Positive cases in Nagalapuram

నాగలాపురం లో పాజిటివ్ కేసులు

Date:09/05/2020

నాగలాపురం ముచ్చట్లు:

నాగలాపురం మండలంలో 10 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్య శాఖ నుంచి సమాచారం ఉందని నాగలాపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి నాగరాజు పేర్కొన్నారు. ఈ రోజు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా,ఎస్పీ సెంథిల్ కుమార్, ఇతర అధికారులు ఈ ప్రాంతానికి వచ్చే ఆస్కారం ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యాలయలో అధికారులు ఈ రోజు ఉదయం తప్పక హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. శుక్రవారం ఒక్క రోజే నియోజకవర్గంలో 14 పాజిటివ్ కేసులు నమోదు కావడం పై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కూరగాయల కోసం ఈ ప్రాంత వ్యాపారులు ప్రతిరోజు తమిళనాడు కోయంబేడు మార్కెట్ కు వెళ్లి కూరగాయలు వాహనాల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ విక్రయించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పలువురికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు తలుస్తోంది.

భారత్‌లో 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,320

Tags: Positive cases in Nagalapuram

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *