుషులను అదుపు లోకి తీసుకున్నారు. అధికారపార్టీకి చెందిన ఓ నేత ముఖ్య అనుచరుడు ఆద్వర్యంలో పార్టీ జరిగిందని సమాచారం. హైదరాబాద్ కు చెందిన కొందరు ప్రైవేట్ ఈవెంట్ యాంకర్లను తీసుకువచ్చి అసభ్య నృత్యాలు జరిపించినట్లు పోలీసులు నిర్దారించారు. ఈ పోలీసుల దాడిలో మరో అయిదుగురు యాంకర్లని తప్పించినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులకు పట్టుబడిన వారిలో 10 మందిని వన్ టౌన్, 15 మందిని భవానీపురం, 10 మందిని ఇబ్రహీంపట్నం, మరో పదిమంది ని గవర్నర్ పేట పిఎస్ లకు తరలించారు. అయిదుగురు యువతులను వాసవ్య మహిళా మండలికి అప్పగించారు. ఈ  యువతులు హైదరాబాద్, భీమవరం, విహయవాడకు చెందిన వారిగా  గుర్తించారు. నిందితులపై 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. భీమవరానికి చెందిన నలుగురు, హైదరాబాద్కు చెందిన ఒకరు, విజయవాడకు చెందిన మహిళను కుడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  పార్టీ జరుగుతున్న ప్రాంతంలో పెద్ద ఎత్తున మద్యం, కండోమ్ ప్యాకెట్లు లభ్యం అయినట్లు చెబుతున్నారు.
బెజవాడ హోటల్ లో అశ్లీల నృత్యాలు… పోలీసుల దాడులు…అదుపులో యాభై మంది https://www.telugumuchatlu.com/pornography-dances-in-the-bejawada-hotel-police-raids-fifty-people-in-custody/
Tags:Pornography dances in the Bejawada hotel … police raids … fifty people in custody

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *