Natyam ad

 ఖమ్మంలో 60 ఎకరాలు కబ్జా

ఖమ్మం  ముచ్చట్లు:


కారేపల్లి పెద్ద చెరువు శిఖం భూమి ఆక్రమణలకు గురైంది. 60 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని మత్య్సకారులు జిల్లా కలెక్టర్ కు వివిధ శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. సమస్యపై దృష్టి సారించి, శిఖం భూమి సర్వే చేపట్టాలని కోరుతూ మత్య్సకారులు రెండునెలలుగా రిలే నిరహార దీక్ష చేశారు. సర్వే చేసి, నివేదిక పంపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినా స్థానిక అధికారులు బేఖాతర్ చేస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 184 ఎకరాల శిఖం భూమిలో 60 ఎకరాల దాకా కబ్జాదారులపాలై, చెరువు కుంచించుకుపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో చివరికి మత్య్సకారులే ఆ చెరువును కాపాడడం కోసం నడుం బిగించారు. రెండు నెలల క్రితం అడిషనల్ కలెక్టర్ మొగిలి స్నేహలత చెరువు శిఖం భూములలో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు పరిశీలనకు వచ్చారు.మత్స్యకారులు, వివిధ పార్టీల నాయకులు అడిషనల్ కలెక్టర్ ను అడ్డుకుని, చెరువు శిఖంలో క్రీడాప్రాంగణం నిర్మాణం విరమించుకోవాలని ఆందోళన చేశారు. దీంతోపాటు పూర్తిస్థాయి సర్వే చేయించి, చెరువుకు హద్దులు నిర్ణయించాలని జిల్లా మంత్రి పువ్వాడకు, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు వినతిపత్రాలు ఇచ్చారు.

 

 

ఆలస్యంగానైనా స్పందించిన జిల్లా కలెక్టర్ సర్వే చేయించి, నివేదక సమర్పించమని, నెల రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలకు సర్వే ప్రారంభించిన రెవెన్యూబృందం వర్షం కారణంగా నిలిపివేశారు. తిరిగి మళ్ళీ చేపట్టకపోవడంతో మత్య్సకారులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. 2 వారాల క్రితం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ కారేపల్లి వచ్చినప్పుడు మత్స్యకారులు, కలెక్టర్ ను కలిసి, చెరువు సమస్యను విన్నవించారు. కలెక్టర్ వెంటనే తానే చెరువును పరిశీలిస్తానని, చెరువు వద్దకు వెళ్ళి శిఖంభూములను పరిశీలించారు.శిఖంలో నుండి రోడ్డు వేయడం, కొన్ని ఆక్రమణలను చూసిన కలెక్టర్ స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా సర్వే పూర్తి చేసి, నివేదిక సమర్పించాలని మండల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ స్వయంగా పరిశీలించి, ఆదేశించి కూడా రెండువారాలు దాటినా సర్వే పనులు చేపట్టలేదు. జిల్లా అధికారులు ఆదేశించినా జాప్యం జరగడానికి కారణాలపై రకరకాల సాకులు తలెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరు శిఖం భూమి కబ్జాదారులకు కొమ్ముకాస్తున్నారని, దాని వల్లే స్థానిక అధికారులు సర్వే చేయడంలో చిత్తశుద్ధిగా వ్యవహరించడం లేదని ఆరోపణలు ఉన్నాయి.

 

Post Midle

Tags: Possession of 60 acres in Khammam

Post Midle

Leave A Reply

Your email address will not be published.