Natyam ad

363 గ్రాముల బంగారు, 100 గ్రాముల వెండి, 1లక్ష 90 వేల రూపాయల నగదు, 15 మోటార్ సైకిళ్ళు స్వాదీనం

✅ జిల్లాలో అనేక చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్న వారి ఆటకట్టించిన పోలీసులు.

✅ ఐదు మందిని అరెస్టు చేసి నలభై లక్షల రూపాయల చోరీ సోత్తును స్వాధీనం.

✅ దొంగతనాలను అరికట్టడానికి ప్రత్యేక కార్యచరణలు చేపట్టాము. ఇప్పటికే రంగంలో ప్రత్యేక క్రైమ్ బృందాలు పనిచేస్తూ ఉంది.

Post Midle

✅ అనుమానిత వ్యక్తులు తారసపడితే దైల్ 100 కి సమాచారం ఇవ్వండి.

తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఐపీఎస్..

 

తిరుపతి  ముచ్చట్లు:

 

తిరుపతి జిల్లా చంద్రగిరి సబ్ డివిజన్ పరిధిలో ఇటీవల కాలంలో తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగతోపాటు తిరుపతి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తులను కూడా అరెస్టు చేసి వారి వద్ద నుండి 363 గ్రాముల బంగారు, 100 గ్రాముల వెండి, 1లక్ష 90 వేల రూపాయల నగదు, 15 మోటార్ సైకిళ్ళు, ఎలక్ట్రిక్ పరికరాలు బోరు మోటార్,ఐరన్ కట్టర్, గ్రైండర్ లను స్వాధీనం చేసుకుని ఐదు మంది అరెస్టు చేశామని వీరు 28 కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఈ మధ్యకాలంలో జిల్లా వ్యాప్తంగా చూస్తే కొంతమేర దొంగతనాలు తగ్గుముఖం పట్టాయని పోలీస్ శాఖ కూడా దొంగతనాలన్ని నివారించడానికి ప్రత్యేక కార్యచరణలతో ముందుకు వెళుతుందని ఇప్పటికే క్రైమ్ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక క్రైమ్ బృందాలు రంగంలో దిగి పనిచేస్తుందని ప్రస్తుతం కొన్ని దొంగతనాల తీరును పరిశీలిస్తే ఎక్కువ భాగం జల్సాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడిన జులాయిలే కనిపిస్తున్నారని ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని అపార్ట్మెంట్లో, కాలనీలలో, సొసైటీలకు సంబంధించిన వారు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తద్వారా కొంతమేర దొంగతనాలను అరికట్ట వచ్చని అన్నారు.ప్రజలు ఎవరైనా సుదూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పోలీస్ శాఖ వారు ఉచితంగా ఏర్పాటు చేసే LHMS కెమెరాలను పెట్టుకోవాలని తద్వారా తిరిగి ఇంటికి వచ్చేంతవరకు కెమెరాల నిఘాతోపాటు పోలీస్ నిగా కూడా ప్రత్యేకంగా ఉంటుందన్నారు మీ పరిసర ప్రాంతాలలో అనుమానిస్పద వ్యక్తులు ఎవరైనా తారసపడితే వెంటనే డయల్ 100 కి సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి జిల్లా ఎస్పీ  చేశారు.ఈ కేసును చేదించడంలో విశేష ప్రతిభ కనబరిచిన అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ  అభినందించి క్యాష్ నగదు రివార్డును ఇచ్చారు.ఈ పత్రికా సమావేశం నందు అడిషనల్ యస్.పి క్రైమ్ విమల కుమారి మేడం , చంద్రగిరి యస్.డి.పి.ఓ యశ్వంత్, చంద్రగిరి సి.ఐ రాజశేఖర్ మరియు చంద్రగిరిసబ్ డివిజన్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags: Possession of 363 grams of gold, 100 grams of silver, 1 lakh 90 thousand rupees in cash, 15 motorcycles

Post Midle