నకిలీ లేఖ స్వాధీనం

Date:14/12/2019

తిరుమల ముచ్చట్లు:

తిరుమలలోని సిఫారసు లేఖల విషయంలో మరో నయామోసం బయటపడింది. తాను ఐఆర్‌ఎస్‌ అధికారినని, ముంబయిలో ఇంటెలిజెన్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నానంటూ గుంటూరుకు చెందిన వెంకటరత్నారెడ్డి శ్రీవారి దర్శనానికి పంపిన సిఫారసు లేఖలు నకిలీవని జేఈఓ కార్యాలయం సిబ్బంది గుర్తించారు. గత కొన్నాళ్లుగా జరుగుతున్న ఈ తంతును గుర్తించిన సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రత్నారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.గతంలోనూ ఇదే తరహాలో నకిలీ లేఖలతో రత్నారెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. నకిలీ అధికారి బాగోతం బయటపడడంతో ఉన్నతాధికారులు సిఫారసు లేఖలను కూడా జేఈఓ కార్యాలయం సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

 

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా కార్తికేయ హీరోగా “చావు కబురు చల్లగా”

 

Tags:Possession of a fake letter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *