Date:07/11/2019
హైదరాబాద్ ముచ్చట్లు:
పదవులు అలంకారప్రాయం కాకూడదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం నేడు జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. 2014లో తెలంగాణకు విముక్తి జరిగితే.. చొప్పదండి నియోజకవర్గానికి మాత్రం 2018లో విముక్తి జరిగిందన్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా సీఎం కేసీఆర్ వరాలు ఇచ్చినా ఇక్కడ మాత్రం ఉద్యమకారులకు న్యాయం జరగలేదన్నారు. ఎమ్మెల్యేగా సుంకె రవిశంకర్ ఎన్నికైన తర్వాతనే ఉద్యమకారులకు సముచిత స్థానం దక్కిందన్నారు. రైతులకు సేవ చేయడానికి దక్కిన అధ్బుత అవకాశం మార్కెట్ కమిటీ పదవులు. రైతులు ఇబ్బంది పడకుండా పాలకవర్గం సభ్యులు బాధ్యతతో పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు.
Tags: Positions should not be decorative: Minister Ganguly